వై.విశ్వేశ్వర రెడ్డి

యల్లారెడ్డి గారి విశ్వేశ్వరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

వై.విశ్వేశ్వర రెడ్డి
వై.విశ్వేశ్వర రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - 2019
నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 25 ఫిబ్రవరి 1960
రాకెట్ల
ఉరవకొండ మండలం
కడప జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సీపీఎం
తల్లిదండ్రులు లలితమ్మ, నారాయణరెడ్డి
జీవిత భాగస్వామి భువనేశ్వరి
సంతానం ప్రణయ్‌కుమార్‌రెడ్డి

జననం, విద్యాభాస్యం

మార్చు

వై.విశ్వేశ్వర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం , రాకెట్ల గ్రామంలో 1960 ఫిబ్రవరి 25లో లలితమ్మ, నారాయణరెడ్డి దంపతులకు జన్మించాడు. ఆయన 1983లో ఎస్.వి. యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

వై.విశ్వేశ్వర రెడ్డి విద్యార్థి దశలో సీపీఎం పార్టీ అనుబంధ సంస్థలైన ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ల్లో పనిచేసి, 2004లో కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా ఉరవకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. విశ్వేశ్వర రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేతిలో ఓడిపోయాడు.

వై.విశ్వేశ్వర రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [పయ్యావుల కేశవ్]] పై 2275 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో 2132 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.

మూలాలు

మార్చు
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.