భారతీయ దుస్తులు
భారత సంస్కృతికి అద్దంపట్టే భారతీయ దుస్తులు ప్రపంచానికి ఆదర్శాలు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా ఉండే భారతీయ దుస్తుల పై విభిన్న సంస్కృతుల (ఆర్యుల సంస్కృతి, హిందూ సంస్కృతి, ద్రవిడ సంస్కృతి, పర్షియన్ సంస్కృతి, అరబ్బు సంస్కృతి, పంజాబీ సంస్కృతి, టిబెటన్ సంస్కృతి) ఆయా ప్రదేశాల భౌగోళిక/వాతావరణ పరిస్థితుల, సంప్రదాయాల ప్రభావం గోచరిస్తుంది. ప్రాథమిక ఆచ్ఛాదననిచ్చే లంగోటీ ల నుండి రోజువారీ జీవితంలో ధరించే దుస్తులు, ప్రత్యేక సందర్భాలలో ధరించే దుస్తులు, నాట్యానికి రూపొందించిన ప్రత్యేకమైన దుస్తులన్నింటిలోనూ ఈ ప్రభావాలు కనబడతాయి. పట్టణ ప్రాంతాలలో పాశ్చాత్య దుస్తుల వైపే ఎక్కువ మొగ్గు ఉన్ననూ, భారతీయత ఉట్టిపడే దుస్తులకు అక్కడ కూడా కొదవ లేదు. నేత, రంగులు మతానుసారం, సందర్భానుసారం ఉంటాయి. ఉదా: హిందువులు నలుపు రంగు దుస్తులు పూజ సమయంలో ఉపయోగించరు కానీముస్లిం స్త్రీలు ప్రార్థన చేసుకునే సమయంలో ఎక్కువగా నలుపు రంగు బురఖా ఎక్కువగా ధరిస్తుంటారు . ఇన్ని విభిన్న సంస్కృతులున్ననూ, వీటన్నిటీ సమ్మేళణంగా ప్రత్యేకమైన భారతీయ సంస్కృతి కానవస్తుంది.
చరిత్రలో
మార్చుభారతదేశ వస్త్ర చరిత్ర 5వ శతాబ్దం నాటి నూలుని అల్లి, నేసి, దానికి రంగులద్దిన సింధు లోయ నాగరికత నుండి మొదలవుతుంది. ఎముకలతో చేసిన కుట్టు సూదులు, చెక్కతో చేసిన నూలు వడికే యంత్రాలు త్రవ్వకాలలో వెలువడ్డాయి. అప్పటి పత్తి పరిశ్రమ చాలా అభివృద్ధి చెందినదై ఉండి, అప్పటి చాలా పద్ధతులు ఇప్పటికి కూడా వినియోగంలో ఉన్నాయి. తేమ తక్కువగా ఉండి, అధిక వేడి గల ఉపఖండా వేసవులకి పత్తితో చేసిన వస్త్రాలు సౌకర్యవంతంగా ఉండేవి. పురాతన భారతీయ దుస్తుల పై లభ్యమైన ప్రస్తుత పరిజ్ఞానం చాలా వరకు ఎల్లోరా వంటి రాతి శిల్పాలు, గుహ సముదాయాల్లో ఉండే చిత్రాలతో వచ్చింది. ఈ చిత్రాలలో నృత్యకారులు, దేవతలు చీరలని ధోవతి కట్టు వలె కట్టినట్లు ఉన్నాయి. ఇటీవలె హరప్పన్ పూసలలో దొరికిన పట్టు దారాలపై జరిగిన విశ్లేషణలు బట్టి చూస్తే తొలి శతాబ్దాలలో చైనీయులకి మాత్రమే తెలిసిన తిరగళ్ళ ద్వారా పట్టుని ఉత్పత్తి చేసేవారని తేలినది. భారతీయ దుస్తులలో ప్రముఖమైనవి.
స్రీల దుస్తులు
మార్చుచీర
మార్చుచీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైనది చీర. చీర అత్యంత పొడవైన వస్త్రము; ఇది నాలుగు నుండి తొమ్మిది మీటర్లుంటుంది. చీరను ఎక్కువమంది నడుంచుట్టు కట్టుకొని ఒక చివర భుజం మీదనుండి వెనుకకు వేసుకుంటారు చీరలోపల క్రిందభాగంలో లంగాను పైభాగంలో రవికె ధరించడం సరైన పద్ధతి.ఉత్తర భారతంలో ఎక్కువగా పైట కుడివైపుకు వేసుకుంటారు దక్షిణ భారతంలో ఎడమ వైపు పైట వేసుకుంటారు.
