మేకా వెంకటాద్రి అప్పారావు

(వేంకటాద్రి అప్పారావు నుండి దారిమార్పు చెందింది)


రాజా మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యము, జ్యోతిష్యం, చిత్రకళ, సంగీతం మొదలగు కళలో కూడా ఆయనకు ప్రవేశముంది.

మేకా వేంకటాద్రి అప్పారావు
జననం29 ఏప్రిల్ 1893
వృత్తిపరిపాలన, కవి
తల్లిదండ్రులు

బాల్యం మార్చు

వెంకటాద్రి అప్పారావు 1893, ఏప్రిల్ 29న నూజివీడులో జన్మించాడు. పెంచిన తండ్రి వెలమ వంశీయులైన రాజా రంగయ్యప్పారావు.అతనికి స్వతహాగా కవిత్వంపై ఆసక్తి కలగడంతో మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనా సంస్కృతాంధ్ర భాషలు నేర్చుకోవాలని శ్రద్ధ కలిగింది. గురువు ద్వారా కొంత, స్వాధ్యయనం ద్వారా కొంత పాండిత్యాన్ని సంపాదించాడు.

రచనలు మార్చు

ఇతను తెలుగులో ధుర్యోధనాంతం (1915), ఆంధ్ర వీరలక్ష్మీవిజయం (1927) వంటి నాటకాలు రచించాడు. తన తండ్రి మేకా రంగయ్య అప్పారావు పట్టాభిషేక ఘట్టాన్ని వర్ణిస్తూ, రాజ్యలక్ష్మీ పరిణయం అనే సంస్కృత నాటకాన్ని రచించాడు. జయదేవుని గీతా గోవిందాన్ని ఆంధ్రాష్టపదులు పేరుతో తెలుగులోకి అనువదించాడు.పర్షియా సాహిత్యంలో ప్రసిద్ధి పొందిన చారిత్రక గ్రంథం షాహనామా అనే గ్రంథాన్ని కొంత భాగం తెలుగులోకి అనువాదం చేసి ప్రచురించాడు.[1]

జాబితా మార్చు

ఇతర వివరాలు మార్చు

ఇతను తండ్రి ఆజ్ఞను ఆనుసరించి, 1937లో విజయవాడలో ఎస్.ఎస్.ఆర్ ‍‍‍‍& సి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాలను ప్రారంభించాడు.[2]

మూలాలు మార్చు

  1. ఆంధ్ర రచయితలు - 113 మంది కవుల సాహిత్య జీవిత చిత్రణ - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి - పుట 294
  2. Andhra Pradesh District Gazetteers: Krishna

ఇవికూడా చూడండి మార్చు

వెలుపలి లంకెలు మార్చు