శంభు ప్రసాద్ తుండియా
శంభు ప్రసాద్ తుండియా గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారతీయ జనతా పార్టీ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశాడు.
శంభుప్రసాద్ తుండియా | |||
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2007 – 2012 | |||
ముందు | మానహర్ లాల్ మక్వాన | ||
---|---|---|---|
తరువాత | పూనంభాయ్ మక్వాన | ||
నియోజకవర్గం | దాసడ | ||
రాజ్యసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2014 – 2020 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జంజార్క. ఢంధూక జిల్లా, అహ్మదాబాద్, గుజరాత్ | 1970 నవంబరు 14||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జననం, విద్యాభాస్యం
మార్చుశంభుప్రసాద్ 1970 నవంబరు 14న గుజరాత్ రాష్ట్రం, ఢంధూక జిల్లా, జంజార్క లో బాల్దేవ్ దాస్, సవితా బెన్ దంపతులకు జన్మించాడు. ఆయన అహ్మాదాబాద్ విశ్వవిద్యాలయం నుండి బి. ఏ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుశంభుప్రసాద్ తూండియా భారతీయ జనతా పార్టీలో చేరి కార్యకర్త స్థాయి నుండి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2007లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దాసడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి గెలిచి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగుపెట్టాడు. శంభుప్రసాద్ తూండియా 2014లో భారతీయ జనతాపార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికై,[1] 2020 వరకు ఎంపీగా పని చేశాడు.[2] శంభుప్రసాద్ తూండియా 2017లో గుజరాత్ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా పని చేశాడు.[3]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (5 February 2014). "BJP, Cong candidates file nomination for RS polls" (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
- ↑ The Indian Express (22 January 2020). "Gujarat: Polls to 4 Rajya Sabha seats by April" (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.
- ↑ The Indian Express (10 December 2018). "Gujarat MP demands Dalit member in BJP panel" (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2022. Retrieved 25 April 2022.