వేదాంతం జగన్నాధ శర్మ

వేదాంతం జగన్నాధ శర్మ ( 1922 – 1982 ) కూచిపూడి నాట్యాచార్యులు.

జీవిత విశేషాలుసవరించు

ఆయన నాగమ్మ, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి దంపతులకు కూచిపూడి గ్రామంలో 1922 లో జన్మించాడు. ఆయన వారి తండ్రి వద్ద ప్రారంభ శిక్షణను పొందాడు. ఆయన తన తండ్రిచే మంచి నాట్యకళాకారునిగా మలచబడ్డాడు. ఆయన స్త్రీ పాత్రలలొ మంచి గుర్తింపు పొందాడు. సత్యభామ, ఉష, గొల్లభామ వంటి పాత్రలకు జీవం పోసాడు. ఆయన 1940లలో భారత దేశ వ్యాప్తంగా తన తండ్రితో పాటు పర్యటించి అనేక ప్రదర్శనలిచ్చాదు. ఆయన కూచిపూడి నృత్యానికి మంచి గుర్తింపూ తెచ్చాడు. ఆయన 1940లలో రాజమండ్రి లో నర్తనశాల అనే నాట్య సంస్థను ప్రారంభించాడు. తరువాత ఆయన లక్ష్మీనారాయణ శాస్త్రితో పాటు మద్రాసు వెళ్లాడు. సినిమాలలో నృత్య దర్శకత్వం లో చేరి తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా భాషల యొక్క 50 చిత్రాలకు నృత్య దర్శకత్వం చేసాడు. అందులో ప్రసిద్ధమైన సినిమాలు ఇలవేలుపు, చెంచులక్ష్మీ, బంగారుపాప, కలైఅరసై లు. ఆయన 1964లో హైదరాబాదులో స్థిరపడ్డాడు. 1965లో కూచిపూది కళాక్షేత్రం స్థాపించాడు. సుమతీ కౌష, క్రిష్ణకుమారి, శాంతి ఆకెళ్ళ, భారతి, మద్దాళి ఉషాగాయత్రి, ఆర్. విజయలక్ష్మి మొదలైన వారు ఆయన శిష్యులు. ఆయన మోహినీ భస్మాసుర, ఉషాపరిణయం, భామాకలాపం వంటి నృత్య నాటికలకు కొరియాగ్రాఫ్ చేసాడు. ఆయన తన శిష్యులతో పాటు విదేశాలలో ప్రదర్శనలిచ్చాడు.

ఆయనకు అనేక గౌరవాలు, గుర్తింపులు లభించాయి. నాట్యాచార్య, భరతకళా ప్రపూర్ణ వంటి బిరుదులు పొందాడు. 1980లో సంగీత నాటక అకాడమి పురస్కార్ం పొందాడు. 1977లో హైదరాబాదులోని త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాఅలచే నృత్య విద్వాన్‌మణి బిరుదును పొందాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి సభ్యునిగా తన సేవలనందించాడు.[1]

మూలాలుసవరించు

  1. "కూచిపూది వెబ్‌సైటులొ ఆయన జీవిత విశేషాలు". Archived from the original on 2016-11-12. Retrieved 2016-11-13.

ఇతర లింకులుసవరించు