వేలేర్ మండలం

తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని మండలం


వేలేర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] అపుడు వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది.[3][4] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో మూడు నిర్జన గ్రామాలు.

వేలేర్
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, వేలేర్ స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, వేలేర్ స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, వేలేర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ జిల్లా
మండల కేంద్రం వేలేర్
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 100 km² (38.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 24,746
 - పురుషులు 12,564
 - స్త్రీలు 12,182
పిన్‌కోడ్

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు

మార్చు

లోగడ వేలేర్ గ్రామం లోగడ వరంగల్ జిల్లా వరంగల్ రెవెన్యూ డివిజను,ధర్మసాగర్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వేలేర్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన వరంగల్ (పట్టణ) జిల్లా వరంగల్ రెవెన్యూ డివిజను పరిధి క్రింద వేలేర్ గ్రామంతో కలుపుకొని (1+09) పది గ్రామాలతో నూతన మండల ప్రధాన కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 100 చ.కి.మీ. కాగా, జనాభా 24,746. జనాభాలో పురుషులు 12,564 కాగా, స్త్రీల సంఖ్య 12,182. మండలంలో 6,143 గృహాలున్నాయి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. వేలేర్
  2. పీచర
  3. గుండ్లసాగర్
  4. సోదషపల్లి
  5. మల్లికుదుర్ల
  6. కన్నారం
  7. ఎర్రబిల్లి

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  5. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.