శంఖము (ఆంగ్లం Conch) (pronounced as "konk" or "konch", మూస:IPAEng or /ˈkɒntʃ/)[1] ఒకరకమైన మొలస్కా జాతికి చెందిన జీవి. ఇవి వివిధ జాతులకు చెందిన మధ్యమ పరిమాణంలోని ఉప్పునీటి నత్తలు లేదా వాటి కర్పరాలు.

శంఖాలు
An adult Queen Conch shell, Strombus gigas
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Subclass:
Superorder:
Order:
Suborder:
Infraorder:
Superfamily:
Family:
Genus:
స్ట్రాంబస్
జాతులు

Strombus gigas
Strombus luhuanus
Strombus pugilis
Strombus tricornis
Strombus canarium
Strombus dolomena
Strombus gibberulus
Strombus conomurex
Strombus lentigo
Strombus doxander
Strombus urceus
Strombus fragilis
Strombus gallus
Strombus dentatus
Strombus marginatus
Strombus raninus
Strombus buvonius

"శంఖము" అనే పదాన్ని ఇంగ్లీషు మాట్లాడే దేశాలలో విస్తృతంగా చాలా రకాల సర్పిలాకారంగా, రెండు వైపులా మొనదేలి ఉండే పెద్ద కర్పరాలకు ఉపయోగిస్తున్నారు. ఇందులో కిరీటపు శంఖాలైన మెలాంగినా జాతులు, గుర్రపు శంఖాలైన (Pleuroploca gigantea), పవిత్రమైన శంఖాలు (Turbinella pyrum) కూడా ఉన్నాయి. ఇవన్నీ నిజమైన శంఖాలు కావు.

నిజమైన శంఖాలు సముద్రంలో నివసించేగాస్ట్రోపోడా తరగతికి చెందిన స్ట్రాంబిడే (Strombidae) కుటుంబంలోని స్ట్రాంబస్ (Strombus) ప్రజాతికి చెందిన జీవులు. ఇవి చాలా చిన్నవాటినుండి చాలా పెద్దవాటి వరకు వివిధ పరిమాణాలలో ఉంటాయి. వీటిలో చాలా జాతులు వాణిజ్యపరంగా ఆహార పదార్ధాలుగా ముఖ్యమైనవి. Strombus gigas శంఖువుల నుండి ఖరీదైన ముత్యాలు తయారౌతాయి. సుమారు 65 జాతుల శంఖులు అంతరించిపోయాయి. జీవించియున్న జాతులు ఎక్కువగా హిందూ మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రంలో నివసిస్తున్నాయి. ఆరు జాతులు కారీబియన్ ప్రాంతంలో నివసిస్తున్నాయి. చాలా శంఖు జాతులు ఇసుకమేట వేసిన సముద్రగర్భంలో ఉష్ణప్రాంతాలలో జీవిస్తాయి.

Strombus gigas UNEP యొక్క అంతరించిపోయిన జాతులు జాబితాలో చేర్చబడ్డాయి. వీటి వ్యాపారం అంతర్జాతీయంగా నియంత్రించబడింది.[2]

