శిల్పా గుప్తా
శిల్పా దయానంద్ గుప్తా, ఢిల్లీకి చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] దేశవాళీ మ్యాచ్‌లలో ఢిల్లీ మహిళల క్రికెట్ జట్టు తరపున ఆడుతుంది.[2]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | శిల్పా దయానంద్ గుప్తా | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఢిల్లీ | 1989 ఫిబ్రవరి 24||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం లెగ్ బ్రేక్ | ||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | ||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 98) | 2011 జూలై 5 - న్యూజీలాండ్ తో | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
2006–ప్రస్తుతం | ఢిల్లీ మహిళలు | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2020 మే 5 |
జననం
మార్చుశిల్పా గుప్తా 1989, ఫిబ్రవరి 24న ఢిల్లీలోని రోహిణిలో జన్మించింది.[3] తండ్రి దయానంద్ గుప్తా ప్రాపర్టీ డీలర్, తల్లి స్వర్ణ గుప్తా గృహిణి. ఆమె ఎస్కేవి ప్రశాంత్ విహార్ నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కమల నెహ్రూ కళాశాలలో చదివింది. హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ కూడా అభ్యసించింది.
క్రికెట్ రంగం
మార్చుశిల్పా గుప్తాకి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. చిన్నప్పటి నుంచి డాబాపై తన సోదరుడితో కలిసి క్రికెట్ ఆడేదని ఆమె తండ్రి పలు సందర్భాల్లో వెల్లడించాడు. ఢిల్లీ యూనివర్శిటీ జట్టు, నార్త్ జోన్ జట్టు నుండి ఎంపికై, ఇండియా ఇంటర్నేషనల్ ఉమెన్ టీమ్‌కి 175వ క్యాప్‌ని సంపాదించింది.[4]
క్రికెట్ తర్వాత జీవితం
మార్చు2012లో క్రికెట్‌కు దూరమైన శిల్పా గుప్తాకు 2013లో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మినిన్ ఆఫ్ డిఫెన్స్, ఢిల్లీలో సీనియర్ ఆడిటర్ (సివిల్) గా పనిచేస్తున్నది.
మూలాలు
మార్చు- ↑ "Preeti Bose". ESPN Cricinfo. Retrieved 2023-08-08.
- ↑ "Preeti Bose, Deepti Sharma in India Women ODI squad". ESPN Cricinfo. 1 February 2016. Retrieved 2023-08-08.
- ↑ "Shilpa Gupta Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
- ↑ "NZ-W vs IND-W, NatWest Women's Quadrangular Series 2011, 6th Match at Southgate, July 05, 2011 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-08.