హన్మకొండ రెవెన్యూ డివిజను

హన్మకొండ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. హన్మకొండ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం హన్మకొండ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను హన్మకొండ లోక్‌సభ నియోజకవర్గం, హన్మకొండ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

హన్మకొండ రెవెన్యూ డివిజను
హన్మకొండ విహంగ వీక్షణం
హన్మకొండ విహంగ వీక్షణం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహన్మకొండ

వివరాలు

మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

మార్చు

హన్మకొండ డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం హన్మకొండ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 హన్మకొండ మండలం 6 రెవెన్యూ గ్రామాలు
2 కాజీపేట మండలం 10 రెవెన్యూ గ్రామాలు
3 ఐనవోలు మండలం 10 రెవెన్యూ గ్రామాలు
4 హసన్‌పర్తి మండలం 18 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
5 వేలేర్ మండలం 10 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
6 ధర్మసాగర్ మండలం 31 రెవెన్యూ గ్రామాలు
7 ఎల్కతుర్తి మండలం 13 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
8 భీమదేవరపల్లి మండలం 12 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
9 కమలాపూర్ మండలం 17 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-05-05.
  3. "Revenue (District Administration) Department - Formation/ Re-Organization of warangaI urban Rural Districts into Hanumakonda and warangal Districts" (PDF). Government of Telangana. 12 August 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-05-05. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)