శరద్ పాండే (1934 అక్టోబరు 22 - 2004 నవంబరు 8) భారతీయ హార్ట్ సర్జన్. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ సేథ్ గోర్ధందాస్ సుందర్‌దాస్ మెడికల్ కాలేజీలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి చేసిన సర్జన్ల బృందంలో ఆయన ఉన్నాడు. ఆయన రక్తరహిత గుండె శస్త్రచికిత్స(bloodless heart surgery)లో నిపుణుడు, భారతదేశంలో రక్తరహిత ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడంలోనూ మొదటి తరం వాడు.

శరద్ పాండే
1995లో మదర్ థెరిసాతో శరద్ పాండే
జననం(1934-10-22)1934 అక్టోబరు 22
బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(present-day ముంబై, మహారాష్ట్ర, భారతదేశం)
మరణం2004 నవంబరు 8(2004-11-08) (వయసు 70)
జాతీయతభారతీయుడు
వృత్తిహార్ట్ సర్జన్
జీవిత భాగస్వామిస్నేహలతా పాండే
పిల్లలు
బంధువులుఅనన్యా పాండే (మనవరాలు)
దీన్నే పాండే (కోడలు)

మిట్రల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ కోసం ఉపయోగించే పాండే షంట్(Pandey shunt) అనే శస్త్రచికిత్సా విధానంతో ఆయన ప్రసిద్ధి చెందాడు.[1]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

శరద్ పాండే 1934 అక్టోబరు 22న బొంబాయి (ప్రస్తుతం ముంబై)లో జన్మించాడు. మాతుంగలోని డాన్ బాస్కో హైస్కూల్ చదువుకున్నాడు. గ్రాంట్ మెడికల్ కాలేజ్ అండ్ సర్ జంషెడ్జీ జీజీబోయ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌ నుంచి ఆయన బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీని పూర్తి చేసాడు. కెనడాలోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్‌లో మాస్టర్ ఆఫ్ సర్జరీ అందుకున్నాడు. 1969లో, ఆయన అంటారియో హార్ట్ ఫౌండేషన్ ఫెలోషిప్ గ్రహీత.[2]

వ్యక్తిగత జీవితం

మార్చు

వైద్యురాలు స్నేహలతా పాండేను ఆయన వివాహం చేసుకున్నాడు. వీరికి నటుడు చుంకీ పాండేతో సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆయన 2004 నవంబరు 8న ముంబైలోని తన నివాసంలో మరణించాడు. అతని మరణం తరువాత, ముంబైలోని బాంద్రా శివారులో ఒక జంక్షన్‌కు అతని పేరు పెట్టారు.[3]

మూలాలు

మార్చు
  1. "Panday shunt" (PDF). medind.nic.in. Archived (PDF) from the original on 2018-04-29. Retrieved 2017-09-25.
  2. M.V. Kamath and Rekha Karmarkar (1993). Untold Stories of Doctors and Patients. UBS Publishers Distributors. p. 260. ISBN 978-8185674186. Archived from the original on 2017-09-27.
  3. "Junction was named after him". The Times of India. Archived from the original on 2017-11-09. Retrieved 2017-09-25.