రిఫ్రిజిరేటర్
రిఫ్రిజిరేటర్ (వ్యావహారికంగా ఫ్రిజ్) అనేది విద్యుత్ సహాయంతో పనిచేసే శీతలీకరణ యంత్రము, ఒక సాధారణ గృహ పరికరం.
పనితీరు
మార్చురిఫ్రిజిరేటర్ Archived 2021-09-06 at the Wayback Machine ఒక నియమిత, కాలపరిధిలో శబ్దం చేస్తుంటుంది. దీనికి కారణం ఫ్రిజ్‌కు అమర్చిన కంప్రెసర్ తరచూ స్విచాన్, స్విచాఫ్ కావడమే. ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రతను కొలిచి నియంత్రించే థర్మోస్టార్ట్ అనే మరో భాగంతో కంప్రెసర్ అనుసంధానమై ఉంటుంది. ఫ్రిజ్ లోపలి భాగం సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే ఇక చల్లబడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వెంటనే థర్మోస్టార్ట్ కంప్రెసర్‌కు ఎలక్ట్రిక్ పవర్ అందకుండా ఒక సంకేతం పంపుతుంది. దాంతో కంప్రెసర్, రిఫ్రిజిరేటర్ లోపలి భాగాన్ని చల్లబరిచే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇదంతా విద్యుచ్ఛక్తి వృథా కాకుండా చేసిన ఏర్పాటన్నమాట. తర్వాత ఫ్రిజ్‌లోని ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల నుంచి నెమ్మదిగా పెరుగుతుంది. ఒక నియమిత స్థితికి రాగానే థర్మోస్టార్ట్ మళ్లీ సంకేతం పంపడంతో విద్యుత్ వలయం పూర్తయ్యి కంప్రెసర్ ఆన్ అవుతుంది. కంప్రెసర్ ఒక యాంత్రిక వ్యవస్థ (mechanical sysytem) కాబట్టి అది ఆన్ అయినపుడల్లా శబ్దం వస్తుంది.
రిఫ్రిజిరేటర్ రకాలు
మార్చుభారతీయ మార్కెట్లో వివిధ రకాల రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. మేము వాటి గురించి క్రింద వివరిస్తున్నాము.
- సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్
- డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్
- సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్
- ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్
సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్
మార్చుసింగిల్ రిఫ్రిజిరేటర్లు 150 నుండి 300 లీటర్ల సామర్థ్యంతో వస్తాయి. ఇవి బాచిలర్స్, చిన్న కుటుంబాల అవసరాలకు సరైనవి.
డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్
మార్చుడబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు 230 - 700 లీటర్ సామర్థ్యంతో వస్తాయి. కాబట్టి, అవి 4 - 5 కుటుంబ సభ్యుల అవసరాలకు సరైనవి.
సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్
మార్చుసైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు 500 - 900 లీటర్ సామర్థ్యంతో వస్తాయి. ఇవి పెద్ద కుటుంబాల అవసరాలకు సరిపోతాయి.
బయటి లంకెలు
మార్చు- ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడని ఆ ఐదు కూరగాయలు ఏంటి?
- రిఫ్రిజిరేటర్, ఫ్రీజర్ చరిత్ర Archived 2020-05-31 at the Wayback Machine
- ' రిఫ్రిజిరేటర్ ' ఎలా పనిచేస్తుంది? HowStuffWorks లో ఒక వ్యాసము
- రిఫ్రిజిరేటర్లు, కెనడా సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం
- ఆధునిక ఫ్రిజ్ లు ఎలా తయారు చేయబడ్డాయి? Archived 2013-10-23 at the Wayback Machine (వీడియో)