శరీరజనిత రక్షణ శక్తి

మూస:ఈ వ్యాసము ఒక పుస్తకం నుండీ నేరుగా తీసుకున్న సమాచారం

శరీర జనిత రక్షణ శక్తిని గలిగించుటకు నాలుగు విధములగు పద్దతులు గలవు.

మార్చు

1. తీవ్రమైనట్టి సూక్ష్మ జీవులు కలిగిన టీగా రసమును శరీరములోనికి గ్రుచ్చి యెక్కించుట చేతను.,

2. జీవముతో నున్నను తీవ్రము తగ్గియున్న సూక్ష్మ జీవులు గల టీకా రసమును శరీరము లోనికి గ్రుచ్చి యెక్కించుట చేతను,

3. జీవము లేని సూక్ష్మ జీవులను అనగా వాని శవములు గల టీకారసమును శరీరము లోనికి గ్రుచ్చి యొక్కించుట చేతను,

4. సూక్ష్మ జీవుల నుండి పుట్టిన విషములు గల టీకారసములను శరీరములోనికి గ్రుచ్చి యొక్కించుట చేతను.

వివిధములగు అంటు వ్యాధులలో వివిధ సాధనముల సాయముచే శరీర జనిత రక్షణ శక్తి కలిగింప వచ్చును.

1. తీవ్రమైనట్టి సూక్ష్మ జీవులు గల టీకా రసమును శరీరములోనికి గ్రుచ్చి యొక్కించుట.

మార్చు

ఆనాది నుండియు., మచూచకపు రోగి యొక్క కండల లోనుండు చీము నెత్తి ఇతరుల కంటించి వారి కావ్యాధి కలిగించెడి వారు. అందుచే వారికి కూడా మశూచకము వచ్చును. గాని సామాన్యముగా నిట్టి వారలకు వచ్చు మశూచకము ఇతరులకువచ్చు దాని కంటే తక్కువ తీవ్రముగ నుండెడిది. కాని క్రింద నుదాహరించిన ప్రకార మీ పద్ధతి యొట్లు అనుయుక్తమును అపాయకరము నగునో తెలిసి కొనగలరు. తీవ్రముగ నున్న కలరా మొదలగు సూక్ష్మ జీవులు గల టీకా రసమును చర్మము క్రిందికి బోలుగ నుండు సూదితో నెక్కించి యాయా వ్యాధులకు చికిత్స చేయ వలెనని అనేకులు ప్రయత్నించునున్నారు. కాని ఈ పద్ధతి అంతగా జయ ప్రథము కాలేదు.

2. జీవించి యున్నను తీవ్రత తగ్గి యున్న సూక్ష్మ జీవుల మూలమున శరీర జనిత రక్షణ శక్తి కలిగించు పద్ధతి పిచ్చి కుక్క కాటు నందును మశూచకము నందును మిక్కిలి యుపయుక్తముగ నున్నది.

1.సూక్ష్మ జీవుల యొక్క తీవ్రత తగ్గించుటకు అనేక పద్ధతులను అచ్చటచ్చట శాస్త్రజ్ఞలుపయోగించు చున్నారు. అందు వేడిచే సూక్ష్మ జీవుల తీవ్రత తగ్గించు పద్ధతిని పశువుల దొమ్మ వ్యాధిని నివారించుట కుపయోగింతురు. దొమ్మ సూక్ష్మ జీవులు 55+డిగ్రీలు వరకు కాచు నెడల వాని తీవ్రత తగ్గును. ఇట్లీ సూక్ష్మ జీవులు గల టీకా రసమును తగిన మోతాదులుగ నేర్పరచి పశువులకు సూదితో గ్రుచ్చి చర్మము క్రింది కెక్కించిన యెడల ఆ పశువులకు సంవత్సరము వరకు దొమ్మ వ్వాధి రాదు. దొమ్మ వ్యాధి తీవ్రముగ నున్న ప్రదేశములలో మందలోని పశువులకు అన్నిటికి నిట్టి రక్షణ శక్తి కలిగించుట యుక్తము. హంగేరీ దేశములో దొమ్మ వ్యాధి తీవ్రముగ నున్నప్పుడు 16,082 గుర్రములకును, 2,10,750 పశువులకును 11,18,443 గొర్రెలకును ఇట్టి టీకాలు వేయగా అంతకు పూర్వము వేయింటికి 25 చచ్చు మందలో వేయింటికి 5 పశువుల కంటే ఎక్కువ చావలేదు. కాబట్టి దీని యుపయోగము రైతులందరు గుర్తెరిగి లాభమునుపొందిరి

