వ్యర్ధాల నుండి శక్తి కర్మాగారం

వ్యర్దాల నుండి శక్తి కర్మాగారం, వ్యర్థపదార్దాలను సులువుగా శుద్ధి చేస్తుంది, ఇది శుద్ధి చేసిన వ్యర్దాలను దహనం చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి కర్మాగారాలను కొన్నిసార్లు, చెత్త నుండి శక్తి, పురపాలక వ్యర్ధాలను కాల్చడం, శక్తిని తిరిగి పొందడం లేదా వనరులను తిరిగి పొందే కర్మాగారం అని కూడా పిలుస్తారు.

ఈ కాలపు వ్యర్ధాల నుండి శక్తి కర్మాగారాలు, కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న కర్మాగారాల మధ్య చాలా భేదాలు ఉన్నాయి. అప్పటి కర్మాగారాలు ఇప్పటి కర్మాగారాలులాగా వ్యర్దాలను దహనం చేసే ముందు వాటిలో ఉన్న ప్రమాదకరమైనవి, తిరిగి ఉపయోగించే పదార్దాలను తొలగించేవారు కాదు. ఈ కారణం చేత కర్మాగారం లో పని చేసే కార్మికులకి, చుట్టుపక్కల నివసించేవారికి ఆరోగ్యాలకి హాని కలిగేవి. అంతేకాకుండా, చాలా కర్మాగారాలు విద్యుత్తు ఉత్పత్తి చేయడంలో విఫలం అయ్యాయి.

వ్యర్దాల నుండి శక్తిని తీయటాన్ని, రకరకాల విధానాలలో శక్తిని నిల్వ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా వ్యర్ధాలనుండి శక్తిని ఉత్పత్తి చేయడంలో స్వీడన్ అగ్రగామిగా ఉంది. ఒక టన్ను వ్యర్ధాలను కాల్చడం వలన 500 నుండి 600 కిలోవాట్ల సాధారణ శ్రేణి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.[1] అందువల్ల ప్రతిరోజూ 2,200 టన్నుల వ్యర్ధాలను కాల్చడం వలన 1200 మెగావాట్ల విద్యుత్తు [2]శక్తి ఉత్పత్తి అవుతుంది.

ఎలా పనిచేస్తుంది

మార్చు

దాదాపు అన్ని వ్యర్ధాల నుండి శక్తి కర్మాగారాలు, పురపాలక ఘన వ్యర్ధాలను [3]దహనం చేస్తాయి, కానీ కొన్ని కర్మాగారాలు పారిశ్రామిక వ్యర్ధాలను[4] అంటే హానికలిగించే వ్యర్ధాలను [5]దహనం చేస్తున్నాయి. సరిగ్గా పనిచేస్తున్న ఆధునిక వ్యర్ధాల నుండి శక్తి కర్మాగారాలు వ్యర్దాలను దహనం అందులోని పదార్ధాలను వేరుచేసి మళ్ళీ పునరావృత పద్దతి[6] ద్వారా తిరిగి ఏర్పడుతుంది. కాలిపోయిన వస్తువులు మాత్రమే రూపకల్పన ద్వారా కానీ ఆర్ధికంగా కానీ తిరిగి ఉపయోగించలేము, అంతేకాకుండా ప్రమాదకరం కూడా కాదు.

రూపకల్పన, పరికరాల విషయాల్లో, వ్యర్ధాల నుండి శక్తి కర్మాగారాలు, ఇతర ఆవిరి-విద్యుత్తు శక్తి కర్మాగారాలతో , ముఖ్యంగా జీవద్రవ్య కర్మాగారాలతో సమానంగా ఉంటాయి. మొదట వ్యర్ధాలను కర్మాగారానికి తీసుకువస్తారు. తరువాత వ్యర్ధాలలో ఉన్న, తిరిగి ఉపయోగించేవి,ప్రమాదకరమైన పదార్ధాలను తీసివేస్తారు. శుద్ధి చేసిన వ్యర్దాలను కాల్చే సమయం అయ్యేవరకు నిల్వచేస్తారు.కొన్ని కర్మాగారాలు, వాయువుగా మార్చే పద్దతిని[7] ఉపయోగిస్తాయి, కానీ చాల కర్మాగారాలు వ్యర్ధాలను నేరుగా దహనం చేస్తాయి.ఎందుకంటే, ఈ పద్దతి అనుభవయోగ్యమైనది, సాంకేతికంగా సమర్ధవంతమైనది. కర్మాగారం రూపకల్పన బట్టి, వ్యర్ధాలను బానలో నిరంతరం లేదా వంతులవారీగా వేస్తారు.

పరిణామం పరంగా చూస్తే వ్యర్ధాల నుండి శక్తి కర్మాగారాలు 80 నుండి 90 శాతం వ్యర్దాలను దహనం చేస్తాయి. కొన్నిసార్లు, మిగిలిన భూడిదను, కాల్చేనా బొగ్గుతో చేసే దిమ్మలా తయారీకి, రహదారి నిర్మించడానికి ఉపయోగించే ముడిపదార్ధాల్లో ఉపయోగిస్తారు. యాంత్రికకుండా, కాలిపోయిన లోహాలను కొలిమి క్రింద నుండి సేకరించి, లోహాలను పోత పొసే వారికీ అమ్ముతారు. కొన్ని వ్యర్దాలనుండి శక్తి కర్మాగారాలు చల్ల బరిచే విధానాల ఉత్పత్తిగా ఉప్పు నీటిని మంచి నీతిగా మారుస్తాయి.

ఖర్చు

మార్చు

400 గీగా వాట్ల శక్తిని ఉత్పత్తి చేయు సామర్థ్యం కలిగిన సాధారణ కర్మాగారాన్ని నిర్మించడానికి సంవత్సరానికి 44,000,000 డాలర్లు ఖర్చు అవుతుంది. వ్యర్దాల నుండి శక్తి కర్మాగారాలకు సాంప్రదాయ విద్యుత్తును ఉపయోగిస్తే ఖర్చు విషయంలో చాలా లాభం ఉంటుంది.

మూలాలు

మార్చు
  1. https://en.wikipedia.org/wiki/Kilowatt_hour
  2. https://en.wikipedia.org/wiki/Watt#Megawatt
  3. https://en.wikipedia.org/wiki/Municipal_solid_waste
  4. https://en.wikipedia.org/wiki/Industrial_waste
  5. https://en.wikipedia.org/wiki/Hazardous_waste
  6. https://en.wikipedia.org/wiki/Recycling
  7. https://en.wikipedia.org/wiki/Gasification