శాసన పద్యమంజరి

తెలుగు పుస్తకము
(శాసనపద్యమంజరి నుండి దారిమార్పు చెందింది)

పద్యాలను కేవలం కావ్య రచన కోసమే కాక పలు విధములైన ఇతర రచనల కోసం కూడా వినియోగించేవారు. కవిత్వం కాక శాస్త్ర సాంకేతిక గ్రంథాలు, గణిత గ్రంథాలు, ఇతర గ్రంథరచనల్లోనూ ఉపయోగపడ్డాయి పద్యాలు. అలానే పద్యాలను శాసనాల్లో కూడా వినియోగించారు పూర్వ ప్రభువులు. అటువంటి శాసన పద్యాలను సంకలించి ఈ గ్రంథంలో ప్రకటించారు జయంతి రామయ్య పంతులు. అటుగంజాం నుంచి ఇటు చెంగల్పట్టు వరకూ 25 ప్రాంతాల్లోని, 40 పద్యశాసనాలు ఈ గ్రంథంలో ప్రచురించారు. దీని రెండవ భాగము ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కాకినాడ వారిచే 1937లో ముద్రించబడింది.

శాసన పద్యమంజరి, రెండవ భాగము పుస్తక ముఖచిత్రం.

మొదటి మంజరిలో 88 శాసనములలోనున్న 287 పద్యములు ఉన్నాయి. వానిలో మొదటి శాసనము 770 వ శాలివాహనశక సంవత్సర ప్రాంతమందు పుట్టగా; చిట్టచివరిది 1600 వ శాలివాహనశక సంవత్సర ప్రాంతమందును పుట్టినవి. ఈ ద్వితీయభాగములో 46 శాసనములలోగల 95 పద్యము లున్నవి. ఈశాసనములలో మొదటిది 1046 వ శకసంవత్సరములోను జివరిది 1732 వ శకసంవత్సరమున బుట్టినవి. ఈ శాసనములలో కొన్ని దక్షిణ హిందూస్థాన శాసనములు ("South Indian Inscriptions") అను గ్రంథములనుండి గ్రహింపబడినవి.

ద్వితీయ భాగము

మార్చు

ఇందులో ముద్రించబడిన శాసనాలున్న గ్రామాలు, శాసన సంఖ్యలు ఈ విధంగా ఉన్నాయి.

1. ఆచంట - (పశ్చిమగోదావరీమండలము) 34.

2. ఇడుపులపాడు - (గుంటూరుమండలము) 38.

3. ఇప్పటము - (గుంటూరుమండలము) 29.

4. ఏలూరు - (పశ్చిమగోదావరీమండలము) 20, 21, 22, 23, 24, 25, 26, 27, 30, 31, 32

5. కొమ్మూరి - (గుంటూరుమండలము) 33

6. గంటసాల - (కృష్ణామండలము) 4, 5

7. తడికలపూడి - (పశ్చిమగోదావరీమండలము) 19

8. తిమ్మాపురము - (గుంటూరుమండలము) 6

9. తూబాడు - (గుంటూరుమండలము) 2.

10. త్రిపురాంతకము - (కర్నూలుమండలము) 35.

11. ధర్మవరము - (గుంటూరుమండలము) 39

12. నాదెండ్ల - (గుంటూరుమండలము) 1, 12

13. ప్రాతపల్లవరము - (చెంగల్పట్టుమండలము) 44

14. పాములపాడు - (గుంటూరుమండలము) 14, 15, 16, 17, 18.

15. పాలకొల్లు - (పశ్చిమగోదావరీమండలము) 7, 8, 23, 46.

16. పెరవలి - (గుంటూరుమండలము) 13.

17. బెజవాడ - (కృష్ణామండలము) 11.

18. భీమవరము - (పశ్చిమగోదావరీమండలము) 37.

19. మందడము - (గుంటూరుమండలము) 45.

20. ముఖలింగము - (గంజాముమండలము) 9.

21. రాజమహేంద్రవరము - (తూర్పుగోదావరీమండలము) 10.

22. వలివేరు - (గుంటూరుమండలము) 3.

23. వేలుపూరు - (గుంటూరుమండలము) 43.

24. శ్రీకూర్మము - (గంజాముమండలము) 28, 40, 41, 42.

25. శ్రీశైలము - (కర్నూలుమండలము) 36.

బయటి లింకులు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: