శంభల

(శంబాలా నుండి దారిమార్పు చెందింది)


శంభల అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరం. బౌద్ధ పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉన్నది[1][2]

ప్రత్యేకతలు

మార్చు

కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలూ, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే శంభల . దీనినే పాశ్చాత్యులు హిడెన్ సిట అంటారు.ఎందుకంటే వందలు, వేల మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది అని ప్రతీతి. అది అందరకి కనిపించదు. అది కనిపించాలన్న, చేరుకోవాలి అన్నా ఇంతో శ్రమించాలి. మానసికంగా శారీరకంగా కష్టపడాలి. ఆ నగరాన్ని వీక్షించాలంటే అంతో ఇంతో యోగం కుడా ఉండాలని, ఎవరికి పడితె వారికి కనిపించదు అని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారు అని, ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు.

ఉత్కృష్ట సంప్రదాయాలకు ఆలవాలం అయిన ఆ నగరం గురించి కొంత మంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు.

శంభల నగర ప్రదేశం అంతా అధ్బుతమైన సువాసన అలుముకొని ఉంటుందని అంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలాను వీక్షించడం ఎంతో మధురానుబుతి కలిగిస్తుందని చెబుతారు. బౌద్ధ గ్రంథాలును బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు .ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ, సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్నీది ఫర్బిడెన్ ల్యాండ్ అని ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స అని అంటారు. చైనీయులకు కుడా శంభల గురించి తెలుసు. లోకంలో పాపం పెరిగిపొయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంభలలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు అని అప్పటి నుంచి ఈ పుడమి పైన కొత్త శకం ప్రారంభం అవుతుందని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియచేశాయి.

ఈ నగరంలో నివసించేవారు ఏలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారు అని వారి ఆయువు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని వారు మహిమాన్వితులు అని పురాణాలలో చెప్పబడింది. ఈ నగర విశిష్టతను తెలుసుకున్న రష్యా 1920 లో శంభల రహస్యాన్ని తెలుసుకొవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధనలు చేయించింది.అప్పుడు శంభలకి చేరుకున్న రష్యా మిలటరీ అధికారులకు అనేక ఆశ్చర్య కరమైన విషయాలు తెలిసాయి.అక్కడ యెగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు.ఈ విషయాన్ని తెలుసుకున్న నాజి నేత హిట్లర్ 1930 లో శంభల గురించి తెలుసుకొవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు.ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్ కి చెప్పాడు .అంతే కాక హిమ్లర్ శంభలలో మరెన్నో వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడు అని అంటారు.

గోబీ ఎడారి దగ్గరిలోని ఉన్న శంభలనే రాబోయే రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో రాసాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు plaanets of head center అంటారు . శంభల గురించి ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త, బౌద్ధ మత అభిమాని, రచయత్రి alexandra devid neel పరిశోధించి గ్రంథాలు రచించింది.ఆమె తనకు 56 ఏళ్ళ వయస్సులో ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంభల గురించి తెలుసుకుని అక్కడకి వెళ్లి మహిమాన్వితుల ఆశిస్సులు తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బ్రతికింది అని అంటారు.ఆమె 1868 అక్టోబరు 24 లో జన్మించి 1969 సెప్టెంబరు 8 లో మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లో కాలుమోపిన తొలి యూరోపియన్ వనిత ఆమె .

అలాగే షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కుడా శంభల పై చాలా పరిశోధన చేసాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంభల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచం లోని ఎక్కడి వారితొ నైనా సంభాషించ గలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు. ఎనిమిది రేఖుల భారి కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు.

మూలాలు

మార్చు
  1. "శంభల! అద్భుతమా..? అపోహా." www.sakshi.com. Sakshi. 25 August 2015. Retrieved 25 August 2015.
  2. ""Mystery of Shambhala"". www.newdawnmagazine.com/. JASON JEFFREY. 1 May 2002. Archived from the original on 17 May 2008. Retrieved 16 June 2015.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=శంభల&oldid=3956805" నుండి వెలికితీశారు