పట్టుచీర
మార్చుపట్టు దారంతో అల్లిన మెత్తని చీర ను పట్టుచీర అంటారు. భారతదేశంలో అన్ని శుభకార్యాలకు, పండుగ లకు ఎక్కువగా పట్టుచీరలు ధరించడానికి ఇష్టపడతారు.
పెళ్ళిళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా పట్టు చీరలు కట్టాలనుకుంటుంటారు. హిందూ సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు, నైలెక్స్ చీరల ధరలు కూడా ఎక్కువే.
రవికె/జాకెట్టు/చోళీ
మార్చురవికె లేదా చోలీ లేదా జాకెట్టు భారతదేశంలో స్త్రీలు శరీరం పై భాగాన్ని అనగా వక్ష స్థలమును కప్పుకోవడానికి వారికి తగిన విధముగా వస్త్రముతో కుట్టబడి ఉపయోగించేది. దక్షిణ నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్,, చీరలు ధరించే ఇతర ప్రదేశాలలో ధరిస్తారు. దీని మీద చీర యొక్క పైట భాగం కప్పుతుంది. ఆధునిక కాలంలో దీనిలోపల బ్రా కూడా ధరిస్తున్నారు. భారతదేశంలో ధరించబడే గాగ్రా ఛోళీలో కూడా ఇది ఒక భాగము. శరీరానికి హత్తుకునేంత బిగుతుగా చిన్న చేతులతోలో నెక్ తో చోళీని రూపొందిస్తారు. వక్ష స్థలము క్రింద నుండి నాభి వరకు బహిర్గతం అయ్యేలా కత్తిరించబడటం వలన దక్షిణాసియా వేసవులలో సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి దక్షిణాసియా దేశాలలో స్త్రీలు ప్రధానంగా ధరించే పై వస్త్రాలు.
లంగా
మార్చులంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తులు లో ఒకటి. లంగాకు నాడాలు ఉంటాయి. ముడి నడుముకి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా (పావడ/పరికిణీ) .
పెళ్ళైనవారు చీర లోపల కనిపించకుండా ధరిస్తారు. ఇది సామాన్యంగా నూలుతో చేసినదై ఉంటుంది.
అయితే పెళ్ళికి ముందు లంగా ఓణిలు కలిపి ధరించడం ఆంధ్రదేశంలో సాంప్రదాయంగా ఉండేది. ఇవి పండుగలలో పట్టుతో చేసి వివిధ రంగులలో అంచులతో అందంగా కనిపిస్తాయి. పైలంగాలను పైట లోపల, బయటికి కనిపించేలా (లోపలి లంగా పైన) ధరిస్తారు.
ఓణీ/పరికిణి
మార్చులంగా ఓణి దక్షిణ భారతదేశంలోని స్త్రీలు ధరించే సాంప్రదాయక దుస్తులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో యుక్తవయస్సులోని అవివాహితులైన స్త్రీలు ధరిస్తారు. దీనిని తమిళులు ధావనిగా పిలుస్తారు.
ఓణి లేదా లంగా ఓణి లేదా పైట పావడ, అవివాహిత యువతులు ధరించే దక్షిణ భారత సాంప్రదాయిక దుస్తులు. ఓణి చీర అంత పెద్దగా ఉండదు. కాబట్టి ఇది నడుము నుండి పాదాల వరకు/ముందు వైపు సింహ భాగం, వెనుక కొంత భాగం ఆచ్ఛాదన నివ్వదు. అందుకే దీని క్రింద (లోపలి లంగా పైన) పై లంగా వేసుకొంటారు. చీర వలె దీనికి కుచ్చిళ్ళు కట్టరు. ఉదరం నుండి నడుము మీదుగా ఒకే ఒక చుట్టుగా వెళ్ళి మరల ఉదరము నుండి వక్షోజాలను కప్పుతూ భుజము పైకి వెళ్ళి మిగిలిన భాగం పైటగా వెనక్కి వెళ్తుంది. దీనిని వివాహిత స్త్రీలు ధరించరు. ఆంగ్లంలో దీనిని హాఫ్ సారీ (Half Saree) అని సంబోధిస్తారు.
