శాసనోల్లంఘన భావన

క్రియాశీలకంగా, బాహాటంగా ప్రభుత్వాలు కానీ, ఆక్రమించుకునే అంతర్జాతీయ శక్తులు కానీ చేసే కొన్ని చట్టాలు, డిమాండులు, ఆదేశాలను తలొగ్గడానికి నిరాకరిస్తూ ఉల్లంఘించడాన్ని శాసనోల్లంఘన అంటారు. శాసనోల్లంఘన అన్నది మొత్తంగా వ్యవస్థనే నిరాకరించడం కాక తమ నిరసన వ్యక్తం చేయడానికి చట్టాన్ని సంకేతాత్మకంగా ఉల్లంఘించే విధానం. అన్నిసార్లూ కాకున్నా, కొన్నిసార్లు శాసనోల్లంఘనను అహింసాత్మక ప్రతిఘటనగా వ్యవహరిస్తారు.[1][2]

మహాత్మా గాంధీ శాసనోల్లంఘనను భారత జాతీయోద్యమ కాలంలో పలుమార్లు అమలు చేశారు.

అన్యాయమైన చట్టాలుగా ప్రజలు భావించినవాటిపై చేసిన తిరుగుబాట్లలో శాసనోల్లంఘన ఒక పద్ధతి. బ్రిటీష్ ఆక్రమణను వ్యతిరేకిస్తూ ఈజిప్షియన్లు చేసిన 1919 ఈజిప్షియన్ విప్లవంలో శాసనోల్లంఘన ప్రయోగించడం భారీ స్థాయిలో ప్రయోగించిన తొలినాళ్ళ ఉద్యమాల్లో ఒకటిగా నిలిచింది.[3] భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు మహాత్మా గాంధీ నడిపిన పలు అహింసాత్మక ప్రతిఘటనల్లోనూ, చెకోస్లోవేకియాలో జరిగిన వెల్వెట్ విప్లవంలోనూతూర్పు జర్మనీలో  కమ్యూనిస్టు ప్రభుత్వాలను వెళ్ళగొట్టేందుకు,[4] దక్షిణాఫ్రికాలో జాతివివక్షపై పోరాటానికి, అమెరికన్ పౌరహక్కుల ఉద్యమంలోనూ, బాల్టిక్ దేశాలను సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్రం చేసేందుకు సింగింగ్ విప్లవంలోనూ, 21వ శతాబ్దిలో 2003లో జార్జియాలోని రోజ్ విప్లవంలో, 2004లో ఉక్రెయిన్లోని ఆరెంజ్ విప్లవంలోనూ,[5] ప్రపంచవ్యాప్తంగా ఇతరేతర పలు దేశాల్లో, పలు విప్లవాలు, ఉద్యమాల్లో శాసనోల్లంఘనను ప్రయోగించారు.

శాసనోల్లంఘనకు అత్యంత ప్రాచీనమైన చిత్రణ సోఫోక్లెస్ రాసిన యాంటిగోన్ నాటకంలో కనిపిస్తుంది. థేబెస్ గత రాజైన ఓడిపస్ కుమార్తె యాంటిగోన్ తన సోదరుడు పాలినిసెస్ కు మర్యాదకరమైన అంత్యక్రియలు చేయనీకుండా తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న రాజు క్రెయోన్ ను బహిరంగంగా వ్యతిరేకిస్తుంది. సంచలనాత్మకమైన ప్రసంగంలో భాగంగా ఆమె రాజుతో మానవులు చేసిన చట్టం కన్నా తన అంతరాత్మనే తాను అనుసరించాలని చెప్తుంది. అతను చంపుతానన్నా భయపడని యాంటిగోన్ (చివరకి అతను అదే చేస్తాడు), తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించకపోతే అది వేసే శిక్షకే ఎక్కువ భయపడుతుంది.[6]

1819లో 1919 పీటర్లూ నరమేధం తర్వాత పెర్సీ షెల్లీ ద మాస్క్ ఆఫ్ అనార్కీ అన్న రాజకీయ కవిత రాశారు, ఆ కవిత ప్రారంభంలోనే ఆయన కాలం నాటి అన్యాయమైన ప్రభుత్వం గురించి చిత్రాలు చూపిస్తారు—ఆ తర్వాత కొత్త విధానమైన సాంఘిక చర్యను ఊహిస్తారు. అహింసాత్మక నిరసన సిద్ధాంతం గురించిన ఆధునిక యుగంలో తొలి ప్రతిపాదన.హెన్రీ డేవిడ్ థోరో రాసిన సివిల్ డిస్‌ఒబీడియన్స్ (శాసనోల్లంఘన) వ్యాసంలో ఈ అంశాన్ని స్వీకరించి రాయగా, తర్వాతి కాలంలో గాంధీ తన సత్యాగ్రహ సిద్ధాంతంలోనూ ప్రతిపాదించారు.[7] గాంధీ సత్యాగ్రహ పాక్షికంగా అహింసాత్మక నిరసన, రాజకీయ చర్యల నుంచి స్ఫూర్తి పొందారు.[8] మరీ సుస్పష్టంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో తన విస్తృతమైన శ్రోతల ముందు పలు సందర్భాల్లో, తరచుగా షెల్లీ ద మాస్క్ ఆఫ్ అనార్కీలోని పాదాలు ఉటంకించేవారు.[7][9]

1848లో థోరో రాసిన సివిల్ డిస్‌ఒబీడియన్స్, తొలుత రెసిస్టెన్స్ టు సివిల్ గవర్నమెంట్ (పౌర ప్రభుత్వం పట్ల ప్రతిఘటన) అన్న పేరుగల వ్యాసం తర్వాతి కాలంలో శాసనోల్లంఘన నాయకులపై విస్తృతమైన ప్రభావం చూపింది. పౌరులు దురాక్రమణదారులకు ఇచ్చే మద్దతుకు, చట్టం దాన్ని ఆదేశిస్తున్నా సరే, నైతికంగా బాధ్యులవుతారు అన్నది వ్యాసంలో ప్రధానమైన ఆలోచన. ఈ వ్యాసంలో బానిసత్వానికి నిరసనగా, మెక్సికన్-అమెరికన్ యుద్ధానికి వ్యతిరేకంగా పన్నుల చెల్లించడానికి నిరాకరిస్తున్న చర్య వెనుక గల కారణాన్ని థోరో వివరించారు. వ్యాసంలో ఆయన ఇలా రాస్తారు,

నన్ను నేను ఇతర ఆసక్తులకు, ఉద్దేశాలకు అంకితం చేసుకుంటే, మొట్టమొదట దాన్ని వేరెవరి భుజాల మీదో కూర్చుని చేయకుండా ఉండేట్లు చూసుకోవాలి. అతని మీంచి నేను మొదట దిగాలి, తద్వారా అతను తన ఆసక్తులు, ఉద్దేశాలు సాధించే అవకాశం ఉంటుంది. ఏ స్థూల అస్థిరత సహిస్తున్నామో చూసుకోవాలి. మా ఊరివాళ్ళు, "వాళ్ళు నన్ను బానిసల తిరుగుబాటును అణచివేయడానికో, మెక్సికోకు కవాతు చేసేందుకు నన్ను ఆదేశించాలని, నేను వెళ్ళగలనేమోనని ఆశిస్తున్నాను" అనడం విన్నాను. ఐతే అప్పటికే ఈ మనుషులు తమ విధేయత ద్వారా నేరుగానూ, డబ్బు ద్వారా పరోక్షంగానూ తమకు ఓ ప్రత్యామ్నాయాన్ని అందించేవున్నారు.

