వెలగపూడి రామకృష్ణ బాబు
వెలగపూడి రామకృష్ణబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
వెలగపూడి రామకృష్ణబాబు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2014 2014 - 2019 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జూన్ 22, 1960 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
తల్లిదండ్రులు | బ్రహ్మశ్వర రావు | ||
జీవిత భాగస్వామి | సుజనా |
జననం, విద్యాభాస్యం
మార్చువెలగపూడి రామకృష్ణబాబు 1961లో జన్మించాడు. అయన 1981లో ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ యూనివర్సిటీ నుండి బి.ఎస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చువెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3] వెలగపూడి రామకృష్ణబాబు 2019లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల పై గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
- ↑ Sakshi (20 February 2014). "టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రాజీనామా". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.
- ↑ Sakshi (20 March 2019). "వెలగపూడికి ఎదురుగాలి!". Archived from the original on 21 January 2022. Retrieved 21 January 2022.