సల్వార్ కమీజ్
మార్చుసల్వార్ కమీజ్ అనునవి దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ లలో స్త్రీ పురుషులిరువురి చే ధరింపబడే దుస్తులు. సల్వార్ అనగా పైజామా వలె ఉండే నడుము నుండి కాళ్ల వరకు ఆచ్ఛాదననిచ్చే వస్త్రము. నడుము వద్ద వదులుగా ఉండి క్రిందకు వెళ్ళే కొద్దీ బిగుతుగా ఉంటాయి. కమీజ్ అనగా కుర్తా వలె ఉండే చేతులకి, గొంతు నుండి నడుము వరకు, లేదా తొడల, మోకాళ్ళ, లేదా పిక్కల వరకూ ఆచ్ఛాదన నిచ్చే వస్త్రము. కమీజ్ కి నడుము వద్ద నుండి క్రింద వరకు ఉండే చీలికలు కదలికకై స్వేచ్ఛని ఇస్తాయి.
భారతీయ స్త్రీల దుస్తుల చిత్రమాలిక
మార్చు-
ఎంబ్రాయిడరీ గల గులాబీ రంగు ఘాగ్రా ఛోళీ ధరించిన శ్రియా శరణ్
-
సల్వార్ కమీజ్ ని ధరించిన హిందీ నటి సొనాక్షి సిన్హా
-
ఛోళీలో ఒక బాలిక
పురుషుల స్వదేశీ దుస్తులు
మార్చుపంచె
మార్చుపంచె భారతదేశంలో కొన్ని రాష్ట్రాలతో బాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్లో పురుషులు (కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు కూడా) ధరించే సాంప్రదాయక వస్త్రము. కుట్టకుండా, దీర్ఘ చతురస్రాకారంలో సాధారణంగా 4.5 మీటర్లు (15 ఆడుగుల) పొడవు ఉండే ఈ వస్త్రాన్ని నడుము చుట్టూ చుట్టి ముడి వేయటం వలన ఒక పొడవు స్కర్టు వలె ఉంటుంది.
భారతదేశంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా లలో పంచె విరివిగా ధరించబడుతుంది. ఉత్తర గుజరాత్, దక్షిణ రాజస్థాన్ లలో కేడియా అనే ఒక పొట్టి కుర్తాతో బాటు ధరిస్తారు. భారతదేశం సర్వత్రా ప్రత్యేకించి బీహార్, పశ్చిమ బెంగాల్, శ్రీలంక లలో పంచెను కుర్తాతో ధరిస్తారు. వీటిని ధోవతి-కుర్తా అని సంబోధిస్తారు. తమిళనాడులో సట్టై (చొక్కా)తో బాటు, ఆంధ్ర ప్రదేశ్లో చొక్కా లేదా కుర్తా (జుబ్బా)తో ధరిస్తారు. పాకిస్థాన్, పంజాబ్ లలో కూడా ధోతీలు సాంప్రదాయిక దుస్తులుగా ధరించబడతాయి. పెళ్ళికొడుకు పంచె కట్టు గతంలో తెలుగు నాట పెళ్ళికొడుకు పెళ్ళి సందర్భంలో తప్పనిసరిగా పంచె కట్టాలనే నిబంధన వుండేది. కాని ప్రస్తుత మారిని కాలంలో ఈ నిబంధన తప్పనిసరిగా పాటించ కున్నా కొందరు పెళ్ళికొడుకులు పంచె కడుతున్నారు. అహింసను నమ్మే జైనులు ప్రార్థనామందిరాలకు వెళ్ళే సమయంలో కుట్టని బట్టలు ధరించాలనే నియమం ఉండటం వలన పురుషులు పంచెలనే ధరిస్తారు. పంచె కన్నా చిన్నదైన ఇంకొక పై పంచెతో శరీర పైభాగాన్ని కప్పుకొంటారు.
లుంగీ
మార్చులుంగీ (Lungi) అనే వస్త్రము దక్షిణ భారతదేశంలో పుట్టినాగాని, ఇండొనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, బ్రూనై, మలేషియా, సింగపూరు, ఆఫ్రికాలో కొన్ని ప్రదేశాలలో, అరేబియా ద్వీపకల్పాలలో కూడా ధరిస్తారు. మాములుగా ఈ వస్త్రము నూలుతో చేయబడుతుంది. దక్షిణ భారతదేశం సర్వత్రానే కాకుండా, బెంగాల్, సింధ్, ఒడిషా లలో కూడా దీనిని వాడతారు. ట్రౌజర్లు వేసుకోవటం అసౌకర్యాన్ని కలిగించే వేడి, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో లుంగీలకి ఆదరణ చాలా ఎక్కువ.