1850ల నాటికి యునైటెడ్ స్టేట్స్ లో పలు విధాల మైనారిటీలైన నల్లవారు, యూదులు, సెవెంత్ డే బాప్టిస్టులు, క్యాథలిక్కులు, యాంటీ-ప్రొహిబిషనిస్టులు, జాతి సమానత్వ వాదులు, మరి ఇతరులు తమ వరకూ జాతి, మతపరమైన వివక్షలను పెంచే వివిధ చట్టాలు, బహిరంగ పద్ధతులను వ్యతిరేకిస్తూ ఓ స్థాయిలో శాసనోల్లంఘనను ప్రయోగించడం ప్రారంభించారు. 20వ శతాబ్దిలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటుగా అమెరికాలోని మైనారిటీ-హక్కుల రాజకీయాల్లో బహిరంగ, ప్రత్యేకించి శాంతియుతమైన ప్రభుత్వ అధికార ప్రతిఘటన ఓ సమగ్ర వ్యూహంగా, ఎత్తుగడగా నిలిచింది.[10]

20వ శతాబ్ది తొలినాళ్ళలో దక్షిణాఫ్రికాలోని భారతీయులపై జాతి వివక్షాపూరితమైన చట్టాలను తొలగించేలా ఒత్తిడి చేస్తూ మహాత్మా గాంధీ విస్తృత స్థాయిలో, ప్రభావశీలంగా భారీ శాసనోల్లంఘనను ప్రయోగించారు. శాంతియుతంగా ప్రయోగించడం, ప్రత్యేకించి కొన్ని అన్యాయపూరితమైన చట్టాలను ఎంచుకున్న సమయంలో, ఎంచుకున్న ప్రజలతో ఉల్లంఘించడం, అత్యవసర సమయాల్లో నిలిపివేస్తూ ప్రభుత్వాన్ని అరాచకత్వంలో పడదోయకుండా సహకరించడం వంటి ఎత్తుగడల వల్ల ఆయన దక్షిణాఫ్రికాలో తన పోరాటానికి భారతదేశంలోని వలస ప్రభుత్వం, లండన్లో బ్రిటీష్ ప్రభుత్వాల నుంచి సానుభూతినే కాక అటు భారతీయులు, ఇటు తెల్లవారి నుంచి భారీ మద్దతు సాధించి విజయం పొందారు.[11] 1919-20 నుంచి మొదలు పెట్టి భారతదేశంలో భారత జాతీయోద్యమంలో భాగంగా అహింసాత్మకమైన శాసనోల్లంఘన ఉద్యమంలో వివిధ పద్ధతులు, ప్రయోగాలు చేసి విజయవంతమైన నమూనాను రాజకీయ ప్రపంచానికి అందించారు.

మూలాలు

మార్చు
  1. Violent Civil Disobedience and Willingness to Accept Punishment, vol. 8, Essays in Philosophy, June 2007, archived from the original on 2010-06-13, retrieved 2016-12-04
  2. J Morreall (1976), "The justifiability of violent civil disobedience", Canadian Journal of Philosophy, 6 (1), Canadian Journal of Philosophy: 35–47, JSTOR 40230600
  3. Zunes, Stephen (1999:42), Nonviolent Social Movements: A Geographical Perspective, Blackwell Publishing{{citation}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Michael Lerner, Tikkun reader
  5. "The Orange Revolution". Time Magazine. 12 December 2004. Archived from the original on April 10, 2010. Retrieved 30 April 2010.
  6. Sophocle's Antigone, Project Gutenberg, F. Storr translation, 1912, Harvard University Press
  7. 7.0 7.1 [1] Archived జనవరి 5, 2011 at the Wayback Machine
  8. Thomas Weber, Gandhi as Disciple and Mentor, Cambridge University Press, 2004, pp. 28–29.
  9. Weber, p. 28.
  10. Volk, Kyle G. (2014).
  11. గాంధీ, రాజ్‌మోహన్ (2007). మోహన్ దాస్.