చెవి దగ్గర శంఖం పెట్టుకుంటే ఓ విధమైన శబ్దం ఎందుకు వస్తుంది

మార్చు

శంఖంలో సర్పిలాకారంలో బోలు ప్రాంతం ఉంటుంది. ఇది పోనుపోను సైజు తగ్గిపోతున్నట్టు ఉంటుంది. ఇటువంటి సాధనాన్ని గాలి వీచే దిశకు ఓ ప్రత్యేక కోణంలో పట్టుకుంటే గాలులు సర్పిలాకార గొట్టంలోకి ప్రవేశించి తిరిగి పరావర్తనం చెందే క్రమంలో గింగిర్లు తిరుగుతాయి. గాలిలో కదిలే కంపనాలే శబ్దాలు. ఈ కంపనాలు సెకనుకు 20నుంచి 20వేల మధ్యలో ఉంటే ఆ కంపనాలను మనిషి చెవి వినగలదు. అందుకే 20 నుంచి 20000 వరకు సెకనుకు ఉండే శబ్దం కంపనాలకు మానవ శబ్దగ్రహణ అవధి అంటారు. శంఖంలో కలిగే గాలి కంపనాలు ఈ అవధిలో సంభవిస్తే మనకు శంఖంలో శబ్దాలు వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలా జరగాలంటే శంఖానికి సంబంధించి కొన్ని భౌతిక నియంత్రణలు, గాలికి చెందిన కొన్ని నియంత్రణలు అవసరం. శంఖంలో డొల్ల భాగం ఉండాలి. ఒక ప్రత్యేక భంగిమలోనే శంఖాన్ని పట్టుకోవాలి. గాలిలో కదలికలు ఉండాలి. అవి తగు మోతాదులో ఉండాలి. గాలిలో ఏమాత్రం కదలికలులేని స్థితి ఉంటే శబ్దాలు ఏవీ రావు. అలాగని మరీ విపరీతంగా ఉన్నా మనం వినగలిగిన అవధిలో శబ్దాలు ఏర్పడవు. శంఖమే కాదు ఖాళీగా ఉండే చెంబు, గుండ్రటి వంట పాత్ర కూడా వీచే గాలిలో పట్టుకుంటే శబ్దాల్ని ఇస్తాయి. ఇందుకు కారణం కూడా ఖాళీ ప్రాంతాల్లో స్థిర తరంగాలు ఏర్పడ్డమే.

మానవులకు ఉపయోగాలు

మార్చు
 
A drawing of the shell of Strombus alatus

ఆహార పదార్ధాలు

మార్చు
  • శంఖాలలోని అన్ని భాగాలు మాంసాహారంగా తింటారు. తూర్పు ఆసియా దేశాలలో వీటిని పలుచగా కోసి వేపుడు చేసుకుంటారు.
శంఖారావం

సంగీత పరికరాలు

మార్చు

శంఖు కర్పరాలు ట్రంపెట్ మాదిరిగా గాలితో ఊదే సంగీత పరికరాలు. శంఖము నుండి వెడలే నాదాన్ని శంఖారావం అంటారు.

శంఖాలు ఫిజీ వంటి దక్షిణ పసిఫిక్ దేశాలలో చారిత్రాత్మకంగా ఉపయోగంలో ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని హోటళ్ళలో యాత్రికులకు స్వాగతం ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.

అమెరికన్ జాజ్ సంగీతకారుడు స్టీవ్ టర్రే (Steve Turre) శంఖాలను కూడా తన ఆర్కెస్ట్రాలో ఉపయోగిస్తాడు.[3]

A partially echoplexed Indian conch was featured prominently as the primary instrument depicting the extraterrestrial environment of the derelict spaceship in Jerry Goldsmith's score for the film Alien. Director Ridley Scott was so impressed by the eerie effect that he requested its use throughout the rest of the score, including the Main Title.[4]

Composer John Cage has used partially water-filled conch shells, which, when tilted slowly, create gurgling sounds beyond the player's control, which are then amplified. This sound effect was used by James Horner in the film Troy and by Annea Lockwood in her compositions.[ఆధారం చూపాలి]

హిందూ సంస్కృతిలో శంఖం

మార్చు

పురాణములలో

మార్చు
 
శంఖాన్ని పూరిస్తున్న భక్తుడు

వాయిద్యంగా శంఖం

మార్చు

శివుడు, మహావిష్ణువు, శ్రీకృష్ణుడు మొదలైన దేవుళ్ళ చేతిలో శంఖం వుంటుంది. యుద్ధ భేరి మ్రోగించడానికి, ఏదైనా సందేశం చెప్పడానికి దీనిని వాడుతారు. జంగం దేవరలు దీనిని ఇంటింటికి ముందు వాయిస్తారు. ఈ శంఖానాథాన్ని శుభ సూచకంగా భావిస్తారు.