కుర్తా
మార్చుకుర్తా అనునది భారతదేశంలో (సాధారణంగా) పురుషులు శరీర పై భాగాన్ని కప్పుకోవటానికి ఉపయోగించే దుస్తులలో ఒకటి. దీని క్రింద పైజామా గానీ, ధోవతిగానీ, పంచె గానీ ఒక్కోసారి యువకులు జీంస్ ప్యాంటు గానీ వేసుకొంటారు. స్త్రీలు వేసుకొనే కుర్తాలను కమీజ్ అని గానీ, కుర్తీ అని గానీ వ్యవహరిస్తారు.
సాధారణంగా పురుషులు నూలు/ఖద్దరు లేదా నూలుతో కలసిన ఇతర రకాలు (blend) తో తయారు చేసిన కుర్తా (జుబ్బా/లాల్చీ) ధరిస్తారు.
పైజామా
మార్చుసల్వార్ కమీజ్
మార్చుసల్వార్ కమీజ్ అనునవి దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ లలో స్త్రీ పురుషులిరువురి చే ధరింపబడే దుస్తులు. సల్వార్ అనగా పైజామా వలె ఉండే నడుము నుండి కాళ్ల వరకు ఆచ్ఛాదననిచ్చే వస్త్రము. నడుము వద్ద వదులుగా ఉండి క్రిందకు వెళ్ళే కొద్దీ బిగుతుగా ఉంటాయి. కమీజ్ అనగా కుర్తా వలె ఉండే చేతులకి, గొంతు నుండి నడుము వరకు, లేదా తొడల, మోకాళ్ళ, లేదా పిక్కల వరకూ ఆచ్ఛాదన నిచ్చే వస్త్రము. కమీజ్ కి నడుము వద్ద నుండి క్రింద వరకు ఉండే చీలికలు కదలికకై స్వేచ్ఛని ఇస్తాయి.
షేర్వానీ
మార్చుషేర్వానీ దక్షిణ ఆసియాలో ధరించే కోటు వంటి వస్త్రం. ఇది పాకిస్థాన్ దేశపు జాతీయ వస్త్రంగా గుర్తించబడిననూ ఉత్తర భారతదేశనికి చెందిన ముస్లిం రాచరిక వంశాల వారు కూడా దీనిని ధరించేవారు. పైజామాతో వేసుకొన్న కుర్తా పై కానీ, కమీజ్ తో బాటు ధరించే సల్వార్ పై కానీ దీనిని ధరిస్తారు. బ్రిటీషు ఫ్రాక్ కోట్ ని సల్వార్ కమీజ్ని కలిపి రూపొందించినదే ఈ షేర్వానీ.
పఠానీ
మార్చుపఠానీ అనునది వదులుగా ఉండే ఒక రకమైన కుర్తా, పైజామా. సినిమాలలో చూపించబడే కాబూలీవాలాలు పఠానీ లలోనే కనబడతారు. ఇది ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, భారతదేశం లలో కనబడుతుంది.
జోధ్ పుర్ కోటు
మార్చుజోధ్ పుర్స్
మార్చుఅంగరఖా
మార్చుతలపాగా
మార్చుతలపాగా (ఆంగ్లము: turban, కొన్ని సంస్కృతులలో బుల్లే లేదా దస్తర్) అనునది తలని చుట్లతో కప్పే ఒక వస్త్రము. దీనిని ధరించే విధానాలు వేర్వేరుగా ఉంటాయి. తలపాగా, పైపంచ (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత తెలుగువారికి తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే పంచకట్టు, లాల్చీలాంటి చొక్కా, పైపంచ, తలపాగా .
పంచ కట్టుటలోన ప్రపంచాన మొనగాడు // కండువాలేనిదే గడ పైన దాటనివాడు//
కంచంలో అన్ని ఉన్న గోంగూర కోసం వెతికెవాడు // ఎవడయ్యా వాడు ఇంకెవడు తెలుగువాడు..
భారతీయ పురుషుల దుస్తుల చిత్రమాలిక
మార్చు-
సాంప్రదాయిక ధోవతి కట్టు
-
దక్షిణ భారత సాంప్రదాయిక పంచెకట్టు
-
పంజాబీ సాంప్రదాయ నృత్యమైన భాంగ్రా నృత్యకారులు ధరించే లుంగీలు
-
అసాంప్రదాయిక లుంగీ
-
కుర్తా ధరించిన బాలుడు
-
1870 లో సల్వార్ కమీజ్ ని ధరించిన ఒక యువతి
-
షేర్వానీ ధరించిన వ్యక్తి
-
ఒక సినిమాలో పఠానీ ధారణ
స్వదేశీ దుస్తులతో బాటు ధరించే విదేశీ దుస్తులు
మార్చుధోవతి, తలపాగాలతో బాటు ఆంధ్రులు చొక్కా, కోటుని ధరించేవారు. కుర్తాతో బాటు బిగుతుగా ఉండే ప్యాంటు లేదా జీన్స్ ప్యాంటు స్త్రీ పురుషులిరువురూ ధరించటం కూడా ఉంది.