2. ఏ జంతువు యొక్క రక్తములో నొక జాతి సూక్ష్మ జీవులు చక్కగ పెరుగవో ఆ జంతువున కా జాతి సూక్ష్మ జీవుల నటించి వాని తీవ్రతను తగ్గించుట: ప్రస్తుతము మశూచకము రాకుండ టీకాలు వేయు పద్ధతి దీని నుండి పుట్టినదే. మనుష్యులకు తీవ్రముగ వచ్చు మశూచికము ఆవునకంటు నప్పుడు మిక్కిలి తేలికయ యైనదై పొగుదు మీద కొన్ని పొక్కులుగా కనబడి దాని కేమియును కీడు గలుగ జేయకుండ విడిచి వేయును. ఈ మర్మమును కనిపెట్టినది మొదలు మశూచకమున కిప్పటి పద్ధతిని టీకాలు వేయు నాచార మేర్పడినది.

ఇప్పుడు టీకాలువేయు వాడుక ఎల్లయెడల వ్యాపించి యున్నపుడు దీని విలువ మనకంతగా తెలియక పోవచ్చును. పూర్వ కాలమునందు ప్రప్రథమమున మశూచకమొక దేసమునందు వ్యాపించి నపుడు ఈ పెద్దమ్మవారు ప్రజలకు కలిగించు నాశమును, వికార రూపమును వర్ణింప నలవి కాదు. అమెరికా దేసములో 18 వ శతాద్బ ప్రారంభమున ప్రవేశించి ఒక కోటి ఇరువది లక్షల మంది ఇండియనులలో (Indians) ఆరువది లక్షల మందిని అనగా సగము మందిని తన పొట్టన పెట్టుకొనెను. ఈ వ్వాధి ప్రపంచము లోని మారెమ్మ లోన్నిటిలో భయు భయంకర మైనదై యొక దేశమున నైన విడువక మూల మూలలను వెదకుకొని ప్రవేశము గనెను. టీకాలు వేయుట కని పెట్టక పూర్వము మచూచకము వలని ఉపద్రవము ఎంత హెచ్చుక నుండెనో మనపిప్పు డూహింప జాలము ఆని పూర్వ మొకప్పుడు మశూచకము పడని వానికి తన జీవిత కాలము ప్రతి నిముషమును సందేహాస్పదముగనే యుండెను. 29, 30 వ పటములను జూడుము. చక్కని పిల్ల యని వివాహమాడిన వరునకు పది దినములలో గాడాంధు రాలగు కురూపి తటస్తమగు చుండెను. యువ్వన పతులగు పడుచులను తల్లులు విడిచి పారి పోవలసి వచ్చుచుండెను. పదుగురు అన్నదమ్ములలో చెప్పుకొనుటకు ఒక్కడైనను లేకుండ వంశము నిర్మూల మగు చుండెను. ఇట్టి వ్యాధికి మన యదృష్ట వశమున జెన్నరు (Edvard Jenner) అను నొక ఆంగ్లేయ వైద్యునిచే కని పెట్టబడిన ఈ టీకాల యొక్క విలువ మనకిప్పుడు తెలియక పోవుట ఆశ్చర్యము కాదు.

ఆనాది నుండి చీనా (Chaina) దేశములో మశూచకపు రోగి యొక్క చీమును తీసి మరియొకనికి అంటించి క్రొత్త వారలకు నీ వ్యాధి నంటించుట వాడుకలో నుండెనట. మశూచకపు పొక్కులపై నేర్పడు పొక్కుల నెండ బెట్టి వాని నరగదీసిన గంధముతో టీకాలు వేయు వారలు మొన్న మొన్నటి వరకు నైజాము రాజ్యములో నుండిరని తెలియు చున్నది. ఈ తూర్పు దేశముల నుండియే యితర దేశములకు మశూచకము చీమునుండి టీకా రసమును తీయు పద్ధతి వ్యాపించి యుండ వచ్చును. ఈ వ్యాధిని కలిగించు సూక్ష్మ జీవులు గాలిలో నుండి నెత్తురు లోనికి బహుశః మన ఊపిరి తిత్తుల గుండ ప్రవేశించి వ్యాధి కలుగ జేయును. ఇట్లు గాక శరీరములోని గాయము గుండ నొకనికీ సూక్ష్మ జీవులను అనగా మశుచకపు చీమును ప్రవేశ పెట్టినట్టుడు వానికి మశూచకము వచ్చును గాని తీవ్రము తగ్గి వచ్చును. ఇట్లు చేయుట వలన కొంత మందికి ఉపకారము కలుగుచు వచ్చెను గాని మొత్తము మీద వ్యాధి యొక్క ఉధృతి మాత్రము దేశమునందు తగ్గి యుండ లేదు. దీనికి రెండు కారణము లూహించి యున్నారు.

