శిల్పారామం (విశాఖపట్నం)

విశాఖపట్నం నగరంలోని మధురవాడలో ఉంది.
(శిల్పారామం జాతర నుండి దారిమార్పు చెందింది)

శిల్పరామం జాతర, ఒక కళలు, చేతిపనులు తయారుచేసిన వస్తువులు లేదా సరుకుకు నిలయం ఉన్న గ్రామం.ఇది భారతదేశం, విశాఖపట్నం నగరంలోని మధురవాడలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. ఇది విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి అర కిలోమీటర్ దూరంలో ఉంది.

శిల్పారామం జాతర
సాధారణ సమాచారం
రకంశిల్ప, చేతికళల గ్రామం
నిర్మాణ శైలివివిధ తెగల, లేదా జాతులకు చెందినవారి వృత్తులు, కళలును తెలుపుతుంది
ప్రదేశంమధురవాడ,విశాఖపట్నం,ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ప్రారంభం2009

ఇది అన్ని రకాల శిల్పనిర్మాణకళల ఉద్యానవనం. సాంప్రదాయ చేతిపనుల పరిరక్షణకు వాతావరణాన్ని సృష్టించే ఆలోచనతో ఈ గ్రామం ఉద్భవించింది. ఏడాది పొడవునా వేరువేరు తెగలకుచెందిన వారి జాతి ఉత్సవాలు ఉన్నాయి.

శిల్పారామం 2009 సంవత్సరంలో హస్తకళల గ్రామంగా ప్రారంభమైంది. ఇది విశాఖపట్నం నగరంలోని మధురవాడలో ఉంది. ఇది 28 ఎకరాల (11,0000 చ.మీ)లో విస్తరించి ఉంది.సామాన్య ప్రజలకు సాంప్రదాయ సంస్కృతిని చూపించడం శిల్పారామం ప్రధాన ఉద్దేశ్యం.రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికను స్థాపించడానికి ప్రధాన కారణం కూడా అదే.[1]

శిల్పారామం దేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన చెక్కపని, నగలు, బట్టలు, స్థానిక చేతిపనులతో చెక్కబడిన అందమైన సహజ పరిస్థితులలో తయారుచేసిన వస్తువులు ఇక్కడ లభిస్తాయి.ఇవి అన్నీ ఎక్కువగా అవి గ్రామీణులు రూపొందించిన కళాకృతులు.

ప్రధాన ఆకర్షణలు

మార్చు
 
విశాఖపట్నంలోని శిల్పారామం వద్ద కళా కృతుల ఆకృతులు

అంగడి గదులు

మార్చు

ఇక్కడ మొత్తం 36 అంగడి గదులు ఉన్నాయి. ప్రతి అంగడి గదిలో వివిధ రకాల సాంప్రదాయ ఉత్పత్తులను కలిగిఉంటుంది. [2]

వ్యాయామ నడకకు ప్రత్యేక త్రోవ

మార్చు

ఉదయం,సాయంత్రం వ్యాయామ నడక నడిచివారికి పచ్చని వాతావరణంతో ఉపయోగంగా ఉన్న ప్రత్యేక త్రోవ కూడా అందుబాటులో ఉంది. [3]

పక్షుల ఆవరణ నిలయం

మార్చు

భారతీయ, అంతర్జాతీయ పక్షులతో సహా వివిధ రకాల పక్షుల ఆవరణ నిలయం ప్రధాన ఆకర్షణలలో ఒకటి.

రంగస్థలం

మార్చు

జరిగే సాంసృతిక కార్యక్రమాలు చూడటానికి,మొత్తం1000 మంది సభ్యులు కూర్చోనే సామర్థ్యాన్ని కలిగి, నలుదిక్కులు కనిపించే పెద్ద గది ఉంది. ఇక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి.. [4]

శిల్పకళా ప్రదర్శన ఆవరణ

మార్చు

కళాకారుల చేతితో తయారు చేసిన శిల్పకళతో చేసిన విగ్రహాలు, బొమ్మలు,ఇతర ఆకృతులు ఇందులో ఒక ప్రధాన ఆకర్షణ.

రాత్రి బజారు.

మార్చు

ఇటీవల ప్రారంభించిన రాత్రి బజారు సందర్శకులను ఆహారం, వినోదం,కొనుగోలు చేయడంకోసం అనుమతిస్తుంది. [5]

ఛాయాచిత్రాల ప్రదర్శన

మార్చు

మూలాలు

మార్చు
  1. "Shilparamam :: Vishakapatnam". webwonders.in. Archived from the original on 2020-01-29. Retrieved 2020-10-25.
  2. "Crafts Bazaar: Shoppers' stop for handcrafted ware". The Hindu. Retrieved 2020-10-25.
  3. "Andhra govt to develop Visakhapatnam district as tourism hub". Livemint. Retrieved 2020-10-25.
  4. "visakha utsav: ‘Promote Andhra culture at Visakha Utsav’ | Visakhapatnam News". Times of India. Retrieved 2020-10-25.
  5. "Night bazaar to come up at Shilparamam". The Hindu. Retrieved 2020-10-25.

బాహ్య లింకులు

మార్చు