కూచిపూడి (మొవ్వ మండలం)

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, మొవ్వ మండలం లోని గ్రామం

కూచిపూడి, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 136., ఎస్.టి.డి.కోడ్ నం. 08671.

కూచిపూడి
—  రెవిన్యూ గ్రామం  —
కూచిపూడి is located in Andhra Pradesh
కూచిపూడి
కూచిపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°15′29″N 80°54′52″E / 16.258062°N 80.914319°E / 16.258062; 80.914319
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,941
 - పురుషులు 1,865
 - స్త్రీలు 2,076
 - గృహాల సంఖ్య 1,087
పిన్ కోడ్ 521136
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

 
కూచిపూడి నాట్య ఆద్యులు సిద్ధేంద్రయోగి

ప్రఖ్యాత భారతీయ నృత్యరీతి కూచిపూడి నృత్యం పుట్టింది ఈ గ్రామంలోనే. కూచిపూడి నాట్య ఆద్యులు శ్రీ సిద్ధేంద్రయోగి, ఈ గ్రామంలో మాఘ శుద్ధ ఏకాదశి రోజున జన్మించారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో సాంప్రదాయ నాట్యకుటుంబాలకు చెందిన నాట్యాచార్యులు, మాఘ శుద్ధ ఏకాదశినాడు భక్తిశ్రద్ధలతో నిర్వహించుచున్నారు. ఈ సందర్భంగా ఆయనను ప్రతి సంవత్సరం ఆ రోజున మేళతాళాలతో వేదమంత్రాలతో ఊరేగింపు నిర్వహించుచున్నారు. [11]

తెలుగు వారి ప్రత్యేకతలలో ఒకటిగా, భారతదేశంలోని శాస్త్రీయ నృత్యరీతుల్లో భాగంగా పేరొందిన కూచిపూడి నాట్యరీతికి కూచిపూడి గ్రామమే పుట్టినిల్లు. సిద్ధేంద్ర యోగి ప్రారంభించి విస్తరించిన ఈ రీతి కూచిపూడి ప్రాంతంలో శతాబ్దాల కాలాన్ని అధిగమించి ఇప్పటికీ అనూచానంగా వస్తున్న కళగా నిలిచింది. కూచిపూడి నాట్యరీతి, కూచిపూడి భాగవతుల ప్రశస్తి వంటివి 1500ల నాటికే ఉన్నట్టు మాచుపల్లి కైఫీయతు వల్ల తెలుస్తోంది. సిద్ధవటం పరిపాలకుడైన సామంతుడు సంబెట గురవరాజు చేస్తున్న అసభ్య కార్యాలు, ఘోరాలు ప్రదర్శనగా 1506-09 కాలం నాటి విజయనగర చక్రవర్తి వీర నరసింహరాయల ఎదుట ప్రదర్శించగా ఆయన నిజానిజాలు విచారించి, చేసిన ఘోరాలకు గురవరాజును పట్టి మరణశిక్ష వేసి వధించారు. ఈ విషయాన్ని వివరిస్తూన్న ఆ కైఫీయత్తు వల్ల కూచిపూడి వారికి 1500 నాటికే చాలా ప్రఖ్యాతి ఉన్నట్టు తెలుస్తోంది.[1]

సీ ఆర్ డీ ఏసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

మొవ్వ మండలంసవరించు

మొవ్వ మండలంలోని అయ్యంకి, కూచిపూడి, గుడపాడు, పెదపూడి, పెదశనగలూరు, బార్లపూడి, భట్లపెనుమర్రు, మొవ్వ, యద్దనపూడి, వేములమాడ గ్రామాలు ఉన్నాయి.

