శిష్ట్లా ఉమామహేశ్వరరావు

శిష్ట్లా ఉమామహేశ్వరరావు (1912 - 1953) తెలుగు కవి.

శిష్ట్లా ఉమామహేశ్వరరావు చిత్రపటం.

జీవిత విశేషాలు మార్చు

శిష్ట్లా ఉమామహేశ్వరరావు గుంటూరు జిల్లా మంచాల గ్రామంలో జన్మించాడు. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ పట్టా పొంది ఇంగ్లీషు భాషలోని నూతన కవితా పద్ధతుల్ని బాగా అవగతం చేసుకున్నాడు. వీరు 'విష్ణు ధనువు', 'నవమి చిలుక' అనే రెండు ఖండ కావ్య సంపుటాలను ప్రకటించాడు.

వీరు సైన్యంలో చేరి విచిత్రమైన అనుభవాలను పొంది 'సిపాయి కథలు' అను మౌలికమైన కథలను రచించాడు[1]. వీరి 'కాళింగి పాటలు' తెలుగు కవిత్వానికి నూతన అలంకారాలు.

వీరు కొంతకాలం "శాంతిని" అనే పత్రికకు సంపాదకులుగా పనిచేశాడు.

రచనలు[2] మార్చు

కథలు[3] మార్చు

అతను రాసిన కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి.

కథ ప్రచురించబడిన పత్రిక సంపుటి
అరబ్బుల బేరం పుస్తకం సిపాయి కథలు
ఆకాశవాణి కథలు భారతి సిపాయి కథలు
ఆకాశవాణి కథలు భారతి సిపాయి కథలు
కుట్టమ్మాళ్ ఆంధ్రజ్యోతి (దీపావళి) సిపాయి కథలు
గన్నరు గురుమూర్తి పుస్తకం సిపాయి కథలు
గుంయి గుంయి గురివి ఆంధ్రజ్యోతి (దీపావళి) సిపాయి కథలు
గురకానందం మార్పు పుస్తకం సిపాయి కథలు
గూబ గోపాయిగాడు పుస్తకం సిపాయి కథలు
టెలిగ్రామ్ పుస్తకం సిపాయి కథలు
దసరా దళం ప్రతిభ సిపాయి కథలు
నేను నా కేప్టెన్ పుస్తకం సిపాయి కథలు
పడిపోయిన సిపాయి పుస్తకం సిపాయి కథలు
పరాక్రమ గొబ్బి ఆంధ్రజ్యోతి సిపాయి కథలు
పెద బొండాయి ఆంధ్రజ్యోతి సిపాయి కథలు
పేకాటలో పేకాడించటం పుస్తకం సిపాయి కథలు
ఫిడేలు మేజరు పుస్తకం సిపాయి కథలు
బంగారక్కలు పుస్తకం సిపాయి కథలు
భ్రమపడటం పుస్తకం సిపాయి కథలు
మడుసుడు కోసం పుస్తకం సిపాయి కథలు
మొదటి తప్పు పుస్తకం సిపాయి కథలు
రకంవోరి మడుసులు పుస్తకం సిపాయి కథలు
రామాయణ గొబ్బి ఆంధ్రజ్యోతి సిపాయి కథలు
లెప్ట్నెంట్ తులసి పుస్తకం సిపాయి కథలు
వెండిపొడుం డబ్బీ పుస్తకం సిపాయి కథలు
శాంతితో సౌఖ్యం పుస్తకం సిపాయి కథలు
శుశ్రూష కథావీధి సిపాయి కథలు

మూలాలు మార్చు

  1. "సిపాయి కథలు – శిష్ట్లా ఉమామహేశ్వరరావు వ్రాసిన విలక్షణమైన తెలుగు కథలు". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). 2012-01-18. Retrieved 2020-08-30.
  2. "రచయిత:శిష్ట్లా ఉమామహేశ్వరరావు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-30.
  3. "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-08-30.