రోజా సెల్వమణి

సినీనటి, రాజకీయనాయకురాలు

రోజా సెల్వమణి (Roja Selvamani) - (జ.నవంబర్ 17, 1972) దక్షిణ భారతదేశంలో సినిమా నటి, రాజకీయవేత్త.[2] ఈమె ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకురాలు[3]

రోజా సెల్వమణి
రోజా సెల్వమణి

రోజా సెల్వమణీ


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
జున్ 2014
నియోజకవర్గం నగరి

వ్యక్తిగత వివరాలు

జననం (1972-11-17) 1972 నవంబరు 17 (వయస్సు 49)
తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జీవిత భాగస్వామి ఆర్.కె.సెల్వమణి [1]
సంతానం 2
వృత్తి సినిమా నటి (1992-ప్రస్తుతం)
రాజకీయవేత్త
మతం హిందు

జీవిత విశేషాలుసవరించు

చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004,2009 శాసనసభ ఎన్నికలలోనగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలోనగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో గెలుపొందారు.

రోజా మొదట తమిళచిత్రంలో నటించింది. ఆ సినిమాను ప్రముఖ ఛాయా గ్రహకుడు, దర్శకుడు అయిన ఆర్‌కే సెల్వమణి రూపొందించాడు. ‘చంబరతి’ పేరుతో విడుదలైన ఆ చిత్రంలో హీరో ప్రశాంత్‌.

ఆ సినిమా తమిళంలో మ్యుజికల్‌ హిట్‌. తెలుగులో చేమంతి కింద డబ్‌చేయబడింది. అయితే తెలుగులో మాత్రం రోజా తొలి చిత్రం ప్రేమ తపస్సులో నటించింది. రోజా ఆర్‌కే సెల్వమణిని పెళ్ళిచేసుకుంది. జయప్రదను ఆదర్శంగా తీసుకుని రోజా తెలుగుదేశం పార్టీలో చేరింది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన వ్యక్తిగత విమర్శలు చేసి తాను కూడా విమర్శల పాలయ్యారు. తెలుగు దేశం మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు.చివరకు రాజీనామా చేశారు.రాజశేఖరరెడ్డితో భేటీ అయ్యి కాంగ్రెస్‌ తీర్థం అందుకోవడమే తరువాయి అని భావిస్తున్న తరుణంలో గంగాభవాని రోజాపై విమర్శలు చేశారు[4]

వ్యక్తిగత జీవితంసవరించు

రోజా గారి తండ్రి పేరు కుమారస్వామి రెడ్డి, చిత్తూరు జిల్లాలోనే పుట్టినా హైదరాబాద్‌లో కుటుంబం స్థిర పడింది.. ప్రస్తుతం హైదరాబాద్లో కుటుంబంతో సహా నివాసం ఏర్పరచుకున్నారు. రోజా నాగార్జున యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. కొన్ని సంవత్సరాలు, రోజా కూచిపూడి నృత్యాన్ని అభ్యశించారు. చినతనంలో, రోజా గారి స్వరం గద్గదంగా ఉండుటవలన, చాలామంది చిత్ర పరిశ్రమకి వెళ్ళవద్దని నిరుత్సాహ పరిచారు.

రోజా తమిళ చిత్ర దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని వివాహమాడారు. గతంలో తెలుగు దేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2014 నవంబరులో నగరి నియోజకవర్గం వైయస్సార్ పార్టీ తరపు నుండి పోటి చేసి MLA గా గెలుపొందారు, 2019 మే నెలలో రెండవ సారి నగరి నుండి ఎమ్మెల్యే గా గెలిచారు.

నట జీవితంసవరించు

రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్‌ సరసన ప్రేమ తపస్సు సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు.

తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కె.సెల్వమణి గారు చెంబరుతి చిత్రం ద్వారా పరిచయం చేశారు, ఈ చిత్రంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నరు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్ (ఈ టీవి) , బతుకు జట్కబండి (జీ తెలుగు) , రంగస్థలం (జెమిని టి.వి) వంటి కర్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు.

చిత్ర సమాహారంసవరించు

తెలుగుసవరించు

తమిళంసవరించు

Kannadaసవరించు

  • Kalavida
  • Gadibidi Ganda

బుల్లితెరసవరించు

ఏడాది కార్యక్రమం ఛానల్
2010–2013 మోడ్రన్ మహాలక్ష్ములు మా టీవీ
2014-2015 రేస్ జీ తెలుగు
2013 జబర్దస్త్ ఈ టీవి
2014 ఎక్షట్రా జబర్దస్త్ ఈ టీవి
2016 రచ్చబండ జెమినీ టీవీ

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-04-14. Retrieved 2016-11-17.
  2. Pradeep shines among ladies | Deccan Chronicle
  3. "Jagan files nominations, declares Rs 365 crore in assets | Deccan Chronicle". Archived from the original on 2011-05-19. Retrieved 2013-11-02.
  4. .http://www.suryaa.com/showSunday.asp?category=5&subCategory=1
  5. "Pavitra to hit screens on May 10". Deccan Chronicle. 10 May 2013. Archived from the original on 14 October 2016. Retrieved 28 July 2019.

ఇతర లింకులుసవరించు

మూస:TamilNaduStateAwardForBestActress