హరిశ్చంద్రుడను యెక రాజుగలడు. అతడు తనకు కుమారుడు గలిగినయెడల తన కుమారుని యజ్ఞపశువుగాజేసి యాగముచేయునట్లు వరుణునిగూర్చి మ్రొక్కుకొనెను. ఆ పిమ్మట వరుణుని యనుగ్రహమున నాతనికి కుమారుడు గలిగెను. కాని నాతడెప్పటికప్పుడు యజ్ఞముచేయుటకు సుముఖుడుగాక కాలమును దాటవేయుచుండెను. ప్రతిజ్ఞను పాటించని ఆ రాజును వరుణదేవుడు "జలోదరవ్యాధి గ్రస్తుడవవుదువుగాక” అని శపించెను. రాజు వ్యాధిగ్రస్తుడై తన దోషమును తెలుసుకొని యజ్ఞమును చేయ సంకల్పించెను. యజ్ఞపశువుగానుండి ప్రాణములువీడ నిష్ఠము లేని నాతని కుమారుడు తండ్రియింటిని విడచి అరణ్యమునకు పారిపోయెను. అందువలన రాజు చింతాక్రాంతుడై తమ కులగురువైన వశిష్ట మహర్షిని సలహా వేడెను. విద్యావంతుడై, యోగ్యుడై, దేవతలకు తన శరీరము నర్పింప ఇష్టపడెడి యొక బ్రహ్మచారియైన బ్రాహ్మణకుమారుని తెచ్చి నీ యజ్ఞము చేయవచ్చునని ఆయన చెప్పెను. పిమ్మట రాజు కోరినంత ధనమిచ్చి అట్టివానిని దెమ్మని తన మంత్రులను ఋష్యాశ్రములకు వెదుకబంపెను.

16వ శతాబ్దపు మొఘల్ శకం - చిత్రంలో అంబరీషుడు, శునశ్శేపుడు

ఐతరేయ బ్రాహ్మణంలో వినబడుచున్న శునశ్శేపుడు, శాపహతులైన విశ్వామిత్రుని సంతానమునకు సంభందించిన చరిత్ర నిచ్చట ఈయబడుచున్నది.

మార్చు

మంత్రులట్లు తిరుగుచున్న కాలములో నొక యగ్రహారమున అత్యంత దరిద్రుడగు అజీగర్తుడనెడి బ్రాహ్మణుడుండెను. అతనికి ముగ్గురు కుమారులుండిరి. రాజదూతలాయనను సమీపించి 'ఆర్యా! మీకుగల ముగ్గురుకుమారులలో ఒకరిని రాజునిమిత్తమును, దేవతా ప్రీతి నిమిత్తమును యజ్ఞపశువుగా నీయగలరా?' అని ప్రశ్నింపగా బ్రాహ్మణుడు జ్యేష్ఠకుమారునీయ వీలులేదనెను. ఆయన భార్య భర్త మాటలాలించి కనిష్ఠ కుమారునీయుటకు తానంగీకరింపజాలననెను. తల్లిదండ్రుల ప్రసంగములను వినుచుండిన మధ్యమ పుత్రుడిట్లు తలపోసెను. “నాన్నగారికి జ్యేష్ఠుడును, అమ్మగారికి కనిష్ఠుడును గావలసి యుండిరి గదా! మధ్యముడనైన నేనెవరికిని యక్కరలేదు. ఈనా శరీరమును రాజునకు ప్రీతిగా దేవతల కర్పించి స్వర్గమును చూరగొనియెదనని నిశ్చయించి రాజదూతలను చూచి 'అయ్యా! మీరు యీ దంపతులకు కోరిన ధనమిండు, నేను మీ రాజుగారి యాగపశుత్వమున కంగీకరించితి' నని పలికెను. వెంటనే నా దంపతులు కోరిన సొమ్ము వారి కొసంగి వారు పిల్లవానిని గొంపోయిరి. ఆ పిల్లవాని పేరు "శునశ్శేపుడు”. రాజు యజ్ఞమునకుపక్రమించెను. పశువునుబట్టు సమయము సమీపించెను. శునశ్శేపుడు కాళ్ళూచేతులూ బంధింపబడి యూపస్తంభమునకు కట్టబడెను. యజ్ఞశాల సభాసదులచే నిండియుండెను. ఇట్టిస్ధితిలో విశ్వామిత్ర మహాముని దయార్దహృదయుడై యిట్లు వచించెను. 'రాజా! యీ యజ్ఞమునిక చాలింపుము. నీ శరీరరక్షణార్ధ మన్య శరీరమును బలిగొన జూచుట మహాదోషము, కనుక యీ యజ్ఞము నింతతో నిలిపి యీ కుమారుని విడువు' మనెను. రాజందు కంగీకరింపడయ్యె. శునశ్శేపుడు విశ్వామిత్రు నుద్దేశించి యిట్లనెను-'కన్నతండ్రిని మించిన ప్రేమతో మీరు నన్ను రక్షింపజూచుచుంటిరి, కాని యీ యాగము పూర్తియై రాజునకు యాగఫలము సిద్ధించి రుగ్మత నివారణమగుటయూ నాకనృత దోషము కలుగకుండుటయు, దేవతలు తృప్తులగుటయు గలిగినగాని నేను విముక్తుడగుటకు కోరను. సృష్టికి ప్రతిసృష్టిజేయ సమర్ధమైన మీ తపోశక్తివలన సాధ్యముకాని విషయము లేదు. గాన యీనాకోరికను మన్నింపు' డనెను. విశ్వామిత్రు డా కుమారుని సౌజన్యమునకు మెచ్చి వానికి వారుణమంత్రము నుపదేశించి యుచ్ఛైస్వరమున నా మంత్రముచే వరుణుని స్తుతింపుమనెను. శునశ్శేపుడట్లుజేయగా వరణుడు ప్రసన్నుడై వచ్చి శునశ్శేపుని కట్లను స్వయముగా విప్పి వానిని విముక్తు జేసి రాజునకు యాగఫలమునిచ్చి నాతని రుగ్మతను నివారింపజేసి యదృశ్యుడయ్యెను. పిమ్మట విశ్వామిత్రు డా కుమారుని తన యాశ్రమమునకు తీసుకొని వెళ్ళెను.