1. మన మంటించిన వ్యాధి యోకానొకప్పుడు బలమై అది నిరపరాధుడగు వానిని నిష్కారణముగ చంప వచ్చును. మన మంటించు వ్యాధి స్వల్పముగ వచ్చి తేలి పోవునో ఉపద్రవముగ విజృంబించి మ్ర్రింగి వేయునో చెప్పుట కెవ్వరికిని వీలు లేకుండెను. ఎంత చీమును ఎట్టి దశలో అంటించిన రోగికి క్షేమ కరమో తెలిసి కొనుటకు ఆధార మెద్దియు లేక యుండెను.

2. రెండవ యుపద్రవ మేమనగా మశూచక మెన్నడెరుగని ఊరిలోనికి నొకరినెవ్వరి నైనను కాపాడవలెనని మశూచకపు చీమును పంపితిమా అది వానికి ప్రయోజనకారి గాకుండుట పోగా ఆ ఊరిలో నుండు ఇతరుల నందరకును కొని తెచ్చుకొన్నట్లు ఈ వ్యాధి సంప్రాప్త మగుచుండెను. ఈ రెండు కారణముల చేత ఒకానొక చోట ఇట్టి పద్ధతి వలన కొంరకు ఉపకారము కలుగుచుండినను అది సర్వ జనోపయోగముగ నుండ లేదు. ఇట్టి దినములలో లండనులో నుండు హంటరు (John Hunter) అను ఒక వైద్యుని యొద్ద 1769 వ సంవత్సరములో ఎడ్వర్డు జెన్నరు (Edward Jenner) అను నతడొకడు శిష్యుడుగా ప్రవేశించెను. ఆ కాలములో మశూచకము ఆ దేశమునందు మిక్కిలి ప్రబలి యుండెను. అట్టి సమయమునందు గొల్ల వారలకు ఎందు చేతనో గాని మశూచకము వచ్చు చుండుట లేదు. ఇటు నటు నుండు ఇండ్లలో లెక్క లేకుండ పీనుగలు పడు చిండినను మధ్యనుండు గొల్ల వాని యింటిలో ఎందుచేత నీ అమ్మవారు ప్రవేశింపదో ఎవ్వరికిని తెలియని మాయగ నుండెను. ఒక నాడొక గొల్ల పిల్ల వచ్చి జెన్నరుతో నిట్లనియె. అయ్యా..... నాచేతి మీద పాల పొక్కులు (Cow pox) పొక్కినవి. నాకింక పెద్దమ్మ రాదు. అనెను. ఇది వినిన తోడనే జెన్నరు తన గురువు వద్దకు పోయి అయ్యా ఈ గొల్ల పిల్ల యిట్లని చెప్పెను. దీనికి ఏమి కారణము " అని అడిగెను. అప్పుడు గురువు జెన్నరుతో వూరకే వట్టిఊహలు చేయకుము. సత్యమును ఓపికయు విడువకుము. శోధింపుము అనెను. అప్పటి నుండియు ఈ అంశములను మనస్సులో బెట్టుకొని ఎల్లప్పుడును ఆలోచించుచు తన చేతనైనంత వరకు శోధించుచు వచ్చెను గాని రమారమి ముప్పది సంవత్సరముల వరకు దాని నిజము చక్కగా నతనికి చిక్కలేదు. ఈ లోపుగ 1880.వ సంవత్సరములో నొక నాడు అతని స్నేహితునొకనితో ఒంటరిగా ప్రయాణము చేయుచు అతనితో నిట్లనెను. గొల్లవార్లకు పెద్దమ్మవారు రాదని చెప్పిన మాట నిజమైన యెడల వీరలకుండు పొక్కులను ప్రజలకందరకు అంటించి వారికి కూడ పెద్దమ్మ వారు రాకుండ చేయుట సాధ్యము కాకూడాదా? అని చెప్పుచు అతనికి తానిట్లు చెప్పినట్ట్లు ఎవ్వరికిని తెలియనీయ వలదని బ్రతిమాలుకొనెను. ఒక వేళ అందరును ఈ మాటను వినిన యెడల తన్ను వెక్కిరింతురనని జెన్నరుకు భయముగ నుండెను. అయినను అనేక సంవత్సరములు గడిచినను తనకు ఏమియు అంతు చిక్క పోయినను విడువక ఈ విషయమునే తన మనస్సునందుంచు కొని ఊరక ఆలోచించుచుండెను. తుదకు పదియునారు సంవత్సరములు గడచిన పిమ్మట ఒక నాడు జెన్నరు ఒక గొల్లపిల్ల చేతి మీది పొక్కులలోని చీమును కొంచమెత్తి ఒక పిల్లవాని కంటించెను. ఇప్పుడు మనకు టీకాలు వేసి నప్పుడు పొక్కులు పొక్కినట్లు వానికి పొక్కులు పొక్కి అవి రెండు వారములలో మానెను. అటు పిమ్మట కొంత కాలమయిన తరువాత జెన్నరు వానికి మశూచకపు చీమును అంటించెను. కాని ఎన్ని విధముల ప్రయత్నించినను వానికి మశూచకము అంట లేదు. ఇది చూచి జెన్నరు సంత సించి ఇట్లు అనేక మందికి రెండు సంవత్సరముల వరకు మొదట గొల్ల వాండ్ల పొక్కు చీమును దాని పొక్కు మానిన తరువాత పెద్దమ్మ చీమును అంటించుచు అనేకుల మీద శోధనలు చేసెను. టీకాలు చక్కగ అంటిన వారి కెవ్వరికిని పెద్దమ్మ వారు సోకదని అతడు కనిపెట్టెను. ఇది గాక ఈ రెండు వ్వాధులకును ఎదో ఒక విధమయిన సంబంధము గలదనియు బహుశః ఈ రెండు వ్యాధులు ఒకటే వ్యాధి యనియు ఆ వ్యాధి పశువులకు వచ్చినప్పుడు దాని ఉదృతము తగ్గి హాని లేని పొక్కులుగా బయలుదేరి తేలికగా పోవు ననియు ఈ వ్వాధియే మనుష్యులలో ప్రవేశించి నపుడు ఉపద్రవమై భయంకరమైన పరిణామము చెందుననియు జెన్నరు ఊహ చేసెను.