చొక్కా
మార్చుచొక్కా (Shirt) భారతదేశంలో ఎక్కువమంది పురుషులు శరీరం పై భాగంలో కప్పుకోవడానికి ధరించే వస్త్రము. సాధారణంగా ప్యాంటుతో బాటు ధరించబడే చొక్కా పంచె, ధోవతి, లుంగీ ల పై కూడా ధరిస్తారు. కొన్ని సందర్భాలలో పైజామాల పై కూడా కుర్తాకి బదులుగా చొక్కాలనే ధరిస్తారు. చొక్కాలకి ఫుల్ స్లీవ్స్ గానీ హాఫ్ స్లీవ్స్ గానీ ఉంటాయి. ఒకప్పుడు ల్యాపెల్ గల చొక్కాలని ధరించిననూ టీ-షర్టులకి పెరిగిన ఆదరణతో ఇప్పుడు వాటి పై ఎవరూ మొగ్గు చూపటం లేదు. కాలరు గల షర్టులనే ఇప్పుడు ధరిస్తున్నారు.
ప్యాంటు
మార్చుమగవారు/ఆడవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. ఇది సూటు లోని ఒక భాగమైననూ, సూటు యొక్క ఇతర భాగాలైన నెక్ టై/బౌ టై, కోటు లేకున్ననూ, కేవలం షర్టుతో బాటు దీనిని వేసుకొనవచ్చును. చాలా వరకు భారతీయులు (, ఇతర ఉష్ణ దేశస్థులు) కేవలం షర్టు ప్యాంటు లతోనే కనబడతారు. ప్యాంటులో సగం మాత్రం అనగా తొడల వరకు ఉండే వస్త్రాన్ని నిక్కరు అంటారు. బెర్మూడా వంటి దేశంలో ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు ఉండే సాంప్రదాయిక నిక్కరులని సూటుతో వేసుకొనగా, స్కాట్లండ్, ఐర్లండ్ వటి దేశాలలో ప్యాంటుకి బదులుగా స్కర్టుని కూడా వాడతారు.
ఒక్కోమారు ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు వదులుగా ఉండే నికర్ బాకర్స్ని ధరిస్తారు.
సాంప్రదాయికాలని ట్రౌజరు (ఉదా: ప్లీటెడ్ ట్రౌజర్సు) అనీ అసాంప్రదాయికాలని ప్యాంటు (ఉదా: లో-వెయిస్టెడ్ ప్యాంటు) అనీ పూర్వం వ్యవహరించేవారు. కానీ కాలక్రమేణా ఇవి రెండూ ఒకటే అయినాయి. ప్యాంటు అన్న పదం అన్నింటికీ వర్తించిననూ ట్రౌజరు అంటే మాత్రం సాంప్రదాయికం అనే మిగిలి పోయింది.
జీన్ గుడ్డ ట్రౌజరు గుడ్డ కన్నా ఇంకా మందంగా ఉండి ఉతకకుండా చాలా కాలం ఉపయోగించవచ్చును. సాధారణ పాంటుకు రెండు జేబులు ప్రక్కగాను ఒకటి/రెండు జేబులు వెనుకగాను ఉంటాయి. బెల్టు కట్టుకోవడానికి అనువుగా నడుం చుట్టూ రింగులు కుట్టబడి ఉంటాయి.
జీన్స్ ప్యాంటు
మార్చుజీన్స్ అనునవి డెనిమ్ లేదా డుంగరీ వస్త్రంతో కుట్టిన ప్యాంటు.
1950 లో కౌబాయ్ ల కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన జీన్స్ టీనేజీ యువతలో బాగా జనాదరణ పొందినది. జీన్స్ రూపొందించటంలో లెవీ స్ట్రాస్ అండ్ కో., లీ, వ్రాంగ్లర్ సంస్థలు పేరెన్నిక గన్నవి. స్కిన్నీ, టేపర్డ్, స్ట్రెయిట్, బూట్ కట్, న్యారో బాటం,లో వెయిస్ట్, యాంటీ-ఫిట్, ఫ్లేర్ శైలులలో జీన్స్ లభ్యం.
