వేడి నీటి బుగ్గను ఆంగ్లంలో గీజర్ అంటారు. వేడి నీటి బుగ్గ (gizzer)

Bystanders watch a nearby geyser erupting.
The geyser Strokkur in Iceland; as a tourist spot.

అప్పుడప్పుడు కల్లోలభరితంగా ఆవిరితో కూడిన వేడినీటి ప్రవాహంను బయటికి వెదజల్లే లక్షణాన్ని కలిగి ఉంటుంది. గీజర్ అనే పదం పురాతన నార్స్ భాష క్రియ పదమైన గుష్, ఐస్ల్యాండ్ క్రియ పదం గీసా పదం నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఒకేసారి వరదలా ప్రవహించడం అని అర్థం. దీనితో పాటు Haukadalur, ఐస్లాండ్ భాష పదాలైన పేలుట, దుముకుట అనే అర్థానిచ్చే గీసర్ అనే పదం నుంచి గీజర్ అనే పదం ఉద్భవించిందని చెప్పవచ్చు.

గీజర్లు ఏర్పాటు ప్రత్యేక భూగర్భజల పరిస్థితుల కారణంగా ఏర్పడ్డాయి. ఇవి భూమి మీద కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇవి చాలా అరుదైన దృగ్విషయంగా ఉన్నాయి. సాధారణంగా అన్ని వేడినీటి బుగ్గలు ఉన్న క్షేత్ర స్థలాలు క్రీయాశీలకంగా ఉన్న అగ్ని పర్వత ప్రాంతాలకు దగ్గరగా ఉంటాయి, శిలాద్రవం యొక్క సామీప్యత ప్రభావం వేడినీటి బుగ్గపై ఉంటుంది. సాధారణంగా ఉపరితల నీటి కింద సగటున సుమారు 2,000 మీటర్ల (6,600 అడుగులు) లోతున ఇక్కడ ఉష్ణశిలల్లో చర్య జరుగుతుంటుంది. ఈ ఫలితంగా మరుగుతున్న నీరు ఒత్తిడికి గురై భూగర్భం నుండి భూ ఉపరితలం పైకి వేడి నీటి బుగ్గ ద్వారా వెదజల్లబడుతుంది ఈ చర్యను ఉష్ణజలీకరణ పేలుడు అంటారు.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు