వెయిస్ట్ కోట్
వెయిస్ట్ కోట్ అనునది సూట్ లోని ఒక భాగము. ఇది చొక్కా పైన, కోటు లోపల వేసుకొనే ఒక చేతులు లేని (స్లీవ్ లెస్) కోటు. దీని ముందు భాగం బయటికి కనబడుతుంది కాబట్టి ఒక వస్త్రంతోను వెనుక భాగం కనబడదు కాబట్టి దానిని ఇంకొక వస్త్రంతోను కుడతారు. దీనికి కాలరు గానీ, ల్యాపెల్ గానీ ఉండవు.
లక్షణాలు, వాడుక
మార్చుఎప్పటికీ సింగిల్ బ్రెస్ట్ యే అయి ఉండవలసిన అవసరము లేదు. కోటు డబుల్ బ్రెస్ట్ అయిననూ కాకున్ననూ వెయిస్ట్ కోట్ డబుల్ బ్రెస్ట్ అయి ఉండవచ్చును.
చేతి వాచీలు లేక మునుపు వెయిస్ట్ కోట్ యొక్క ముందు జేబులో గొలుసు గల వాచీని దాచుకొనేవారు.
బెల్టు కాకుండా దీని క్రింద కనబడకుండా సస్పెండర్లు ఉండేవి.
సినిమాలలో వెయిస్ట్ కోట్
మార్చుప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ఘజిని చిత్రం లో హాఫ్ షర్టు ని జబ్బల వరకు మడిచి, కోటు వేసుకోకుండా, కేవలం (ల్యాపెల్ ఉన్న) వెయిస్ట్ కోట్ ని మాత్రమే ధరించి కనబడ్డాడు.
చిత్రమాలిక
మార్చు-
1995లో విడుదలైన ప్రేమించి పెళ్ళాడుతా లో ల్యాపెల్ లేని ఫైవ్ బటన్డ్ వెయిస్ట్ కోట్ ధరించిన షారుఖ్
-
2009 లో విడుదలైన ఘజిని లో వాన్ హాయ్సెన్ వస్త్ర తయారీ సంస్థ రూపొందించిన ల్యాపెల్ గల వెయిస్ట్ కోట్ ధరించిన అమీర్ ఖాన్