కోటు
మార్చుకోటు లేదా జాకెట్ అనునది వెచ్చదనానికి గానీ ఫ్యాషన్ కి గానీ స్త్రీ పురుషులిరువురిచే సాధారణంగా షర్టు/టి-షర్టు పై ధరింప బడే ఒక వస్త్రం. బహు అరుదుగా కోటు షర్టు లేకుండా కూడా ధరిస్తారు. కోటు లలో పలు రకాలు ఉంటాయి. సాధారణంగా వీటికి పొడవాటి చేతులున్ననూ స్లీవ్ లెస్ (చేతులు లేని) జాకెట్ లు కూడా లభ్యం.
టోపీ
మార్చుగాంధీ టోపీ
మార్చుస్వాతంత్ర్య సమరంలో గాంధీ చే ప్రోత్సహింపబడ్డ ఖద్దరుతో చేయబడిన టోపీని గాంధీ టోపీ అంటారు. స్వాతంత్ర్యానంతరం కూడా దీనిని రాజకీయవేత్తలు ఇంకనూ ధరిస్తున్నారు.
కరాకుల్
మార్చుకరాకుల్ అనే జాతికి చెందిన గొర్రె యొక్క ఉన్నితో చేసే టోపీని కారాకుల్ అంటారు. అఫ్ఘనిస్తాన్ కు చెందిన కాబూల్ ప్రజలు దీనిని తరాల నుండి ధరిస్తున్నారు. ఇతర ప్రముఖులు దీనిని ధరించిననూ దీనికి జిన్న టోపీ అనే పేరే స్థిరపడిపోయింది.
చిత్రమాలిక
మార్చు-
ఒక చొక్కా
-
ఒక ప్యాంటు
-
ఒక జీన్స్ ప్యాంటు
-
గాంధీటోపీని ధరించిన నెహ్రూ
-
కరాకుల్ ధరించిన జిన్నా. తర్వాత ఇది జిన్నా టోపీగా స్థిరపడిపోయింది.
ఆంధ్ర ప్రదేశ్
మార్చుపురుషులు సాంప్రదాయికంగా కుర్తా, పంచెలు ధరిస్తారు. తలపాగా, కండువాలు వ్యక్తిగతాలు. సాంప్రదాయేతరాలుగా లుంగీ, సైకిల్ కట్టు ధోవతులు ధరిస్తారు. బాలురు చొక్కా, లాగు లని ధరిస్తారు. స్త్రీలు చీర, రవిక లని ధరిస్తారు. శుభసందర్భాలకి పట్టుచీర ధరిస్తారు. యువతులైతే పైట, పావడ, బాలికలైతే పరికిణిలు ధరిస్తారు.
-
సోగ్గాడు (1975 సినిమా) సినిమాలో హాఫ్ స్లీవ్స్ కుర్తా, సైకిల్ కట్టు ధోవతిలో శోభన్ బాబు
-
ఓణి ధరించిన అమ్మాయి
-
పట్టు లంగా ఛోళీ లలో చంటి పాప
-
పోచంపల్లి చీరని ధరించిన ఒక బాలిక
అరుణాచల్ ప్రదేశ్
మార్చుఅస్సాం
మార్చుపట్టులో రకాలు
మార్చుఅస్సాంలో ఈ క్రింది రకాలైన పట్టు దొరుకుతుంది.
- ముగ
- పాట్
- ఏరి
గమోసా
మార్చుఇది అస్సామీ ఉత్తరీయము. కానీ మన ఉత్తరీయం కంటే అస్సాంలో దీనికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది నలువైపులా ఎర్రని అంచులతో ఉండే తెల్లని వస్త్రము.
ప్రధానంగా ఇది శరీరాన్ని తుడుచుకోవటానికి ఉపయోగించిననూ
- పై పంచె (పంచె పైన కట్టుకొనే మరొక చిన్న పంచె)గా
- బిహూ నృత్యంలో పురుష నృత్య కారులు తల చుట్టూ తలపాగా వలె
- హుందాతనానికి ఒక భుజం పైన లేదంటే మెడ గుండా రెండు భుజాలపై (ఒకే గమోసాని)
- అతిథులని స్వాగతించేటప్పుడు, పెద్దలకి గౌరవసూచకంగా బహుమతులుగా ఇచ్చేందుకు
కూడా గమోసాని వినియోగిస్తారు.
జాపి
మార్చుజాపి అనునది అస్సామీ టోపీ. దీనిని బిగుతుగా అల్లిన వెదురు దబ్బలతో చేస్తారు. తలకి రక్షణగా, హుందాతనానికి, బిహూ నృత్యంలో, ఇంట్లో శుభసూచకంగా, అతిథులకి స్వాగత సూచకంగా దీనిని వాడతారు.
