శనిగరం జలాశయం
తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కోహెడ మండలం శనిగరం గ్రామంలోని జలాశయం
శనిగరం జలాశయం (శనిగరం చెరువు) తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, కోహెడ మండలం శనిగరం గ్రామంలోని జలాశయం. 1891లో నిజాం ప్రభుత్వకాలంలో నిర్మించబడిన ఈ పురాతన రిజర్వాయర్ నిర్మాణానికి 560 సీర్లు (504 కిలోల బంగారం ధర) ఖర్చు చేశారు.
శనిగరం జలాశయం | |
---|---|
అధికార నామం | Shanigaram Reservoir శనిగరం జలాశయం |
ప్రదేశం | శనిగరం, కోహెడ మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
అక్షాంశ,రేఖాంశాలు | 18°11′10″N 79°00′50″E / 18.18611°N 79.01389°E |
ఆవశ్యకత | నీటిపారుదల |
స్థితి | వాడుకలో ఉంది |
నిర్మాణం ప్రారంభం | 1887 |
ప్రారంభ తేదీ | 1891 |
నిర్మాణ వ్యయం | 560 సీర్లు (504 కిలోల బంగారం ధర) |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | భూమి పూరక ఆనకట్ట |
Height | 16 మీటర్లు (52 అడుగులు) నీటిమట్టం నుండి |
పొడవు | 908 మీటర్లు[1] |
Spillway type | వక్రరేఖ చిహ్నం |
Spillway capacity | 14150 క్యూసెక్ |
జలాశయం | |
సృష్టించేది | శనిగరం జలాశయం |
మొత్తం సామర్థ్యం | 1.09 Tmcft |
పరీవాహక ప్రాంతం | 5100 ఎకరాలు |
ప్రారంభం
మార్చునిజాం ప్రభుత్వకాలంలో నిర్మించబడిన ఈ పురాతన రిజర్వాయర్ నిర్మాణం 1887లో ప్రారంభమై, 1891లో పూర్తయింది. దీని నిర్మాణానికి 560 సీర్లు (504 కిలోల బంగారం ధర) వ్యయం అయింది.
సామర్థ్యం
మార్చుశనిగరం జలాశయం సామర్థ్యం 42 అడుగులు ఉంది.[2]
ఉపయోగం
మార్చు1 టీఎంసీ సామర్థ్యం గల ఈ జలాశయం ద్వారా శనిగరం, తంగళ్లపల్లి, బెజ్జంకి, రేగులపల్లి, పోతారం (జె), దాచారం, ముత్తన్నపేట్, గాగిళ్లాపూర్, గుగ్గిళ్ళ తదితర గ్రామాల్లోని 5,100 ఎకరాల ఆయకట్టు నీరు అందుతుంది.
ఇతర వివరాలు
మార్చుశ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్-2 పనిలో భాగంగా తోట్టపల్లి జలాశయం ఎడమ కాలువ ద్వారా ఈ జలాశయంలోకి నీరు వచ్చి చేరుతుంది.
మూలాలు
మార్చు- ↑ "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. Archived from the original (PDF) on 20 ఆగస్టు 2014. Retrieved 21 నవంబరు 2018.
- ↑ సాక్షి, జిల్లాలు (23 September 2016). "జోరువాన". Archived from the original on 21 November 2018. Retrieved 21 November 2018.