పైని వ్రాసినది చదివిన యెడల ఇంతే కదా మహాకార్యము. అని తోచ వచ్చును. కాని లక్షల కొలది కోట్ల కొలది ప్రతి దినమును రూపు మాసి పోవు ఆ దినములలో నితడు చేసిన పరిశ్రమకు యింతింతని వెల గలదా? ప్రపంచము లోని కిరీటాధిపతు లందరు జెన్నరున కప్పుడు దాసోహ. మనిరి. నెపోలియన్ అంతటి వాడు జెన్నరునకు ఏమి యడిగిన నిచ్చెద. ననెనట.

జెన్నరు చూపిన మార్గమున ననుసరించి ఇప్పటి వైద్యులు అనేకములైన అంటు వ్యాధులకు టీకాలు వేయు పద్ధతిని కనిపెట్టి యున్నారు. ఇంక ననేక వ్యాధుల విషయమై యింకను గట్టి ప్రయత్నములు చేస్తున్నారు. దీని కంతకును జెన్నరే మూల పురుషుడు. వందనీయుడగు మహాత్ముడు. జెన్నరు టీకాలు కనిపెట్టిన తరువాత వేల కొలది మైళ్ళదూరములో నున్న అమెరికా మొదలగు ఖండాతరములకు ఈ టీకా రసములను ఎట్లు పంపుట? ఇది అనేక దినములు నిలిచి యుండదుగదా? అని యొక గొప్ప సంశయము కలిగెను. అంతట వారీ క్రింది యుక్తిని పన్నిరి. ఆ కాలములలో పడవలు ఇప్పటివలే యంత్ర శక్తిచే వారముకను వేలకొలది మైళ్ళు పరుగెత్తునవి కావు. అప్పుడొక చిన్న ప్రయాణమనిన ఆరు మాసములు పట్టెడిది. అప్పటి పుణ్యాత్ములు కొందరు దండు కట్టుకొని ఇరువది లేక ముప్పది చంటి బిడ్డలను తగినంత మంది వైద్యులను, దాదులను చేర్చుకొని టీకారసమును కొని పోవుటకు ఖండాంతర ప్రయాణమునకై ఓడ నెక్కుదురు. వారితో కూడా నొకరిద్దరు పిల్లకు టీకాలు వేసి తీసికొని పోవుదురు. ఎనిమిది దినములయిన తరువాత నీ యిద్దరు పిల్లలనుండి మరిద్దరకీ చీమును మార్చుదురు. ఇట్లు వారము వారమునకు మిక్కిలి జాగ్రత్తతో మార్చుకొనుచు వాని బలము తగ్గి పోకుండ నెలల తరబడి కాపాడుచు తమ గమ్యస్థానమును చేరుదురు. ఇట్లా దినములలో ననేక కష్టముల కోర్చి ప్రపంచమంటటకు నీ టీకా రసమును వ్వాపింప జేసిరి.పెద్దమ్మ వారనిన భయము లేనట్టి ఈ దినములలో టీకాలు వేసి కొనుమనిన మాకు వద్దు వద్దు అని పారి పోవు వారు ఈ చరిత్రనంతయు వినిన తరువాత నట్లు చేయుదురా?

