వైష్ణవి (తమిళ నటి)

వైష్ణవి (02 ఫిబ్రవరి 1986 – 17 ఏప్రిల్ 2006) ఒక భారతీయ సినిమా సీరియల్ నటి. వైష్ణవి తమిళ సినిమా సీరియల్స్ లో నటించింది.

వైష్ణవి
జననం1986 ఫిబ్రవరి 2
మరణం2006 ఏప్రిల్ 17
అన్నా నగర్ చెన్నై

నట జీవితం మార్చు

వైష్ణవి అన్నీ, ముహూర్తం, మలర్గళ్ అనే తమిళ సీరియల్స్ లో నటించింది. ఆమె అనేక టీవీ సీరియల్స్‌లో నటించింది విజిల్ చిత్రంలో కథానాయక షెరిన్ స్నేహితురాలిగా కూడా నటించింది. సన్ టీవీలో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే కొండాట్టం అనే కామెడీ ప్రోగ్రాం కు వ్యాఖతగా కూడా పనిచేసింది.