శకుంతల (చిత్తరువు)
శకుంతల లేదా దుష్యంతునికై ఎదురు చూస్తున్న శకుంతల భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రించిన పురాణ చిత్రలేఖనం. రవివర్మ దీనిని మహాభారత గాధలో ముఖ్యమైన పాత్ర ఐన శకుంతల ను వర్ణిస్తుంది. ఈ చిత్రంలో ఆమె తన పాదం లో గుచ్చుకున్న ముల్లును తీస్తున్నట్లు చిత్రించాడు. ఆమె తనను వదిలివేసిన దుష్యంతుని కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆమె చెలికత్తెలు ఆమెగూర్చి సంభాషిస్తున్నట్లు చిత్రంలో ఉంది.[1]
కళాకారుడు | రాజా రవివర్మ |
---|---|
సంవత్సరం | 1870 |
ప్రదేశం | కిల్లిమనూర్ |
తపతి గుహా ఠాకుర్తా అనే కళా చరిత్రకారుడు రాశాడు;
ఈ చిత్రంలో అభినయం - తల, శరీరం వెనుకకు తిరిగి ఉంటుంది. ఇది వీక్షకుడిని కథనంలోకి ఆకర్షిస్తుంది. ఈ చిత్రంలోని అంశాలు ఆనాడు జరిగిన సంఘటనలను క్రమంలో ఊహించేందుకు అందరినీ ఆహ్వానిస్తుంది. ఈ చిత్రం స్వంతంగా చిత్రించిన పెయింటింగ్ స్తంభింపచేసిన అద్భుత దృశ్యం లాగా ఉంటుంది (చలన చిత్రం నుండి తీసిన భంగిమ లాగా) ఇది జరుగుతున్న సంఘటనలోని ఒక దృశ్యాన్ని తీసివేసిన చిత్రంలాగ ఉంటుంది. ఈ చిత్రాలు స్త్రీ ప్రతిబింబాన్ని నిర్వచించడంలో "మగ చూపు" యొక్క కేంద్రీకృతతను కూడా ప్రతిబింబిస్తాయి. ఈ చిత్రాలు స్త్రీ ప్రతిబింబాన్ని నిర్వచించడంలో "మగ దృష్టి" కేంద్రీకృతతను కూడా ప్రతిబింబిస్తాయి[2].
మూలాలు
మార్చు- ↑ ""Shakuntala - Looks of Love" by Raja Ravi Varma". Daily Dose of Art (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-04-02. Retrieved 2020-05-21.[permanent dead link]
- ↑ Karline McLain (2009). India's Immortal Comic Books: Gods, Kings, and Other Heroes. Indiana University Press. p. 69. ISBN 9780253220523.