3. విషమును ఆర బెట్టుట వలన దాని తీవ్రమును తగ్గించుట....

మార్చు

ఈ ప్రకారము చేయు చికిత్సలలో వెర్రి కుక్క కాటు నకు చేయునది మిక్కిలి జయ ప్రథముగ నున్నది. ఇది పాస్టరు అను జీవ శాస్త్ర వేత్త మనకు ప్రసాదించిన యమూల్యమైన వరము. వెర్రి కుక్క కాటు లోని విషమును కలిగించు నిజమైన సూక్ష్మ జీవులింకను సరిగా తెలియ లేదు. అయినను పాస్టరీ వ్యాధి రాకుండ కాపుదలగా నుండు మందు ననేక సంవత్సరముల క్రింతటనే కని పెట్టి ప్రపంచమునకు మహోపకారమును చేసి యున్నాడు. మిక్కిలి తీవ్రమగు పిచ్చి ఎత్తిన చెపుల పిల్లుల వెన్నెముక నడుమలో వెనుపాము అను నరముల త్రాటి నెత్తి దాని ననేక ముక్కలుగ నరికి వేరు వేరు ముక్కలను ఒక దాని కంటే నొకటి ఎక్కువగ ఆరు నట్లు కొన్నింటిని రెండు దినములను, ఇంక కొన్నింటిని 3,4,5,6, మొదలు పది పదునైదు దినముల వరలమగా కడపటి వాని యందలి విషమంతయు నశించి పోవు వరకు ఆర బెట్టుదురు.

వెర్రి కుక్క కరచిన వారలు కూనూరు (Coonoor) నకు పోయినపుడు వారలకు మొదటి దినమున మిక్కిలి బలహీనమయిన కషాయమును అనగా బొత్తిగ విషమును లేకుండ నార బెట్టిన తునకలనుండి ఎత్తిన టీకా రసమును కండ లోనికి బోలుసూది గుండ ఎక్కింతురు. దీనికి అతడు తాళుకొనిన పిమ్మట క్రమక్రమముగ నొక నాటి కంటే మరియొకనాడు హెచ్చు మోతాదుల నెక్కించి తుదకెంత హెచ్చయిన విషమునైనను తాళు కొను శక్తి వచ్చు నట్లు చేయుదురు. ఇట్లు ఇరివది దినములలోపల రెండు దినములు మాత్రము ఆరబెట్టిన తునకల నుండి తీసిన టీకా రసమును కెక్కించురు. ఇందుచే పిచ్చి కుక్క కాటు వలన అతని శరీరములో పుట్టు విషమంతయు విరిగి పోయి దాని వలక కుక్క కాటు వలన రాబోవు బాధ ఎంత మాత్రమును లేకుండ పోవును. మెదటనే ఎండ పెట్టకుండ తయారు చేయ బడిన తీక్షణమయిన పచ్చి విషమును ఎక్కించిన యెడల రోగి చచ్చి పోవును. కాని క్రమ క్రమమున శరీరమునకు అలవాటు చేసినప్పుడు ఎంత తీక్షణ మయిన విషమునయినను తాళుకొనగలడు.

