2008 జూన్ 6 (2008-06-06)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • తమ వర్గానికి ఎస్టీ హోదా కోరుతూ రాజస్థాన్ లో గుజ్జర్లు చేస్తున్న ఆందోళన ఉధృతం. రాష్ట్రం గుండా వెళ్ళే పలు రైళ్ళ దారి మళ్ళింపులు, 27 రైళ్ళు రద్దు.
  • శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో బాంబు పేలి 21 మంది మృతి.
  • చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి ప్రణబ్ ముఖర్జీ గ్వాంగ్‌డోంగ్ ప్రావిన్స్‌లోని గ్వాంజు నగరంలో భారత దౌత్యకార్యాలయాన్ని ప్రారంభించాడు.
  • ఇంధన ధరల పెంపుపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతటా ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది.
  • మహిళా టెన్నిస్‌లో టాప్ ర్యాంకును సెర్బియాకు చెందిన అనా ఇవనోవిచ్ సాధించింది.
  • కాలి గాయం వల్ల ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్ నుంచి మహేష్ భూపతి వైదొలిగినాడు.
  • భారత ద్రవ్యోల్బణం మళ్ళీ 0.14% పెరిగి 8.24%కి చేరింది.