మెఖెలా చాదొర్
మార్చుఇది అస్సామీ లంగా ఓణి. వక్షస్థలమును రవికెతో కప్పి, ఒక చాదొర్ ని లంగా వలె కట్టుకొని, మరొక చాదొర్ ని పైట వలె కప్పుతారు. అయితే దీనిని అన్ని వయస్కుల స్త్రీలు ధరిస్తారు.
అస్సామీ దుస్తుల చిత్రమాలిక
మార్చు-
ఎల్లప్పుడూ టోపీలో కనబడే బహుముఖ ప్రజ్ఞాశాలి భూపేన్ హజారికా
-
పాట్ పట్టుతో చేయబడిన గమోసా
-
తల చుట్టూ గమోసా అనే వస్త్రాన్ని ధరించిన అస్సామీ బిహూ నృత్యకారుడు
-
జాపి అని పిలువబడే అస్సామీ టోపీ
-
అన్ని వయసులలోనూ స్త్రీల చే ధరింపబడే మెఖెలా చాదొర్
-
పాట్ పట్టు చీరలో అస్సామీ శాస్త్రీయ నర్తకి
-
మిసింగ్ నర్తకులు
-
బోడో నర్తకులు
బీహార్
మార్చు-
పద్మ విభూషణ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్
ఛత్తీస్ ఘర్
మార్చుగోవా
మార్చుగుజరాత్
మార్చు-
ఒక గుజరాతీ మహిళ
-
నవరాత్రి ఉత్సవాలలో గుజరాతీ నాట్యంలో స్త్రీ పురుష వస్త్రధారణ
-
గుజరాతీ చీర కట్టులో ఓ బాలిక
-
భుజ్ గర్బా అనే నృత్యంలో గుజరాతీ మహిళల ఆహార్యం
హర్యానా
మార్చుహిమాచల్ ప్రదేశ్
మార్చుజమ్ము , కాశ్మీర్
మార్చు-
చుడీదార్ లని ధరించిన కాశ్మీరీ పసి పిల్లలు
జార్ఖండ్
మార్చు-
సంతల్ మహిళలు
కర్ణాటక
మార్చువొడెయార్లు అనబడు మైసూరు మహారాజులు పట్టు, జరీ గల పేటా అనబడు తలపాగాని ధరించేవారు.
-
రాజరిక మైసూరు పేటాని ధరించిన నల్వడి కృష్ణరాజ వొడెయార్
-
మైసూరు పట్టు చీరలని ధరించిన బాలికలు. పొడవాటి కుచ్చిళ్ళు మైసూరు పట్టుకి ప్రతీకలు
-
బంగారు జరీ ఉన్న మైసూరు పట్టు చీర
కేరళ
మార్చుకేరళ రాష్ట్రంలో సాధారణంగా రంగులతో వివిధ డిజైనులలో ఉండే లుంగీలను స్త్రీ పురుషులిరువురూ ధరిస్తారు. శ్రమజీవులు రోజువారీ దుస్తులుగా ధరిస్తారు. ముండు అనబడు కేరళ ధోవతి సాధారణంగా తెల్లగా ఉండి, కసవు అనే బంగారు రంగు అంచు కలిగి ఉంటుంది. హిందువులు గడియార దిశలో కడతారు. కాషాయ వర్ణ ముండు లను కావి ముండే అని అంటారు. క్రింద వరకు కాకుండా మోకాళ్ళ వరకే అడ్డపంచె వలె కడతారు. ముస్లింలు, క్రైస్తవులు వ్యతిరేక గడియార దిశలో కడతారు. ఆంధ్ర, తమిళ నాడు లలో వలె ఇలా కట్టడం ఇక్కడ ఏ మాత్రం అసాంప్రదాయికమో, అమర్యాదపూర్వకమో కాదు.
-
ఒక కథకళి కళాకారుడు
-
మోహిని ఆట్టం ప్రదర్శిస్తున్న స్మిత రాజన్
-
ప్రత్యేక ధోవతి కట్టుతో ఉర్మి పయాట్టుని అభ్యసిస్తున్న పురుషులు
-
ముండుం నేరియతుంని ధరించిన ఒక స్త్రీ యొక్క రాజా రవి వర్మ చిత్ర పటం
మధ్య ప్రదేశ్
మార్చుమహరాష్ట్ర
మార్చుతలపాగా లని మరాఠీలో ఫేటా అని, పగరి (పగడి) అని వ్యవహరిస్తారు. ఇందులో పలు రకాలున్నవి.
