అక్కరమాని విజయనిర్మల
అక్కరమాని విజయనిర్మల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ఛైర్‌పర్సన్‌గా ఉంది.[1]
అక్కరమాని విజయనిర్మల | |||
విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్‌పర్సన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 భీమిలి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | వెంకటరావు | ||
సంతానం | భారతి, అవినాష్ | ||
నివాసం | విశాఖపట్నం |
రాజకీయ జీవితం
మార్చుఅక్కరమాని విజయనిర్మల తెలుగుదేశం పార్టీ ద్వారా 2005లో రాజకీయాల్లోకి వచ్చి అదే ఏడాది జరిగిన భీమిలి మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికై మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పని చేసింది. ఆమె 2008లో భీమిలి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికై 2010 వరకు పని చేసింది. విజయనిర్మల 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి భీమిలి తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా నియమితురాలై పార్టీ బలోపేతానికి కృషి చేసింది.[2] ఆమె 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది.[3]
అక్కరమాని విజయనిర్మల 2019లో ఓడిన వైసీపీ విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా నిత్యం ప్రజలమధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేసింది. ఆమెను విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ఛైర్‌పర్సన్‌గా 17 జులై 2021న రాష్ట్ర ప్రభుత్వం నియమించగా ఆమె 20 ఆగష్టు 2021న ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టింది.[4]
మూలాలు
మార్చు- ↑ Eenadu (21 August 2021). "11 మందికి పదవీయోగం". Archived from the original on 20 January 2022. Retrieved 20 January 2022.
- ↑ Sakshi (1 April 2019). "అనుకోకుండా అవకాశం.. : విజయనిర్మల". Archived from the original on 20 January 2022. Retrieved 20 January 2022.
- ↑ Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 January 2022. Retrieved 19 January 2022.
- ↑ Andhrajyothy (20 August 2021). "వీఎంఆర్డీఏ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అక్కరమాని విజయనిర్మల". Archived from the original on 20 January 2022. Retrieved 20 January 2022.