వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర చంపోలి అనే ప్రాంతంలో ఉంది.[1] ఈ ఉద్యానవనాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యానవనం
ప్రదేశంఉత్తరాఖండ్
సమీప నగరంచమోలి
విస్తీర్ణం87.50 చ. కి.మీ.

చరిత్ర

మార్చు

1931 లో ఫ్రాంక్ ఎస్. స్మిత్, ఎరిక్ షిప్టన్, ఆర్.ఎల్. హోల్డ్‌స్వర్త్ అనే బ్రిటిష్ పర్వతారోహకులు కామెట్‌ అనే పర్వతాన్ని అధిరోహించి తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పిపోయి పువ్వులతో నిండిన ఒక లోయ ప్రాంతాన్ని చూసి ఆకర్షితులై ఆ లోయ ప్రాంతానికి "పువ్వుల లోయ" అని పేరు పెట్టారు. ఈ ఉద్యానవనం పేరుతో ఫ్రాంక్ స్మిత్ ఒక పుస్తకాన్ని రచించాడు. 1939 లో ఒక వృక్షశాస్త్రజ్ఞుడు జోన్ మార్గరెట్ లెగ్గే ఈ ప్రాంతంలో ఉన్న పువ్వులపై అధ్యయనం చేయడానికి లోయ వద్దకు వచ్చినప్పుడు పువ్వులు సేకరించడానికి వెళ్ళినపుడు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయింది. ఆమె మరణతరం తన సోదరి ఈ లోయను సందర్శించి తన సోదరి స్మారకర్దాన్ని నిర్మించింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేత నియమించబడిన వృక్షశాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ చంద్ర ప్రకాష్ కాలా 1993 నుండి ఒక దశాబ్దం పాటు లోయ యొక్క పూల, పరిరక్షణపై అధ్యయనం చేశాడు. ఈ ఉద్యానవనంలో పెరుగుతున్న 520 ఆల్పైన్ మొక్కల జాబితాను తయారు చేశాడు. అదేకాక ఈ ఉద్యనవనంపై అధ్యయనం గురించి "ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ - మిత్ అండ్ రియాలిటీ", "ఎకాలజీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ పేర్లతో రెండు పుస్తకాలను రచించాడు.[2]

 
పుష్పవతి నది పువ్వుల లోయలో
 
మంచు చిరుతపులి

పువ్వుల వివరాలు

మార్చు

ఈ ఉద్యానవనాన్ని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం స్థాపించబడింది.[3] దీని ప్రవేశద్వారం వద్ద ఉన్న అరుదైన మొక్కలను, ఔషధ మొక్కలను,  మూలికలను పరిశోధన చేయడానికి ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పరిచారు. 1993 నుంచి ఈ ఉద్యానవనంలో ఉన్న పువ్వుల గురించి ప్రొఫెసర్ సి. పి. కాలా అధ్యయనం చేసి ఇక్కడ 520 జాతుల ఎత్తైన మొక్కలు ఉన్నాయని  వీటిలో 498 పుష్పించే మొక్కలని తేల్చిచెప్పాడు. ఈ ఉద్యానవనంలో డాక్టిలోర్హిజా హటాగిరియా, పిక్రోహిజా కుర్రూవా, పాలిగోనాటం మల్టీఫ్లోరం, ఫ్రిటిల్లారియా రోయిలీ, పోడోఫిలమ్ హెక్సాండ్రం వంటి అనేక రకాల ఔషద మొక్కలు ఉన్నాయి.[4]

మరిన్ని విశేషాలు

మార్చు

1862 : పుష్పవతి లోయను కల్నల్ ఎడ్మండ్ స్మిత్ కనుగొన్నాడు.

1931 : అధిరోహకుడు ఫ్రాంక్ ఎస్. స్మిత్ సందర్శించిన లోయ "పువ్వుల లోయ" ను ప్రచారం చేస్తూ ఒక పుస్తకం రాసారు.

1936 : పర్వతారోహకులు బిల్ టిల్మాన్ & నోయెల్ ఓడెల్ నందా దేవి అనే పర్వతాన్ని అధిరోహించారు.

1939 : నందా దేవి గేమ్ అభయారణ్యంగా ప్రకటించారు.

1974-82 : ఈ ఉద్యానవనం పర్వతారోహణకు అనుమతినివ్వబడింది. కాని తరువాత కాలంలో పర్వత రోహకుల నుంచి స్పందన కరువడంతో ఈ పర్వతరోహణను మూసివేశారు.

1980: ఈ పార్కును సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ గా స్థాపించారు.

1980 : 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం యొక్క నిబంధనల ప్రకారం లోయలో ఉన్న పువ్వుల పరిరక్షణకు ఈ వనాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు.

1982 : ఈ ఉద్యనవనాన్ని నందా దేవి న జాతీయ ఉద్యనవనంగా గా పేరు మార్చారు.

2000 : ఈ ఉద్యనవనాన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ ఉద్యనవనంగా పేరు మార్చారు.

2004 : రెండు కోర్ జోన్లు, బఫర్ జోన్ యునెస్కో మాబ్ రిజర్వ్‌గా గుర్తింపునించింది.

 
`లోయలో పువ్వులు

మూలాలు

మార్చు
  1. N. Ulysses and Tabish, Thingnam Girija. "Trek to Valley of Flowers". Flowers of India. Archived from the original on 27 సెప్టెంబరు 2019. Retrieved 29 September 2019.
  2. Chandra Prakash Kala. "How Valley of Flowers got World Heritage Site tag". Down to Earth. Archived from the original on 22 సెప్టెంబరు 2013. Retrieved 30 September 2019.
  3. Kala, C.P. (2005). "The Valley of Flowers; A newly declared World Heritage Site" (PDF). Current Science. 89 (6): 919–920. Archived from the original (PDF) on 2018-10-17. Retrieved 2019-09-30.
  4. Kala, C.P. 2004. The Valley of Flowers; Myth and Reality. International Book Distributors, Dehradun, India