- కొల్హాపురి ఫేటా
- పుణేరి ఫేటా
- మవాలి పగడి
- మహాత్మా ఫూలే పగడి
- షాహీ తలపాగా
- తుకారాం మహరాజ్ పగడి
నౌవారీ చీర
మార్చుధోవతి వలె మరాఠీ స్త్రీలు కట్టే చీరని కాస్టా చీర అనీ, సకచ్చ చీర అనీ సంబోధిస్తారు. తొమ్మిది గజాలు ఉండటం వలన దీనినే నౌవారీ చీర అని కూడా అంటారు.
మరాఠీ దుస్తుల చిత్రమాలిక
మార్చు-
మహాత్మా ఫూలే పగరీ
-
మారాఠా యుద్ధవీరుడు తానాజీ మలుసరే ధరించిన మవాలీ పగడి
-
పుణేరి పగరీని ధరించిన మహదేవ్ గోవింద్ రణడే
-
ఘాగ్రా ఛోళీని ధరించిన మరాఠీ స్త్రీలు
-
నౌవారీ చీర కట్టులో విద్యాబాలన్
మణిపూర్
మార్చు-
మణిపురి నర్తకి
-
కంగ్ ఆటని ఆడుతున్న మణిపురి యువతులు
మేఘాలయ
మార్చుమిజోరం
మార్చునాగాల్యాండ్
మార్చు-
హార్న్ బిల్ ఉత్సవంలో యువకులు ధరించే దుస్తులు
ఒడిషా
మార్చు-
విభిన్న నేత గల పాసపల్లి చీర
-
సోనెపురి లేదా బొంకై చీర
-
డిజైను గల బొంకై చీర
-
సంబల్ పురి చేనేత చీర
-
సంబల్ పుర్ బంధా చీర
పంజాబ్
మార్చుదస్తర్
మార్చుదస్తర్ అనే తలపాగాని ప్రతి సిక్కు పురుషుడు ధరిస్తాడు. దస్తర్ సాంప్రదాయికం. అసాంప్రదాయికంగా పట్కాని ధరిస్తారు. ఇది దస్తర్ వలె కాకుండా కొప్పుని, శిరోజాలలో చాలా భాగాన్ని కప్పుతుంది. కొప్పుని మాత్రం కప్పే పట్కాని రుమాల్ అంటారు. సైనికులు దుమల్లా అనే మరో తలపాగాని దస్తర్ తో బాటు ధరించేవారు.
పంజాబీ దుస్తుల చిత్రమాలిక
మార్చు-
దస్తర్ ని ధరించిన ఒక పంజాబీ పురుషుడు
-
తల మొత్తాన్ని చుట్టే పట్కా ధరించిన బాలుడు
-
కొప్పుని మాత్రం కప్పి ఉంచే రుమాల్ (లేదా) పట్కా
-
దుమల్లాని ధరించిన సిక్కు పురుషుడు
రాజస్థాన్
మార్చు-
జైపూర్ లో సల్వార్ కమీజ్, దుపట్టాలని ధరించిన రాజస్థానీ మహిళలు
-
రాజస్థానీ కోటా డోరియా (చీర)
సిక్కిం
మార్చుతమిళ నాడు
మార్చుచిత్రమాలిక
మార్చు-
1870 లో పైట, చీరలు ధరించిన తమిళ బాలికలు
-
1907 లో లంగా ఓణి ధరించిన తమిళ బాలిక
-
1945 లో తమిళ దంపతులు. భార్య చీరని మడిసర్ శైలిలో కట్టినది
-
భరత నాట్యం దుస్తులలో బాల నర్తకి
-
ఒక కంచి పట్టు చీర
త్రిపుర
మార్చు-
త్రిపురి స్త్రీ పురుష దుస్తులు
-
నాట్యానికి సిద్ధమౌతున్న త్రిపురి బాలికలు
ఉత్తర్ ప్రదేశ్
మార్చుబనారసి చీరలు
మార్చు-
ఒక బనారస్ చీర
-
మరొక బనారస్ చీర
-
కథక్ నృత్య దుస్తులు
ఉత్తరాఖండ్
మార్చుపశ్చిమ బెంగాల్
మార్చుటొపొర్ అనే బెంగాలీ టోపీని అన్నప్రాశన నాడు చంటి పిల్లలు, వివాహ వేడుకలలో వరులు ధరిస్తారు. ముస్లిన్ వస్త్రంతీ చేతితో నేసిన చీరని జాందనీ అంటారు.
-
ఒక బెంగాలీ టొపొర్
-
బెంగాలీ చీరకట్టులో ఒక బాలిక
-
ఒక జాందనీ చీర