శాన్ కానరీ
సర్ థామస్ షాన్ కానరీ (ఆగస్టు 25, 1930 అక్టోబర్ 31, 2020) స్కాటిష్ నటులు, నిర్మాత. 1962 నుండి1983 మధ్య కాలంలో ఏడు చిత్రాలలో జేమ్స్ బాండ్ పాత్రను పోషించిన మొదటి నటుడిగా, మొట్టమదటి జేమ్స్‌బాండ్‌గా అతనికి గుర్తింపు ఉంది. [1] [2] [3]
బాండ్ చిత్రాలతో ప్రపంచానికి పరిచయమయ్యే ముందు ఆయన థియేటర్, టెలివిజన్ లో పని చేసేవారు . తన బాండ్ పాత్ర విజయవంతం కావడంతో అతనికి ప్రధాన నటుడిగా గుర్తింపు వచ్చింది. అతని చిత్రాలలో మార్నీ (1964), మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ (1974), ది మ్యాన్ హూ వుడ్ బీ కింగ్ (1975), ఎ బ్రిడ్జ్ టూ ఫార్ (1977), హైలాండర్ (1986), ది నేమ్ ఆఫ్ ది రోజ్ (1986), ది అన్‌టచబుల్స్ (1987), ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్ (1989), ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ (1990), డ్రాగన్‌హార్ట్ (1996), ది రాక్ (1996), ఫైండింగ్ ఫారెస్టర్ (2000) ప్రధానమైనవి. కానరీ 2006 లో నటన నుండి విరమించుకున్నారు.
అతని విజయాలలో ఒక అకాడమీ అవార్డు, రెండు బాఫ్టా అవార్డులు (ఒకటి బాఫ్టా అకాడమీ ఫెలోషిప్ అవార్డు), మూడు గోల్డెన్ గ్లోబ్స్ ఉన్నాయి. వీటిలో సిసిల్ బి. డెమిల్ అవార్డు, హెన్రిట్టా అవార్డు కూడా ఉన్నాయి . 1999 లో యుఎస్‌లో జీవితకాల సాధనను గుర్తిస్తు అతనికి కెన్నెడీ సెంటర్ ఆనర్ అవార్డునుతో సత్కరించారు. చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు నైట్ హుడ్ బిరుదు కూడా ఆయనికి దక్కింది. [4]
కానరీని 2004లో సండే హెరాల్డ్ "ది గ్రేటెస్ట్ లివింగ్ స్కాట్",[5] 2011లో యూరో మిలియన్స్ సర్వేలో "స్కాట్లాండ్ యొక్క గ్రేటెస్ట్ లివింగ్ నేషనల్ ట్రెజర్" [6], పీపుల్ మ్యాగజైన్ 1989 లో "సెక్సియస్ట్ మ్యాన్ అలైవ్", 1999 లో "సెక్సియస్ట్ మ్యాన్ ఆఫ్ ది సెంచరీ" గా ఎంపిక చేసాయి.[7]
మూలాలు
మార్చు- ↑ Harmetz, Aljean (31 October 2020). "Sean Connery, Who Embodied James Bond and More, Dies at 90". The New York Times. Retrieved 31 October 2020.
- ↑ Shapiro, T. Rees (31 October 2020). "Sean Connery, first James Bond of film, dies at 90". The Washington Post. Retrieved 31 October 2020.
- ↑ "Profile: Sean Connery". BBC News. 12 March 2006. Retrieved 19 March 2007.
- ↑ "Sir Sean's pride at knighthood". BBC. Retrieved 15 March 2019.
- ↑ Flockhart, Susan (25 January 2004). "Would The Greatest Living Scot Please Stand Up?; Here they are". Sunday Herald. Archived from the original on 11 September 2016. Retrieved 16 June 2016 – via HighBeam Research.
- ↑ "Sir Sean Connery named Scotland's greatest living treasure". STV News. 25 November 2011. Archived from the original on 2 April 2015. Retrieved 6 August 2012.
- ↑ "Sexy Celebrity Pictures". CBS News. Retrieved 10 October 2018.