వై. సవితా దేవి

వైద్యురాలు

వై. సవితా దేవి హైదరాబాదులో ప్రసూతిశాస్త్ర, మహిళా వైద్యురాలు, ఆసుపత్రి నిర్వాహకులు.[1]

జీవిత సంగ్రహం

మార్చు

వై.సవితాదేవి విశాఖపట్నంలో విజయకుమార్, నాగరత్నమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తల్లి ఉపాధ్యాయిని. సవితాదేవిని వైద్యురాలిగా చూడాలనేది ఆ తల్లిదండ్రుల ఆకాంక్ష. ఆమె విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల చేరి డిగ్రీతో పాటు స్త్రీల, ప్రశూతి శాస్త్రంలో స్పెషలైజేషన్ కూడా అత్యంత శ్రద్ధతో చదివి విద్యార్థులందరిలో అత్యుత్తమ విద్యార్థిగా గుర్తింపుపొందింది. ఆకాలంలో 8 బంగారు పతకాలు, రాష్ట్రపతి సిల్వర్ మెడల్ తో పాటు నాలుగు బహుమతులను గెలుపొందింది.[2]

వైద్యవిద్య పూర్తయిన పిదమ కొద్దికాలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉద్యోగం చేసి, నాలుగు సంవత్సరాలు ఇరాన్ చేరుకుంది. అక్కడ సంపాదించిన అంతర్జాతీయ అనుభవంతో భారతదేశానికి తిరిగివచ్చి బేగంపేట, హైదరాబాద్ లో 1983 సంవత్సరం స్వప్న నర్సింగ్ హోమ్ ను స్థాపించింది. ఇది కాలక్రమేణా బహుళవ్యాధుల వైద్యశాలగా స్వప్న హెల్త్‌కేర్ గా రూపొందింది.[3]

వీరు కొన్ని దశాబ్దాలుగా వైద్యసేవలందిస్తూ, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పరిశోధన వ్యాసాలను ప్రచురించింది. అంతేకాకుండా ప్రజలలో ముఖ్యంగా స్త్రీలలో వారి ఎదుర్కొంటున్న వ్యాధులగురించి అనేక ప్రసార మాధ్యమాల ద్వారా అవగాహన పెంచడానికి ఎంతో కృషిచేసింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె డా. వై శ్రీరామమూర్తిని వివాహం చేసుకుంది. ఆమె భర్త చెవి, ముక్కు, గొంతు వైద్యుడు. వీరికి ఒక కూతురు స్వప్న, ఒక కుమారుడు ఉన్నారు. వీరి కుటుంబం హైదరాబాదు స్థిరపడ్డారు.

పురస్కారాలు[4]

మార్చు
  1. విశిష్ట మహిళా పురస్కారం : 1997
  2. వైద్య విజ్ఞాన రత్న : 2002
  3. విశిష్ట సర్కార్ :2003
  4. అక్కినేని నాగేశ్వరరావు స్వర్ణ కంకణం అవార్డు : 2006
  5. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పురస్కారం, సన్మానం : 2010
  6. దశాబ్ది మహిళా అవార్డు : 2012
  7. హ్యూమన్ ఎక్స్‌లెన్స్ పురస్కారం : 2013

మూలాలు

మార్చు
  1. "Dr Savitha Devi - Gynecologist at Swapna Healthcare". skedoc (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
  2. https://www.swapnahealthcare.com/doctors-subpage/dr-y-savitha-devi[permanent dead link]
  3. https://www.swapnahealthcare.com/
  4. "Dr.Y. Savitha Devi, Obstetrician and Gynecologist - Swapna Healthcare". Sehat (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.