కూచిపూడి నృత్య విశేషాలుసవరించు

 1. ఈ గ్రామానికి చెందిన శ్రీ కురవి సదాశివ శాస్త్రి, విజయలక్ష్మి దంపతుల ప్రథమకుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్యప్రసాద్, ప్రస్తుతం గంపలగూడెం మండల పరిషత్తు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైన వీరికి కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి " ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం" లభించింది. ఆయన ఇచ్చిన కూచిపూడి నాట్య ప్రదర్శనకు ఈ పురస్కారం ఇచ్చారు. 3 దశాబ్దాలుగా వీరు 800 పైగా ప్రదర్శనలిచ్చారు. ఇటీవల న్యూడిల్లీలో అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి లీలాశాంసన్ నుండి వీరు ఈ పురస్కారం అందుకున్నారు. 2011వ సంవత్సరానికి సంబంధించి వీరికి ఈ పురస్కారం ఇచ్చారు. [2]
 2. శ్రీ చింతా సీతారామాంజనేయులు గారు (90) కూచిపూడి గ్రామంలో 1922 సెప్టెంబరు 19న జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి సీతమ్మ & నారాయణమూర్తి. వీరిది నాట్యాచార్యుల కుటుంబం. వీరు 1959 నుండి గుడివాడలో ఉంటున్నారు. వీరు "కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం-2013"కి ఎంపికైనారు. త్వరలో వీరు భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీగారి చేతులమీదుగా, ఈ పురస్కారం క్రింద రు. ఒక లక్ష రూపాయల నగదు మరియూ తామ్రపత్రం అందుకుంటారు. కూచిపూడి నాట్యంలో, 70 సంవత్సరాలకు పైగా నాట్యసేవలందించినందుకు వీరిని ఈ పురస్కారం వరించింది. కూచిపూడి నాట్యసంప్రదాయంలోని స్త్రీపురుషపాత్రధారణలతోపాటు, నాట్యాచార్యులుగా గూడా జాతీయస్థాయిలో అరుదైన కళాకారులుగా వీరు వినుతికెక్కారు. 90 ఏళ్ళ వయసులోనూ వీరు చిన్నారులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పించుచున్నారు. [3]

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[3] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో పెడసనగల్లు, అగినిపర్రు, అయ్యంకి, కారకంపాడు, మొవ్వ, కృష్ణాపురం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

మొవ్వ, ఘంటసాల, వుయ్యూరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కూచిపూడి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 45 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

శ్రీ సిద్ధేంద్ర జిల్లా పరిషత్తు ఓరియంటల్ ఉన్నత పాఠశాలసవరించు

 1. ఈ పాఠశాలను 30 లక్షల రూపాయల సిలికానాంధ్ర సంఘం నిధులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దినారు. [8]
 2. ఈ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసే విధంగా సక్సెస్ పాఠశాల గా మార్పుచేస్తున్నారు. [9]
 3. శ్రీమేధా పబ్లిక్ స్కూల్
 4. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

బ్యాంకులుసవరించు

సప్తిగిరి గ్రామీణ బ్యాంక్. ఫోన్ నం 08671/251144. సెల్=8886644145.

శ్రీ సిద్ధేంద్ర యోగి ఉద్యానవనంసవరించు

రైతుబజార్సవరించు

కూచిపూడి గ్రామంలో 46.50 లక్షల రూపాయల మార్కెటింగ్‌శాఖ నిధులతో నూతనంగా నిర్మించిన రైతుబజార్‌ను, 2017,జూన్-6న ప్రారంభించారు. [14]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

 1. 2001 నుండి 2006 వరకు, ఈ గ్రామ పంచాయతీకి శ్రీ పెనుమూడి కాశీవిశ్వనాథం సర్పంచిగా పనిచేసారు. [5]
 2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కందుల జయరాం, సర్పంచిగా ఎన్నికైనారు. [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ గంగా బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయంసవరించు

కూచిపూడి గ్రామంలోని ఈ ఆలయ వార్షికోత్సవం, ప్రతి సంవత్సరం, ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుండి ఫాల్గుణ బహుళ విదియ వరకు జరుగును. 251వ వార్షికోత్సవం, 2014,మార్చ్-12 నుండి 18 వరకూ జరుగును. [4]

శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంసవరించు

కూచిపూడిలోని దుర్గానగర్‌లో వేంచేసియున్న దుర్గాదేవి ఆలయ వార్షిక ఉత్సవాలను, 2017,ఫిబ్రవరి-18వతేదీ శుక్రవారం నిర్వహించెదరు. శుక్రవారం ఉదయం విఘ్నేశ్వరపూజ, పంచామృతాభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చన, గ్రామోత్సవం అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. ఈ ఉత్సవాలను గ్రామపెద్దలు, ఈ ఆలయంలో, 60 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా నిర్వహించుచున్నారు. [13]

శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంసవరించు

కూచిపూడి గ్రామంలో, శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం ప్రక్కనే గల ఈ ఆలయంలో, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ, గోపయ్యస్వామివారల వార్షిక కళ్యాణోత్సవాలు, ప్రతి సంవత్సరం, మాఘ శుద్ధ పౌర్ణమికి (ఫిబ్రవరి నెలలో) కన్నులపండువగా నిర్వహించెదరు. [12]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

 1. కూచిపూడి గ్రామాన్ని, అమెరికాకు చెందిన సిలికానాంధ్ర సంస్థ దత్తత తీసుకున్నది. ఈ గ్రామంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. [6]
 2. ఈ గ్రామానికి చెందిన మల్లేడ రఘురాం, అను 11 సంవత్సరాల వయసుగల బాలుడు, ఐదు సంవత్సరాల క్రితం, ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఆరంభించి, కఠోరసాధన చేయుచూ, నైపుణ్యాని సాధించి, పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పతకాలు సాధించడమేగాక, కరాటేలో బ్లాక్ బెల్ట్ కైవసం చేసుకున్నాడు. [7]
 3. ఈ గ్రామంలోని ఇటుకరాళ్ళతో కట్టిన బావిని, 1883 లో వేదాంతం కుటుంబీకులు త్రవ్వించారు. ఆ రోజులలో శ్రీ బాలాత్రిపురసుందరీ అమ్మవారి శ్రీచక్ర స్నాన ఘట్టాన్ని ఇక్కడే నిర్వహించేవారు. 1946లో ఈ బావిని శ్రీ వేదాంతం మల్లుభట్టు పునరుద్ధరించారు. తాజాగా, శ్రీ కూచిభొట్ల ఆనంద్, ఈ బావిని పునరుద్ధరించడానికి నిర్ణయించారు. [9]
 4. ఈ గ్రామంలోని ఇందిరానగర్ కు చెందిన చర్మకారుడు శ్రీ కొమ్మమూరి వందనం కుమారుడు జయకర్, యు.జి.సి.ప్రకటించే రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషికి ఎంపికైనాడు. ఇతనికి రెండు సంవత్సరాలపాటు ప్రతి నెలా 25,000 రూపాయలు అందుతుంది. [10]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3615.[4] ఇందులో పురుషుల సంఖ్య 1766, స్త్రీల సంఖ్య 1849, గ్రామంలో నివాసగృహాలు 1010 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 257 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,941 - పురుషుల సంఖ్య 1,865 - స్త్రీల సంఖ్య 2,076- గృహాల సంఖ్య 1,087

మూలాలుసవరించు

 1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
 3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Kuchipudi". Archived from the original on 26 ఆగస్టు 2016. Retrieved 24 June 2016. External link in |title= (help)
 4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా, 2013,అక్టోబరు-23; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా, 2013,నవంబరు-24; 1&16 పేజీలు. [4] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-7; 6వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-12; 11వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-30; 11వపేజీ [7] ఈనాడు అమరావతి; 2015,మే-28; 38వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,జూన్-16; 38వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,జులై-19; 28వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2016,జనవరి-14; 24వపేజీ. [11] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-19; 1వపేజీ. [12] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-22; 1వపేజీ. [13] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-17; 2వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2017,జూన్-7; 15వపేజీ.