ఈ వైద్యము ప్రారంభించిన తరువాత మూడు లేక నాలుగు వారములకు గాని ఈ టీకాలకనుగుణము చక్కగ పట్టునని చెప్పుటకు వీలు లేదు. కాబట్టి కుక్క కరచిన వారలు వెంటనే వైద్యమునకు ప్ర్రారంబించిన గాని ప్రయోజన ముండదు. వ్వాధి రాక పూర్వము చికిత్స చేసి వ్వాధి రాకుండ జేయ వచ్చును. కాని వ్వాధి యొక్క ఉదృతము ప్రారంబించిన తేరువాత కుదుర్చుటకు వీలు లేదు. వెర్రి నక్కలు గరచిన గాని కుక్కలకు వెర్రి యెత్తదని ప్రజల అభిప్రాయము. కాని కుక్కలే దీనికి ముఖ్య కారణములని ఈ క్రింది లెక్కలను బట్టి తెలియగలదు. ఉత్తర హిందూ స్థానములో కాశాలి యను చోట గల వైద్య శాలలో వైద్యము చేసికొనిన వారి సంఖ్యను బట్టి వ్రాయ బడిన ఈ క్రింది సంఖ్యల వలన ఈ విషయము స్పష్టము కాగలదు. 1902 మొదలు 1942 వరకు గల కాలములో 14,730 కుక్కలును, 2,491 నక్కలును, 140 గుర్రములును, 78 పిల్లులును, 71 తోడేళ్ళును, 16 పశువులును, 79 మనుష్యలును కరచుట వలన వెర్రి కలిగినది. దీనిని బట్టి కుక్కలే ఈ వ్వాధికి ముఖ్య కారణములని తెలియగలదు.

3. ఇంతవరకు జీవించి యుండియు తీవ్రము తగ్గిన విషయములచే శరీర జనిత రక్షణ శక్తిని కలిగించుటను గూర్చి చెప్పియున్నాము. ఇక జీవము లేని సూక్ష్మజీవుల కళేబరముల నుండి తీసిన రసమునెత్తి దానితో అంటు వ్వాధులను కుదుర్చు మార్గములను చూపెదము. బ్రతికియున్న సూక్ష్మ జీవులను మన శారీరములోని కెక్కించినప్పుడు ఒకానొకచో అపాయము కలుగ వచ్చును. ప్రాణము లేని సూక్ష్మ జీవుల నుపయోగించునపు డట్టి యపాయముండదు. కొన్ని సూక్ష్మ జీవుల మృత కళేబరముల నుండి కూడా నుపయోగ క్రములగు టీటా రసములను మనము తయారు చేయ వచ్చును. కలారా, టైఫాయిడు జ్వరము, మహామారి (ప్లేగు) క్షయ మొదలగు వ్యాధులందీ పద్ధతి ప్రస్తుతము కొంత వరకుపయోగములో నున్నది.

