వెర్టిగో
వెర్టిగో అనేది ఒక వ్యక్తికి కదిలే అనుభూతిని కలుగచేసే లక్షణం లేదా చుట్టుపక్కల వస్తువులు లేనప్పుడు కూడా అవి కదులుతూఉన్నట్లుంటాయి. తరచుగా ఇది ఒక తిరిగే విధంగా (స్పిన్నింగ్) లేదా ఊగుతున్న కదలిక లాగా అనిపిస్తుంది.[1] [2] దీనితో వికారం, వాంతులు, చెమట పట్టడం లేదా నడవడంలో ఇబ్బందులతో కలిసి ఉంటాయి. తలని కదిలించినప్పుడు చాలా అధ్వాన్నంగా ఉంటుంది . వెర్టిగోలో కళ్లుతిరుగుటం అనేది అత్యంత సాధారణం.[2]
వెర్టిగో | |
---|---|
ఇతర పేర్లు | కళ్లుతిరుగుటం |
వెర్టిగోతో పాటు వచ్చే సంకేతం.- క్షితిజసమాంతర కదలికలు నిస్టాగ్మస్, | |
ఉచ్చారణ | |
ప్రత్యేకత | ఓటోరినోలారిన్జాలజీ |
లక్షణాలు | కదిలే అనుభూతి, ,తిరిగే విధంగా (స్పిన్నింగ్) లేదా ఊగుతున్న కదలిక, నడవడంతో ఇబ్బంది |
రకాలు | పరిధీలో , కేంద్రం |
ప్రమాద కారకములు | నిరపాయమైన పరోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో (BPPV), మెనియర్స్ వ్యాధి, లాబిరింథిటిస్, స్ట్రోక్, మెదడు కణితులు, మెదడు గాయం, మల్టిపుల్ స్క్లెరోసిస్, వెస్టిబ్యులర్ మైగ్రేన్ |
రోగనిర్ధారణ పద్ధతి | డిక్స్-హాల్పైక్ పరీక్ష, నిస్టాగ్మస్ అని పిలువబడే వేగవంతమైన కంటి కదలికలు (rapid eye movements)సమయం |
తరుచుదనము | 20–40% వరకు |
కారణాలు
మార్చువెర్టిగోకు దారితీసే అత్యంత సాధారణ వ్యాధులు నిరపాయమైన (బినైన్) పరోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో (BPPV), మెనియర్స్ వ్యాధి, లాబ్రింథైటిస్.[1][2]అరుదుగా ఉండే కారణాలలో స్ట్రోక్, మెదడు కణితులు, మెదడు గాయం, మల్టిపుల్ స్క్లెరోసిస్, మైగ్రేన్, గాయం, మధ్య చెవి లో అసమాన ఒత్తిడి వంటివి ఉన్నాయి.[2][3][4] ఓడలో ఉన్నప్పుడు లేదా కళ్ళు మూసుకుని తిరుగుతున్నప్పుడు వంటి సుదీర్ఘకాలం కదలికకు గురైన తరువాత శరీరధర్మ (ఫీజియోలాజిక్) వెర్టిగో సంభవించవచ్చు.[5][6] ఇతర కారణాలలో కార్బన్ మోనాక్సైడ్, ఆల్కహాల్ లేదా ఆస్పిరిన్ వంటి విషపదార్ధాల వలన కూడా ఉండవచ్చు.[7]
లక్షణాలు
మార్చువెర్టిగో వెస్టిబ్యులర్ వ్యవస్థలో ఒక భాగంలో సమస్యను సూచిస్తుంది.[2] వెస్టిబ్యులర్ వ్యవస్థ అంటే సకశేరుకాలలో చాలా క్షీరదాలలో శ్రవణ వ్యవస్థలో ఒక భాగమైన లోపలి చెవిలో కోక్లియాతో కలిసి, శరీర కదలికను సమన్వయం చేయడానికి ప్రాదేశిక ధోరణిని సృష్టించే ఒక ఇంద్రియ వ్యవస్థ[8]. మైకానికి ఇతర కారణాలలో ప్రిసింకోప్ (తూలి పడే భావన), అసమతుల్యత, నిర్దిష్టత లేని మైకము ఉన్నాయి.[2]
బినైన్ పరోక్సిస్మల్ పొజిషనల్ వెర్టిగో అనేది పదేపదే కదలికలు పొందే వ్యక్తిలో సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎపిసోడ్ల మధ్య లక్షణాలు సాధారణంగా ఉంటుంది.[9] ఈ సంఘటనలు ఒక నిమిషం కన్నా తక్కువ ఉండాలి.[2] సాధారణంగా ఈ పరిస్థితిలో డిక్స్-హాల్పైక్ పరీక్ష, నిస్టాగ్మస్ అని పిలువబడే వేగవంతమైన కంటి కదలికలు (rapid eye movements)సమయాన్ని తెలుపుతుంది.[10] మెనియర్స్ వ్యాధిలో చెవులలో ధ్వని (రింగింగ్), వినికిడి లోపం. వెర్టిగో దాడులు ఇరవై నిమిషాల కంటే ఎక్కువ ఉంటాయి.[9] లాబిరింత్ వాపుతో వెర్టిగో అకస్మాత్తుగా వస్తుంది. నిస్టాగ్మస్ కదలిక లేకుండా సంభవిస్తుంది .[9] ఈ పరిస్థితిలో వెర్టిగో రోజులు కొనసాగవచ్చు.[2] ముఖ్యంగా బలహీనత, తలనొప్పి, ఒక వస్తువు రెండుగా కనపడడము (డబుల్ విజన్) లేదా తిమ్మిరి వంటి లక్షణాలు కూడా ఉన్నట్లయితే మరింత తీవ్రమైన కారణాలను కూడా పరిగణించాలి.[9][2]
