శిరీష్ కుమార్ మెహతా

భారతీయ ఉద్యమకారుడు

శిరీష్ కుమార్ మెహతా (28 డిసెంబరు 1926 - 9 సెప్టెంబరు 1942) మహరాష్ట్రకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.[1]

శిరీష్ కుమార్ మెహతా
జననం(1926-12-28)1926 డిసెంబరు 28
నందుర్‌బార్‌, మహారాష్ట్ర, భారతదేశం
మరణం1942 సెప్టెంబరు 9(1942-09-09) (వయసు 15)
నందుర్‌బార్‌, మహారాష్ట్ర, భారతదేశం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధుడు

శిరీష్ కుమార్ మెహతా 1926, డిసెంబరు 28న మహారాష్ట్రలోని నందుర్‌బార్‌ పట్టణంలో జన్మించాడు.

ఉద్యమం

మార్చు

1942లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించాడు.[2] నందుర్‌బార్‌ పట్టణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలకు శిరీష్‌ కుమార్ నాయకత్వం వహించాడు.[3]

1942, సెప్టెంబరు 9న శిరీష్ కుమార్ నాయకత్వంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు మంగళ్ బజార్ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి నిరసన ర్యాలీ చేరుకోగానే పోలీసులు నిరసనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు.[4] చేతిలో భారత జాతీయ జెండాతో, 'వందేమాతరం' నినాదంతో శిరీష్‌ కుమార్‌ ముందుకు కదిలాడు. అతనితోపాటు అనేకమంది నిరసనకారులు పోలీసులకు ఎదురెళ్ళారు. దాంతో పోలీసులు కాల్పులు జరుపగా శిరీష్‌ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. అతనితోపాటు ధన్సుఖ్‌లాల్ వాని, ఘనశ్యామ్ దాస్, శశిధర్ కేత్కర్, లాల్దాస్ కూడా మరణించారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Shirish Kumar Mehta Nandurbar | District Nandurbar | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-06.
  2. "Debutant director Bhavesh Patil to make a biopic on freedom fighter Shirishkumar Mehta - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-06.
  3. "Shahid Shirish Kumar". Latest Marathi News, Marathi News Paper, Breaking News In Marathi, Marathi Batmya Live. Archived from the original on 2021-10-06. Retrieved 2021-10-06.
  4. UrduCity (2019-09-09). "Shirish Kumar Mehta: A child Martyr of India". UrduCity India (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-09-22. Retrieved 2021-10-06.