వేంకట పార్వతీశకవులు ఇరవైయవ శతాబ్దిలో తెలుగు సాహిత్య రంగంలో పేరెన్నికగన్న తెలుగు జంటకవులు. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం వేంకట పార్వతీశకవులుగా జంటకట్టి కవిత్వరచన చేశారు.

రచనలుసవరించు

వేంకట పార్వతీశ కవులు "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు. వీరి కావ్యాల్లో ప్రఖ్యాతమైన కావ్యం "ఏకాంత సేవ".

శైలి విశిష్టతలుసవరించు

వేంకట పార్వతీశ కవుల కవిత్వం ఇరవైయవ శతాబ్ది కవిత్వధోరణయిన భావ కవిత్వానికి ఆద్యులలో నిలుస్తారు.

ఉదాహరణలుసవరించు

విరిదండ మెడలోన వేయుటే కాని
కన్నార నీ మూర్తి గాంచనే లేదు.
ప్రణమిల్లి యడుగుల బడుటయే కాని
చేతులారగ సేవ జేయనే లేదు

నిను గాంచి ముగ్ధనై నిల్చుటే కాని
ప్రేమదీరగ బల్కరింపనే లేదు.
ఏమేమొ మనసులో నెంచుటే కాని
తిన్నగా నా కోర్కి దెలుపనే లేదు;

బయటి లంకెలుసవరించు

మూలాలుసవరించు