వేపగింజల కషాయం ఒక వ్యవసాయదారులు సస్యరక్షణలో ఉపయోగించే ద్రవ పదార్థం. దీనిని క్రిమినాశకాలైన రసాయన మందులకు ప్రత్నామ్నాయంగా రైతులు వాడుతున్నారు.[1]

వేప గింజలు

వేపగింజల కషాయం తయారు చేయట మార్చు

కావలసిన పదార్ధాలు
  • 5 శాతం వేపగింజల కషాయం గల 100 లీటర్ల ద్రావణం తయారు చేయటకు కావలసిన పదార్ధాలు.
  • బాగా ఎండిన వేప గింజల విత్తనాలు – 5 కేజీలు.
  • నీరు – 100 లీటర్లు.
  • సబ్బు పొడి -200 గ్రాములు.
  • వడపోత కోసం పలుచని గుడ్డ.
పద్ధతి
  • అవసరమైన 5 కేజీల వేప గింజల విత్తనాలను తీసుకోవాలి.
  • విత్తనాలను నూరి పొడి చేయాలి
  • 20 లీటర్ల నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి.
  • ఉదయాన్నే కర్రపుల్లతో ద్రావణాన్ని పాల తెలుపు రంగు వచ్చే వరకు బాగా కలయ తిప్పాలి.
  • పలుచని గుడ్డసంచితో వడపోసి 100 లీటర్ల ద్రావణం తయారు చేయాలి.
  • 1 శాతం సబ్బు పొడిని ద్రావణంలో కలిపి తిప్పాలి.
  • ద్రావణాన్ని బాగా కలిపి ఉపయోగించుకోవాలి.
గమనిక
  • వేప కాయలను కాయలు కాసే కాలంలో సేకరించి, నీడలో గాలికి ఆరబెట్టాలి.
  • ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం ఉన్న విత్తనాలను ఉపయాగించరాదు. ఈ వయసు కంటే ఎక్కువ దాచి ఉంచిన విత్తనాలు[+] ద్రావణం తయారికి[+] పనికిరావు.
  • ఎల్లప్పుడు తాజాగా తయారుచేసిన వేప గింజల కషాయ ద్రావణాన్ని ఉపయాగించాలి.
  • మంచి ఫలితాలు రావాలంటే ద్రావణాన్ని 3.30 P.M తర్వాత పిచికారి చేయాలి

ఇవి కూడా చూడండి మార్చు

వనరులు మార్చు

  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]