వ్యాధి ప్రాబల్యం
మార్చుఈ వ్యాధి ఏదో ఒక సమయంలో సుమారు 20-40% మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది, అయితే 7.5-10% మందికి వెర్టిగో ఉంటుంది.[11] సంవత్సరంలో సుమారు 5% మంది వెర్టిగో కి గురి అవుతారు. ఇది వయస్సుతో మరింత సాధారణంగా ఏర్పడుతుంది. పురుషుల కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా మహిళలను ప్రభావితం చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సుమారు 2-3% మంది వెర్టిగో రోగులు వైద్యశాలలో అత్యవసర విభాగం సందర్శిస్తోంటారు.[12]
సూచనలు
మార్చు- ↑ 1.0 1.1 Post, RE; Dickerson, LM (2010). "Dizziness: a diagnostic approach". American Family Physician. 82 (4): 361–369. PMID 20704166. Archived from the original on 2013-06-06.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 Hogue, JD (June 2015). "Office Evaluation of Dizziness". Primary Care: Clinics in Office Practice. 42 (2): 249–258. doi:10.1016/j.pop.2015.01.004. PMID 25979586.
- ↑ Wicks, RE (January 1989). "Alternobaric vertigo: an aeromedical review.".
- ↑ Buttaro, Terry Mahan; Trybulski, JoAnn; Polgar-Bailey, Patricia; Sandberg-Cook, Joanne (2012). Primary Care - E-Book: A Collaborative Practice (in ఇంగ్లీష్) (4 ed.). Elsevier Health Sciences. p. 354. ISBN 978-0323075855. Archived from the original on 2017-09-08.
- ↑ Falvo, Donna R. (2014). Medical and psychosocial aspects of chronic illness and disability (5 ed.). Burlington, MA: Jones & Bartlett Learning. p. 273. ISBN 9781449694425. Archived from the original on 2015-07-02.
- ↑ Wardlaw, Joanna M. (2008). Clinical neurology. London: Manson. p. 107. ISBN 9781840765182. Archived from the original on 2015-07-02.
- ↑ Goebel, Joel A. (2008). Practical management of the dizzy patient (2nd ed.). Philadelphia: Lippincott Williams & Wilkins. p. 97. ISBN 9780781765626. Archived from the original on 2015-07-02.
- ↑ Vestibular system.https://en.wikipedia.org/wiki/Vestibular_system
- ↑ 9.0 9.1 9.2 9.3 Kerber, KA. "Vertigo and dizziness in the emergency department".
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ von Brevern, M; Neuhauser, H (2011). "Epidemiological evidence for a link between vertigo & migraine". Journal of Vestibular Research. 21 (6): 299–304. doi:10.3233/VES-2011-0423. PMID 22348934.
- ↑ Neuhauser HK, Lempert T (November 2009). "Vertigo: epidemiologic aspects" (PDF). Seminars in Neurology. 29 (5): 473–81. doi:10.1055/s-0029-1241043. PMID 19834858. Archived (PDF) from the original on 2017-08-08. Retrieved 2018-11-04.