వెన్నెలకంటి అన్నయ్య
వెన్నెలకంటి అన్నయ్య క్రీ. శ. 15 వ శతాబ్దపు ఉత్తరార్ద కాలానికి చెందిన తెలుగు కవి. ఇతను షోడశకుమార చరిత్ర అనే కథాకావ్యాన్ని తెలుగులో రాసాడు.[1]
వెన్నెలకంటి అన్నయ్య | |
---|---|
ఇతర పేర్లు | వెన్నెలకంటి అన్నయ |
వృత్తి | రచయిత, కవి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | షోడశకుమార చరిత్ర |
తల్లిదండ్రులు |
|
కవి కాలాదులు
మార్చువెన్నెలకంటి అన్నయ్య గురించిన విశేషాలు కొద్దిగానే తెలుస్తున్నాయి. ఇతని జీవితకాలం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. సాహితీ పరిశోధకులు నిడదవోలు వెంకటరావు ఇతను 13 వ శతాబ్దానికి చెంది ఉండవచ్చని గతంలో అభిప్రాయపడ్డారు. అయితే నేడు అత్యధికులు ఇతనిని 15 వ శతాబ్దపు ఉత్తరార్ద కాలంలో జీవించిన కవిగా గుర్తిస్తున్నారు. వెన్నెలకంటి అన్నయ్యను, పంచతంత్రం రచించిన దూబగుంట నారాయణ కవికి (క్రీ. శ. 1470) సమకాలికునిగా భావిస్తారు. ఇతని తండ్రి వెన్నెలకంటి సూరామాత్యుడు.
రచనలు
మార్చువెన్నెలకంటి అన్నయ్య రచించిన ఏకైక కృతి షోడశకుమార చరిత్ర. ఎనిమిది అశ్వాసాలు గల ఈ తెలుగు కథాకావ్యం పూర్తిగా లభించడం లేదు. వెన్నెలకంటి అన్నయ్య దీనిని తన తండ్రి వెన్నెలకంటి సూరామాత్యునికి అంకితమిచ్చాడు. ఈ కథా కావ్యంలో కమలాకరుడనే రాకుమారుడు, అతని 15 మంది స్నేహితులు- మొత్తం 16 మంది కుమారులు (షోడశకుమారులు) ఒక ఆపదలో పడి విడిపోయి చెల్లా చెదురై తిరిగి కలసుకోవడం, వారు పొందిన చిత్ర విచిత్ర అనుభవాలను కమలాకరునితో పంచుకోవడం ప్రధాన ఇతివృత్తంగా వుంది.[2]
శైలి
మార్చుఅన్నయ్య శైలి సరళసులభంగా, ధారాళంగా వుంది. ఒక కథను కొనసాగిస్తున్నప్పుడు మధ్యలో ఆగి వర్ణనలు చేయడం, పాత్రల భావాలను చిత్రించడం తక్కువగా వుంటుంది. దీనివలన కథా గమనం ధారాళంగా సాగిపోతుంది. సందర్భానుసారం చేసిన కొద్ది పాటి వర్ణనలు కూడా రమణీయంగా చక్కని ఉపమానాలతో అలరారుతాయి.
ఇవి కూడా చూడండి
మార్చురిఫరెన్సులు
మార్చు- ఆరుద్ర. సమగ్ర ఆంద్ర సాహిత్యం - సంపుటి V (గజపతుల యుగం) (1965, ఆగష్టు ed.). మద్రాస్: యం. శేషాచలం అండ్ కంపెనీ.
- ముదిగంటి సుజాతారెడ్డి. ఆంధ్రుల సంస్కృతి సాహిత్య చరిత్ర (తొలి ముద్రణ 1989, 2009 ed.). హైదరాబాద్: తెలుగు అకాడమి.
మూలాలు
మార్చు- ↑ వెన్నెలకంటి అన్నయ్య (1934). షోడశకుమారచరిత్రము. కాకినాడ: ఆంధ్ర సాహిత్య పరిషత్తు.
- ↑ ముదిగంటి సుజాతారెడ్డి 2009, p. 56.