పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో మొదటి తిథి పాడ్యమి. అధి దేవత - అగ్ని.

పాడ్యమి నిర్ణయం

మార్చు

ధర్మ సింధు[1] ప్రకారం శుక్ల పక్ష పాడ్యమి ఖండతిథి అయితే, పూజలు - వ్రతాలకు అపరాహ్ణ వ్యాప్తి కలిగినట్లయితే పూర్వదినమునే గ్రహించాలి. అదే కృష్ణపక్షంలో అయితే ఎల్లప్పుడు విదియతో కూడిన పాడ్యమినే గ్రహించాలి. ఉపవాసాదులకు ఉదయమే సంకల్పించాలి.

పండుగలు

మార్చు
  1. చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది.
  2. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి - భీమవరం లోని మావూళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం జాతర ఈ రోజు ప్రారంభమౌతుంది.[2]
  3. కార్తీక శుద్ధ పాడ్యమి - బలి పాడ్యమి
  4. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి - దుర్గాదేవికి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

ఇతర విశేషాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. పాడ్యమి నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 50.
  2. "Temple Calendar". A.P.Endowments Department. A.P.Endowments Department. Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 21 June 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=పాడ్యమి&oldid=3798494" నుండి వెలికితీశారు