తీవ్రమైన కలరా సూక్ష్మ జీవులను తగినన్నిటిని సూది గుండ కడుపు లోనికి పిచికారీ చేసిన యెడల చుంచులు, పిల్లులు మొదలగు జంతువులు చచ్చును. కాని కలరా వ్వాధి వచ్చి నెమ్మది అయిన రోగి శరీరమును నుండి కొంచెము రక్తము నెత్తి దాని యందలి రసముతో పైన చెప్పినన్ని కలరా సూక్ష్మ జీవులనే కలిపి యా మిశ్రపదార్థమును ఆ జంతువుల కడుపు లోనికి బోలు సూది గుండ అదే ప్రకారము ఎక్కించి నప్పుడు అవి చావవు. అనగా కలరా సూక్ష్మ జీవుల శక్తి రోగి యొక్క రసము నందుండు విరుగుడు పదార్థములచే నశించి పోయింది. ఈ రసమునందున్న గుణము ఇతర మానవుల రసమునందున్నట్టిది కాదు. కొంత వరకు మనయందుండు రక్తము లోని రసము నందును సూక్ష్మ జీవులను చంపు శక్తి కలదని చెప్పి యున్నాము. అట్టిశక్తి అన్ని జాతుల సూక్ష్మ జీవులను సమానముగా చంపును గాని కలరా వ్యాధి వచ్చి తేలిన రోగి యొక్క రక్తము నందుండు రసము కలరా సూక్ష్మ జీవులను మిక్కిలి వేగముగ చంపును. కావున ఇట్టి వాని రసమునందుండు పదార్థములను కలరా నాశక పదార్థములని చెప్ప వచ్చును. ఇట్లే టైఫాయిడు జ్వరము వచ్చి కుదిరిన వారి నెత్తురులో టైఫాయిడు నాశక పదార్థములును, ప్లేగు వచ్చి, కుదిరిన వారి శరీరములో ప్లేగు నాశక పదార్థములును ఉండును. ఒకటి రెండు వారములు టైఫాయిడు జ్వరము పడిన వారి నెత్తురు నీ టైపాయిడు నాశక పదార్థము లుండుటను బట్టి ఫలానా రోగి యొక్క జ్వరము టైపాయిడు జ్వరము అగునా కాదా యను విషయమును కూడా తెలిసికొన వచ్చును. అనుమానముగ నున్న అరోగి యొక్క రక్తము నుండి ఒకబొట్టు రసమునెత్తి దానిలో కొంచెము టైఫాయిడు సూక్ష్మ జీవులను కలిపి సూక్ష్మ దర్శినిలో పరీక్షించిన యెడల అవి యన్నియు చలనము మాని ముద్దలు ముద్దలుగా కూడు కొనుట చూడ నగును. ఆ రోగి యొక్క జ్వరము టైఫాయుడు జ్వరము కాని యెడల మనము కలిపిన టైఫాయుడు సూక్ష్మ జీవులా రసములో యధేచ్చముగా గంతులు వేయుచు మెలికలు తిరుగుచు పరుగు లెత్తుచుండును. దీనిని బట్టి రోగి జ్వరము టైఫాయిడు జ్వరము అగునా కాదా యని తెలియ నగును.

ఆయా రోగుల నెత్తురు ఆయా జాతి సూక్ష్మ జీవులను చంపు శక్తి నధికముగ పొంది యున్నదను విషయము తెలిసిన తరువాత ఆరోగ్య వంతుల శరీరములో నిట్టి శక్తి మన మెట్లయిన పుట్టింప గలమా యని అనేక్ వైద్యులు ప్రయత్నించిరి. తీవ్రమైన సూక్ష్మ జీవులను మానవుల కంటించుట ఒక్కొక్కప్పుడు అపాయకరము కావున చచ్చిన సూక్ష్మ జీవులనే ఉపయోగింప నగును. ఈ ప్రకారము తయారు చేయ బడిన టీకా రసములు కలరాకును, టైఫాయిడు జ్వరమునకును, ప్లేగు నకును కూడా ప్రస్తుతము మందుల షాపులలో విక్రయిముకు దొరకును.

కలరా టీకారసము:

మార్చు

1894 సంవత్సరములలో కలకత్తాలో నీ కలరా టీకా రసమును 36 ఇండ్లలో 521 మందికి ఉపయోగించిరి. అందొక యింటిలో 18 మంది మనుష్యులుండిరి. వారిలో 11 గురికి కలరా టీకాలు వేసిరి. 7 గురికి కలరా టీకాలు వేయలేదు. టీకాలు వేయని 7 గురిలో 4 గురికి కలరావచ్చి ముగ్గురు చనిపోయిరి. టీకాలు వేసిన 11 గురిలో ఒక్కరికి కూడా కలరా రాలేదు. కాని కలరా టీకా రసము వలన పుట్టిన రక్షణ శక్తి టీకాలు వేసినది మొదలు 15 దినముల కంటే హెచ్చు కాలముండదు. అందు చేత ఈ విధమైన చితిత్స సర్వత్ర ఉపయోగించుటకను యుక్తముగ నున్నది.

టైఫాయిడు టీకారసము:

మార్చు

టైఫాయిడు టీకా రసమును తగిన మోతాదును చర్మము క్రిందికి పిచికారితో ఎక్కించిన యెడల టైఫాయిడు జ్వరము రాకుండ కొంత వరకు కాపాడును. ఎక్కించిన దినమున 101 లేక 102 దిగ్రీల వరకు జ్వరమును, తలనొప్పియు కొంత భారకింపును కలిగించును. చుట్టు ప్రక్కల నుండు బెళ్లలు కొంచెముబ్బి నొప్పిగ నుండును ఒకానొప్పుడు సీమనుండి హిందూ దేశానికి వచ్చు పటాలములోని సోల్జర్లకందరకును నీ టీకారసమును ఎక్కించెడి వారు. కాని ఈ పద్ధతి యొక్క యుపయోగమును గూర్చి నిర్థారణగా చెప్పుటకు వీలులేదు.