శంఖం ప్రాశస్త్యం

మార్చు

శంఖే చంద్ర మావాహయామి

కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి

ధారాయాం సర్వతీర్థ మావాహయామి

శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్టాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మందిరాలలోను, శుభకార్యాలలోనూ దీని ధ్వని పవిత్రతను, శోభను పెంచుతుందని హిందువుల నమ్మకం. దీని పుట్టుక సముద్ర మథనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మథనంలో వచ్చిన పదునాలుగు రత్నాలలో శంఖం ఒకటి. విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ. శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు ఉన్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజల వల్ల అభివృద్ధికలుగుతుందని విశ్వసిస్తారు. దీనికి అనేక రకాల పూజా విధానాలు ఉన్నాయి. పూర్వం కొన్నింటిని గృహకృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు. శంఖాలలో చాలా రకాలు ఉన్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు ఉంటాయి. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి.

శంఖం ఎలా పుట్టిందనడానికి బ్రహ్మవైవర్త పురాణంలోని ఒక కథ చెప్తారు. పూర్వ కాలంలో శంఖచూడుడనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ఇచ్చిన వరంతో కృష్ణకవచాన్ని పొందాడు. దానితో ఆ రాక్షసుడు విర్రవీగుతూ స్వర్గంపై దండెత్తి వచ్చాడు. దాంతో స్వర్గాధిపతి ఇంద్రుడు శివుడిని శరణు కోరాడు. శంఖచూడుని పీడ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించాడు. దానితో విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని అభిమానాన్ని చూరగొని కృష్ణకవచ ఉపదేశం పొందాడు. అనంతరం శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు.శంఖచూడుని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసీ తన పాతివ్రత్యమహిమతో శంఖంగా మార్చిందని కథనము.

శంఖాల రకాలు

మార్చు

శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని 3 రకాలుగ వర్గీకరిస్తారు: 1. దక్షిణావృత శంఖం, 2. మధ్యావృత శంఖం, 3. ఉత్తరావృతవ శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు.

శంఖాల పేర్లు

మార్చు

శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నాయి. 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం,

మహాభారతంలోని వివిధ యోధుల శంఖాల పేర్లు ఇలా ఉన్నాయి:

శ్రీకృష్ణుడు - పాంచజన్యం

అర్జునుడు - దేవదత్తం,

భీముడు - పౌంఢ్రకం

యుధిష్ఠిరుడు - అనంత విజయ

నకులుడు - సుఘోష

సహదేవుడు - మణిపుష్పక

కాశీరాజు - శిఖండి

దృష్టద్యుమ్నుడు, విరాటుడు - స్వాతిక

ఉపయోగాలు

మార్చు

శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజలో ఆరతి ఇచ్చేటప్పుడు, ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు, దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన కర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణేశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలు పోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి. విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపిస్తున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నా సహోదరి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవి యొక్క పాదాల వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్థాపించాలి. గణేశ శంఖాలలో నీరు నింపి, గర్భవతులకు త్రాగించినట్లయితే అంగవైకల్యంతో కూడిన సంతానం కలగదని కొందరు నమ్ముతారు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖాల మాలలను ధరిస్తారు కూడా. శాస్త్రవేత్తల అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు[ఆధారం చూపాలి]

. శంఖ భస్మము వల్ల అనేక రోగాలు నయమౌతున్నాయి. ఋష్యశృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని, శంఖము పాపనాశని అని కొందరి విశ్వాసం.

కొన్ని శంఖాల వివరణ

మార్చు

దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షిణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం. ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది, పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం కలకత్తా, బొంబాయి, పూరీలో దొరుకుతాయి.

సముద్ర తనయాయ విద్మహే

శంఖరాజాయ ధీమహీ

తన్నో శంఖ ప్రచోదయాత్‌

మూలాలు

మార్చు
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  1. "§ 51. conch. 7. Pronunciation Challenges. The American Heritage Book of English Usage. 1996". Archived from the original on 2009-02-10. Retrieved 2008-12-17.
  2. [1]
  3. Steve Turre's Sanctified Shells Band, from allaboutjazz.com, 2003-04-10
  4. Mike Matessino, CD-booklet Alien: Complete Original Motion Picture Soundtrack, Intrada (MAF 7102), 2007
"https://te.wikipedia.org/w/index.php?title=శంఖం&oldid=3858253" నుండి వెలికితీశారు