శీలం సిద్ధారెడ్డి

శీలం సిద్ధారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.[2]

శీలం సిద్ధారెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 – 1984
ముందు బండారు ప్రసాదరావు
తరువాత బోడేపూడి వెంకటేశ్వరరావు
నియోజకవర్గం మధిర నియోజకవర్గం

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1958
1964
1970

వ్యక్తిగత వివరాలు

జననం 1925
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం 2011 డిసెంబర్ 26[1]
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం హైదరాబాద్

రాజకీయ జీవితం

మార్చు

శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1947లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గోసవీడు క్యాంపు ఇన్‌చార్జ్‌గా ఉండి నిజాం ప్రభుత్వంపై పోరాటం నిర్వహించి, హైదరాబాద్‌ స్టేట్‌లో 1949నుంచి 1952 వరకు మధిర తాలూకా కాంగ్రెస్‌పార్టీ కార్యదర్శిగా, 1958నుంచి 1962వరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, 1963నుంచి 1967వరకు పీసీసీ కార్యదర్శిగా, 1964నుంచి 2004వరకు ఏఐసీసీ సభ్యునిగా పనిచేశారు.

శీలం సిద్ధారెడ్డి 1958లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి కార్యదర్శిగా విధులు నిర్వహించాడు. ఆయన1964లో రెండోసారి శాసనమండలికి ఎన్నికై ఆప్కాబ్‌ తొలి చైర్మన్‌గా తరువాత 1967లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖమంత్రిగా పనిచేశాడు. సిద్ధారెడ్డి 1970లో మూడో సారి శాసనమండలికి ఎన్నికై పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో 1972 వరకు నీటిపారుదల శాఖమంత్రిగా పనిచేశాడు.[3]

శీలం సిద్ధారెడ్డి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1985, 1989, 1994, 1998లో ఉప ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి ఓడిపోయాడు.[4]

మూలాలు

మార్చు
  1. One India Telugu (26 December 2011). "మాజీ మంత్రి శీలం సిద్దా రెడ్డి కన్నుమూత". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
  2. Sakshi (13 November 2018). "ఆయనే తొలి మంత్రి." Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.
  3. Eenadu (28 October 2023). "జిల్లా తొలిమంత్రి శీలం సిద్ధారెడ్డి". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  4. Sakshi (14 April 2014). "పోరుగడ్డ మధిర". Archived from the original on 18 April 2022. Retrieved 18 April 2022.