శివ ప్రతాప్ శుక్లా

శివ ప్రతాప్ శుక్లా (జననం 1952 ఏప్రిల్ 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2017లో నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో ఆర్థికశాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2] అతను 2023 ఫిబ్రవరి 13 నుండి హిమాచల్‌ప్రదేశ్‌  గవర్నర్‌గా అధికారంలో ఉన్నారు.[3]

శివ ప్రతాప్ శుక్లా
శివ ప్రతాప్ శుక్లా


పదవీ కాలం
2023 ఫిబ్రవరి 13 – ప్రస్తుతం

ఆర్థిక శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017 – 30 మే 2019
ముందు సంతోష్ గంగ్వార్
తరువాత అనురాగ్ ఠాకూర్

రాజ్యసభ సభ్యుడు[1]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 జులై 2016
ముందు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, బీజేపీ
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

బీజేపీ ఉత్తర ప్రదేశ్ ఉపాధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2012
పదవీ కాలం
1996 – 1998

ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
1998 – 2002

ఎమ్మెల్యే
పదవీ కాలం
1989 – 2002
ముందు సునీల్ శాస్త్రి
తరువాత రాధా మోహన్ దాస్ అగర్వాల్
నియోజకవర్గం గోరఖ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-04-01) 1952 ఏప్రిల్ 1 (వయసు 72)
రుద్రపూర్, ఉత్తర్ ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం గోరఖ్‌పూర్
పూర్వ విద్యార్థి గోరఖ్‌పూర్ యూనివర్సిటీ
వృత్తి న్యాయవాది

రాజకీయ జీవితం

మార్చు

శాసనసభ సభ్యుడు

మార్చు

శుక్లా 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం చేసి ఉత్తర ప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు, భారత జాతీయ కాంగ్రెసుకు కి చెందిన సునీల్ శాస్త్రిని ఓడించారు.[4] అతను 1989, 1991, 1993, 1996లో వరుసగా నాలుగు సార్లు శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

బిజెపి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి

మార్చు

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ప్రభుత్వాలలో శుక్లా రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ-బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 1996-1998లో జైళ్ల క్యాబినెట్ మంత్రిగా నియమితులయ్యారు.[5][6][7] మాయావతి, కళ్యాణ్ సింగ్‌ల స్వల్పకాలిక సంకీర్ణ ప్రభుత్వంలో తరువాత గ్రామీణాభివృద్ధికి మంత్రిగా నియమించబడ్డారు.[8]

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1989 - గోరఖ్‌పూర్ గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 1991 - గోరఖ్‌పూర్ గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 1993 - గోరఖ్‌పూర్ గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 1996 - గోరఖ్‌పూర్ గ్రామీణ ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 1996 - 1998, జైళ్ల శాఖ మంత్రి
  • 1998 - 2002, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
  • 2012 - బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు[9]
  • 2016 - రాజ్యసభకు ఎంపీగా ఎన్నిక
  • 2017 సెప్టెంబరు 3 నుండి 2019 మే 30 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి

మూలాలు

మార్చు
  1. NDTV (12 June 2016). "Samajwadi Party Wins 7 Rajya Sabha Seats In UP, Kapil Sibal Emerges Victorious". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  2. NDTV (2017). "Shiv Pratap Shukla Gets Finance Ministry In PM Narendra Modi's Cabinet". Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.
  3. NTV Telugu, ntv (12 February 2023). "13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. కోష్యారీ రాజీనామా ఆమోదం." Archived from the original on 12 February 2023. Retrieved 12 February 2023.
  4. "Gorakhpur Election Results since 1977". Election Commission of India.
  5. "The Great Lucknow Circus". Frontline. 15–28 November 1997. Archived from the original on 18 October 2007.
  6. "Jailed gangster's reach gobsmacks UP police". Rediff. 17 December 1998.
  7. "BJP bandh stirs up trouble in UP towns". Rediff. 23 February 1998.
  8. R Swaminathan (22 February 2002). "Neither Ram nor Rahim, Gorakhpur voters seek solution to problem of floods". Rediff.
  9. Financialexpress (3 September 2017). "Who is Shiv Pratap Shukla, new minister in Narendra Modi cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 29 August 2022. Retrieved 29 August 2022.