శుక్ల పక్షం అనగా చాంద్రమానం ప్రకారం అమావాస్య తరువాతిరోజు పాడ్యమి నుండి మొదలు పౌర్ణమి వరకు గల పదిహేను రోజులను(పక్షం రోజులు) శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం అని అంటారు.[1]

వివరణ

మార్చు

ప్రతీ నెలకు రెండు పక్షాలు ఉంటాయి. అవి శుక్ల పక్షం, కృష్ణ పక్షం. ఈ రెండు పక్షము లను కలిపి ఒక చాంద్ర మానముగా చెబుతారు. చంద్రుడు అమావాస్య తరువాతనుండి రోజుకూ ప్రవర్ధమానం చెందుతూ పౌర్ణమి రోజున పూర్తి స్థాయిగా ప్రకాశిస్తాడు. ఈ సమయాన్ని శుక్ల పక్షం అని అంటారు. ఈ సమయంలో చంద్రుడిని శుక్ల పక్ష చంద్రుడు అని అంటారు. అనగా రోజు రోజుకూ వృద్ధి చెందుతూ ఉంటాడని అర్థం. శుక్ల వర్ణం అంటే తెలుపు అని అర్ధం కృష్ణ వర్ణం అంటే నలుపు అని అర్ధం. పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణ రూపాన్ని పొందుతాడు కాబట్టి దానిని శుక్ల పక్షం అని అమావాస్య నాటికి తన రూపాన్ని కోల్పోతాడు కాబట్టి కృష్ణపక్షం అని అంటారు.

పగళ్ళు[2]

మార్చు

శుక్ల పక్షంలో పదిహేను పగళ్ళను తైత్తరీయ బ్రాహ్మణం 15 పేర్లను సూచించింది.

  1. సంజ్ఞానం
  2. విజ్ఞానం
  3. ప్రజ్ఞానం
  4. జానత్తు
  5. అభిజానత్తు
  6. సంకల్పమానం
  7. ప్రకల్పమానం
  8. ఉపమానం
  9. ఉపక్లుప్తం
  10. క్లుప్తం
  11. శ్రేయం
  12. వసీయం
  13. ఆయత్తు
  14. సంభూతం
  15. భూతం

మూలాలు

మార్చు
  1. Krishna, Kishore. "శుద్ధ పక్షము (శుక్ల పక్షం) / బహుళ పక్షం (కృష్ణ పక్షం)". Retrieved 2021-06-07.
  2. "shukla paksham శుక్ల పక్షం పగళ్ళు ఎన్ని? | Bhakti song, Hindu dharma, Tantra". Pinterest. Retrieved 2021-06-07.


ననార్ధాలు సీత పక్షం