శీతలా మాత మందిరం (పాట్నా)

పాట్నాలోని దుర్గాదేవి ఆలయం

శీతలా మాత మందిర్ లేదా శీతలా దేవి మందిర్ అని పిలవబడే దుర్గా దేవి ఆలయం భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఉన్న పాట్నాలో ఉంది. ఇది భారతదేశం లోని శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడింది.

శీతలా మాత దేవాలయం
శీతలా మాత దేవాలయం, పాట్నా
శీతలా మాత దేవాలయం, పాట్నా
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:బీహార్
జిల్లా:పాట్నా జిల్లా
ప్రదేశం:పాట్నా

ఆలయ స్థలం మార్చు

పాట్నాలోని డియోఘర్, టవర్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్ వద్ద ఈ ఆలయం ఉంది. భక్తులు ఇక్కడికి వచ్చి ప్రశాంతత కోసం గంటల తరబడి ఆవరణలో కూర్చుంటారు. ఇక్కడ మనస్ఫూర్తిగా పూజిస్తే నయంకాని రోగాలు కూడా నయమవుతాయని భక్తుల విశ్వాసం.[1]

ఉత్సవాలు మార్చు

ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో (ఏప్రిల్), శీతలా దేవి పూజ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇందులో శీతలా దేవి చిత్రం, 'సప్తమాతృకల' (ఏడు రూపాలు) పిండాలు ఉంటాయి. ఇది మశూచి నివారణకు, అన్ని రకాల కోరికలను నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం.[2]

శిల్పకళ మార్చు

ఈ ప్రదేశంలో అనేక పురాతన, మధ్యయుగ శిల్పాలు ఉన్నాయి. అయితే ఈ విగ్రహాలకు ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపులు రాలేదు. ఈ ప్రదేశం గుల్జార్‌బాగ్ స్టేషన్‌కు నైరుతి దిశలో కొద్ది దూరంలో, కుమ్రార్ పార్క్ పురావస్తు శిధిలాల నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.అయితే ఈ విగ్రహాలకు ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపులు రాలేదు. ఈ ప్రదేశం గుల్జార్‌బాగ్ స్టేషన్‌కు నైరుతి దిశలో కొద్ది దూరంలో, కుమ్రార్ పార్క్ పురావస్తు శిధిలాల నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.

మూలాలు మార్చు

  1. Charles Allen (21 February 2012). Ashoka: The Search for India's Lost Emperor. Hachette UK. ISBN 978-1-408-70388-5.
  2. "Shakti Peeths turn into Navaratra hotspots". The Times of India. 19 October 2012. Retrieved 15 February 2015.