విశ్వామిత్రుని కుమాళ్ళు-శాపము

మార్చు

ఇకమీద రాబోవుకథ విశ్వామిత్రకుమారుల కథ నీవిధముగా ఐతరేయ బ్రాహ్మణమున వినబడుచున్నది. బ్రాహ్మణ వాక్యమును, విద్యారణ్య భాష్యమును ఆధారముగా అందుకు తెలుగు తాత్పర్యమును దిగువ వివరింపబడుచున్నది.

“ఆ విశ్వామిత్రునకు నూర్గురు పుత్రులుండిరి. అందు మధ్యముడైన మధుచ్ఛందుడు జ్యేష్ఠుడుగా గల చిన్న కొడుకులు యేబదిమంది, జ్యేష్ఠులు యేబదిమంది . తనతో తెచ్చిన శునశ్శేపుని జ్యే.ష్ఠునిగా చేసి వాని యాజ్ఞకు బద్ధులైయుండునట్లు విశ్వామిత్లుడు తన పుత్రులను కోరెను. జ్యేష్ఠపుత్రులేబదిమంది తండ్రియాజ్ఞను మన్నింపలేదు. (మన్నింపకపోగా హేళనము జేసిరి). అందుకు విశ్వామిత్రుడు కోపించి తన వాక్యము ననుసరింప నిరాకరించిన జ్యేష్ఠపుత్రులేబదిమందిని గూర్చి నీ దిగువ వాక్యమును పలికి శపించెను. “పితురాజ్ఞాతిక్రమణ మొనర్చిన యోజ్యేష్ఠపుత్రులారా! మీరలు చండాలాది రూప నీచజాతులుగానయ్యదరు గాక ! “ ఆ శాపమువలన వారలు శారీరకముగాను, మానసికముగాను, నీచజాతి పరిణామమును పొంది, నీచజాతులయిన అంధ్ర, పుండ్ర, శబర, పుళింద, మూతిబా మొదలయిన నీచజాతులుగా మారిపోయిరి. 'ఇతి' శబ్దమువలన పైని పేర్కొన అయిదు జాతులేగాక ఇంకా ఇతరములుగానున్న అంత్యజాతులన్నియుగూడ చెప్పబడినవి. (అనగా అంత్యజాతులుగామారి వారితో మిళితమయిపోయిరని తాత్పర్యము). విశ్వామిత్రుని సంతానమువలన బుట్టినవారలు దస్యులనబడు దొంగలలో అత్యధికులుగా నుండిరి.” (అంధ్రాది నీచజాతులు ఆ కాలమునకు ముందునుండియు అనగా సృష్ఠ్యాది నుండియు ఆర్యావర్తమున యుండినట్లు గ్రహింపవలెను)

శాపకాలము

మార్చు

ఈకథ హరిశ్చంద్రుని కాలములో జరిగినది. అది వైవస్వత మనువులో మొదటి మహాయుగములోని కృతయుగము అనగా ఇప్పటికి 11,98,24,226(పదకొండుకోట్ల తొంబది ఎనిమిది లక్షల ఇరువది నాలుగువేల రెండువందల ఇరువదియారు) సంవత్సరముల క్రిందట జరిగిన కథ. ప్రతి మహాయుగమునను వెనుకటి మహాయుగములో జరిగిన విధముననే జరుగుచుండును. ఆ ప్రకారముగా ఇప్పుడు మనముండిన ఈ ఇరునదిఎనిమిదవ మహాయుగము లోని కృతయుగముగా నెంచిన ముప్పదిఎనిమిదిలక్షల సంవత్సరముల కాలముక్రిందట జరిగిన కథగానెంచవచ్చును.

ఆంధ్రులు శాపహతులైన విశ్వామిత్రుని కుమారులు కానేరరు

మార్చు

ఇందులోని " అంధ్ర”శబ్దమును జూచియే ఆంధ్రులు, శాపగ్రస్తులై, వైదికథర్మభ్రష్ఠులై, నీచజాతులతో కలిసిపోయి, చౌర్యహింసాదులతో జీవించెడి అంధ్రజాతీయులు, తమకు మూలపురుషులుగా నెంచుకొనుచుండుట తమ ఆర్యసాంప్రదాయమును మరచుటవలననే యని ఎఱుంగవలెను.

మూలాలు

మార్చు