వేనాడు దర్గా
తడ మండలం వేనాడు షేక్ దావూద్‌వలీ అల్లా దర్గా ప్రాముఖ్యం పొందిన దర్గా.[1] ఆసియాలోనే అతిపెద్ద సమాధిగా గుర్తింపు పొందింది. ఇక్కడ 144 అడుగుల పొడవున్న అల్లా తాత సమాధి వద్ద ఏటా గంథోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాను హిందూ, ముస్లింలు దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి నెలా అమావాస్య రోజున ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నిద్రిస్తే దుష్టశక్తులు తొలగి, కోరుకున్నది నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
రవాణా సౌకర్యం
మార్చుసూళ్లూరుపేట నుంచి వేనాడు 25 కి.మీ దూరంలో ఉంది. శ్రీహరికోటకు వెళ్లే మార్గంలో అటకానితిప్ప నుంచి పులికాట్ సరస్సు మధ్యలో వేనాడుకు గ్రావెల్ రోడ్డు ఉంది. సూళ్లూరుపేట నుంచి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఆటోలు, జీపుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.
మూలాలు
మార్చు- ↑ జి., రవికిరణ్. "Nellore beaches a hub for coastal tourism". thehindu.com. ది హిందు. Retrieved 6 October 2017.