శివరాజలింగం మహబూబ్ నగర్ జిల్లా, బూత్పూరు మండలం, కరివెన గ్రామానికి చెందిన కవి. ప్రస్తుతం వనపర్తిలో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా హిందీ పండితులుగా పనిచేసి, ఉద్యోగవిరమణ చేశారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందారు. వారు హిందీ పండితులైనా మాతృభాష మీద మమకారంతో తెలుగులో రచనలు చేశారు. వీరికి సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. నాటకాల ప్రదర్శనలలో హార్మోనియం వాయించారు. హరికథలు చెప్పటంలోనూ, పౌరాణిక నాటకాలు ప్రదర్శించటంలోనూ వీరిది అందె వేసిన చెయ్యి. అర్జునుడు, ఆంజనేయుడు మొదలగు పౌరాణిక పాత్రలు ధరించి మెప్పించారు.

రచనలు

మార్చు

1. శివరాజ సంకీర్తనలు 2. బాల నీతి శతకం 3. బసవ చరిత్ర 4. భగవన్నామ సంగీత భజన కీర్తనలు

"శివరాజ సంకీర్తనలు ' 70 కీర్తనలు, 38 పద్యాలతో కూడిన రచన. ఈ గ్రంథం రెండు ముద్రణలు పూర్తి చేసుకుంది. దీనిని సి.డి. రూపంలోనూ తీసుకవచ్చారు. విద్యార్థులకు నీతి బోధించడానికి పనికి వచ్చే పుస్తకం బాలనీతి శతకం. బసవ చరిత్ర బసవేశ్వరుని చరిత్రను హరికథ చెప్పటానికి అనుకూలంగా రాయబడిన గ్రంథం.[1].

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, జిల్లా ప్రత్యేకంలో మధ్యపేజి, తేది.03.07.2014