వెలగ (ఆంగ్లం Wood apple) రూటేసి కుంటుంబానికి చెందిన పండ్ల వృక్షము. వెలగ ను శాస్త్రీయంగా 'ఫెరోనియా లిమోనియా' అనిగాని, లేదా 'లిమోనియా ఎలిఫెంటమ్' అనిగాని అంటారు. ఇది దాదాపు అన్నినేలలో పెరుగుతుంది.

వెలగ
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
లిమోనియా

Species:
లి. ఎలిఫెంటమ్
Binomial name
లిమోనియా ఎలిఫెంటమ్

లక్షణాలు

మార్చు
  • ముళ్ళతో మధ్యరకంగా పెరిగే వృక్షం.
  • రెక్కలుగల పత్రవృంతం, పత్రవిన్యాసాక్షం, దీర్ఘవృత్తాకార పత్రకాలతో విషమపిచ్ఛక సంయుక్త పత్రాలు.
  • గ్రీవాలలోను, అగ్రాలలోను ఏర్పడిన సామాన్య అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న లేత పసుపురంగు పుష్పాలు.
  • గుండ్రంగా ఉన్న మృదు ఫలం.
 
వెలగకాయలు

ఉపయోగాలు

మార్చు
  • వెలగ పండు గుజ్జును తింటారు. దీని నుండి జామ్, పచ్చళ్ళు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు. ఇది మంచి అజీర్ణకారి. పెంకు గట్టిగా గిన్నెలాగా ఉపయోగపడుతుంది.
  • వెలగ ఆకులు, పుష్పాలు కడుపు నొప్పిని తగ్గిస్తాయి.
  • చెట్టు కాండం కలప గా ఉపయోగపడుతుంది.
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=వెలగ&oldid=3427887" నుండి వెలికితీశారు