ప్లేగు టీకా రసము.

మార్చు

ప్లేగు సూక్ష్మ జీవులను ఒక నెల వరకు మాంసరసములో పెంచి దానిని తగినంత వరకు కాచి దాని యందలి సూక్ష్మ జీవులను చంపి ఆ రసములో 50 లేక 60 చుక్కలు కండలోనికి ఎక్కించిన ఎడల అట్టి స్థలమునందు కొంచెము వాపును నొప్పియు కలిగి కొద్ది పాటి జ్వరము వచ్చును. ఇట్టి వారలకు ఎనిమిది లేక పది రోజులు గడచిన పిమ్మట తిరిగి ఇంక కొంచెము హెచ్చు మోతాదుగల టీకా రసమును ఎక్కించిన యెడల వారలకు సామాన్యముగ అనేక నెలల వరకు ప్లేగు వ్వాధి రాదు. బొంబాయిలో అధికముగ ప్లేగు వచ్చి యున్నప్పుడు అక్కడి జెయిలు లోని 154 గురు జనులకు ప్లేగు టీకాలు వేసిరి. 177 గురు టీకాలు లేక యుండిరి. టీకాలు వేసిన వారిలో నొక్కడును ప్లేగుచే మృతి నొంద లేదు. కాని టీకాలు వేసికొనని వారిలో 14 గురికి ప్లేగు వచ్చి ఆరుగురు మృతి నొందిరి. కాబట్టి ఈ ప్లేగు టీకాలను వ్వాధి ముమ్మరముగ గలయన్ని చోట్లను వైద్యులకును పరిచారలకులనును సేవకులకును నిర్బంధముగ వేయవలెను. ప్రజలకు కూడా ఈ టీకాల ఉపయోగమును గూర్చి బోధించి సర్వత్ర వ్యాపించు నట్లు ప్రోత్సాహ పరచ వలెను.

క్షయ టీకారసము:

మార్చు

దీనిని ప్రస్తుతము పెద్ద పట్టణములన్నిటి యందును వైద్యులుపయోగ పరుచు చున్నారు. ఇందు రెండు విధముల టీకా రసములు గలవు.

1. క్షయ సూక్ష్మ జీవులను చంపి వాని శరీరములో నుండు విషములను వేడి నీళ్లు గ్లిసరిన్ మొదలగు ద్రావకములతో కలిపి విడదీసి ఆ విషములను ద్రవ రూపముగ శరీరము లోనికి ఎక్కించుట.

2. క్షయ సూక్ష్మ జీవులను మెత్తగ నూరి పొడిగా జేసి ఆ పొడుని పరిశుభ్ర మయిన నీటిలో కలిపి ఆ నీటిని తగు మోతాదులతో చర్మము క్రింద ఎక్కించుట. ఇట్టి టీకాల వలన మన శరీరములో సూక్ష్మ జీవులకు అపకారులగు తెల్ల కణములును విరుగుడు పదార్థములును వృద్ధియై అవి శరీరమునకు రక్షణ శక్తిని హెచ్చు చేయును. నిజముగ కుదిరినదని చెప్పుటకు సామాన్యముగ రెండు సంవత్సరముల వరకీ విధమయిన చికిత్స చేయ వలెను.

క్షయ టీకా రసము ఇతరుల యందు కంటే క్షయ రోగులయందు నొప్పి, వాపు, జ్వరము, మొదలగు గుణములను కలిగించును. దీనిని బట్టి ఒకానొక రోగి క్షయ రోగి యగునా, కాదా అను విషయమును గుర్తించుటకు తగిన మార్గములు ఏర్పరచి యున్నారు. టీకా వేసిన చోట వాపు, ఎరుపు మొదలగునవి కలిగిన ఎడల నా రోగికి క్షయ వ్యాధి యున్నట్టును గ్రహింప వలెను.

31.వ పటము. (EDWARD JENNER.) ఎడ్వర్డు జెన్నరు
 
ఏడ్వర్ద్ జెన్నర్
 
లూయీ పాచ్చరు

మచూచకము రాకుండ వేయు టీకాలను కనిపెట్టిన మహా పురుషుడు 1749 వ సంవత్సరము మేనెల 17 అ తేదీన జననము. మరణము: 1623 వ సంవత్సరము జనవరి 26వ తేది.