స్టీమ్‌బోట్ వేడినీటి బుగ్గ

స్టీమ్‌బోట్ వేడినీటి బుగ్గ ఒక సహజసిద్ద వేడినీటి బుగ్గ. అమెరికా లోని ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ యొక్క నోరిస్ గీజర్ బేసిన్ లో ప్రపంచంలోనే పొడవైన, ప్రస్తుతం చురుకుగా ఉన్న, బుగ్గ స్టీమ్‌బోట్ బుగ్గ. భారీ విస్ఫోటనాలు జరిగినప్పుడు నీటిని గాలి లోకి 300 అడుగులకు (90 మీటర్లు) పైగా చిమ్ముతుంది.[3] స్టీమ్బోట్ ప్రధాన విస్పోటనాలు 3 నుంచి 40 నిమిషాల వరకు కొనసాగుతాయి. ఆ తరువాత నీటి ఆవిరిని చిమ్ముతాయి.

స్టీమ్‌బోట్ వేడినీటి బుగ్గ
1960 లలో స్టీమ్‌బోట్ గీజర్
Locationనోరిస్ గీజర్ బేసిన్,
యెల్లోస్టోన్ నేషనల్ పార్క్,
పార్క్ కౌంటీ, వ్యోమింగ్
Coordinates[1]
Elevation7,598 అడుగులు (2,316 మీ.) [2]
Typeకోన్ గీజర్
Eruption height10 అడుగులు (3.0 మీ.) to 300 అడుగులు (91 మీ.)
Frequencyక్రమరహిత, అనూహ్య
Duration3 నుంచి 40 నిమిషాలు
Temperature71.3 °C (160.3 °F) on 1998-06-26 [1]
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/NorrisGeyserBasinSteamboat.JPG" does not exist.

స్టీమ్‌బోట్ ఒక నిర్దుష్టమైన కాలావధుల్లో చిమ్మదు. చిమ్మడాల మధ్య అంతరం 3 రోజుల నుండి 50 సంవత్సరాల అంతరం ఉంటుంది. 1911 నుండి 1961 వరకు ఇది నిద్రాణం గానే ఉంది. 2018-2019 సంవత్సర కాలంలో ఇది 40 సార్లకు పైగా చిమ్మింది. 3 నుండి 4.6 మీ. ఎత్తుకు కొట్టే చిన్నపాటి చిమ్మడాలు మరిన్ని ఎక్కువ సార్లు జరుగుతాయి.

చిమ్మడం ఆగాక, కొన్నిసార్లు పెద్ద మొత్తంలో 48 గంటల వరకూ నీటి ఆవిరిని చిమూతూ ఉంటుంది.[4] ఈ సమయంలో కొన్నిసార్లు మళ్ళీ నీళ్ళు కూడా చిమ్ముతుంది. అయితే ఈసారి తక్కువ ఎత్తుకు కొడుతుంది.[5] దీనికి దగ్గర్లో ఉన్న సిస్టర్న్ బుగ్గ తొలి చిమ్ములాట లోనే మొత్తం నీళ్ళన్నిటినీ ఖాళీ చేస్తుంది. ఆ తరువాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ బుగ్గలోకి నీళ్ళు చేరుతాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 మూస:Cite rcn
  2. "Steamboat Geyser". Geographic Names Information System. United States Geological Survey, United States Department of the Interior.
  3. Bryan, T. Scott (May 1995). The Geysers of Yellowstone (3rd ed.). University Press of Colorado. ISBN 0-87081-365-X.
  4. "Steamboat Geyser". National Park Service.
  5. Various observers. "Steamboat Geyser". GeyserTimes.org. Retrieved August 29, 2018.

చిత్ర మాలిక

మార్చు