శుభలగ్నం
శుభలగ్నం 1994లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా. జగపతి బాబు, ఆమని, రోజా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
శుభలగ్నం (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్వీ.కృష్ణారెడ్డి |
---|---|
రచన | దివాకర్ బాబు |
తారాగణం | జగపతి బాబు, ఆమని, రోజా |
సంగీతం | ఎస్వీ.కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | శ్రీ ప్రియాంక పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ సినిమా రెండు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నది.
కథసవరించు
మధు ఓ నిర్మాణ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తుంటాడు. అతనికి రాధతో పెళ్ళవుతుంది. మధుకి సాధారణ జీవితం గడపడం ఇష్టం. రాధ మాత్రం తాము తొందరగా ధనవంతులు కావాలనీ, విలాసమైన వస్తువులు అన్నీ కావాలని కోరుకుంటూ ఉంటుంది. కాలక్రమంలో దంపతులకు ఇద్దరు పిల్లలు పుడతారు. మధు పనిచేసే కంపెనీ బాస్ కూతురు లత విదేశాల్లో చదువుకుని వస్తుంది. ఆమె మధును చూసి పెళ్ళైన వాడని తెలిసినా ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాధ లతమీద కోపగించుకుంటుంది. లత ఆమెకు డబ్బు మీద ఆశను ఆసరాగా చేసుకుని కోటి రూపాయలు ఇస్తాననీ, ఆమె భర్తను వివాహం చేసుకుంటానని కోరుతుంది. రాధ అందుకు అంగీకరిస్తుంది. కానీ మధు, లత అన్యోన్యంగా ఉండటం చూసి తట్టుకోలేక పోతుంది. చివరికి తనకిచ్చిన డబ్బును తిరిగిచ్చేస్తాననీ, భర్తను తిరిగిచ్చేయమని లతను కోరుతుంది. కానీ లత తన భర్త, పిల్లలను తనతో పాటు విదేశాలకు తీసుకువెళ్ళాలని అనుకుంటుంది. కానీ రాధలో వచ్చిన మార్పును చూసి ఆమె ఒక్కటే విదేశాలకు వెళ్ళడంతో కథ ముగుస్తుంది.
తారాగణంసవరించు
- మధు పాత్రలో జగపతి బాబు
- రాధ పాత్రలో ఆమని
- లత పాత్రలో రోజా
- లత తండ్రి వ్యాపారవేత్తగా సుబ్బరాయ శర్మ
- ఎ. వి. ఎస్
- బ్రహ్మానందం
- వాణి గా శ్రీలక్ష్మి
- ఆలీ
- గుండు హనుమంతరావు
- తనికెళ్ళ భరణి
- అన్నపూర్ణ
- సుహాసిని
పాటలుసవరించు
ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలున్నాయి.[1] పాటలన్నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించాడు.
- పొరుగింటి మంగళ గౌరి
- అల్లరి తుమ్మెద
- చిలకా ఏ తోడు లేక
- అల్లుకుపోవే ఒసే మల్లి తీగ
- ఘల్లు ఘల్లు గజ్జె కట్టనా
మూలాలుసవరించు
- ↑ "శుభలగ్నం పాటలు". naasongs.com. naasongs.com. Retrieved 5 August 2017.