శృంగేరి శారదా పీఠం

(శృంగేరి శారదా పీఠము నుండి దారిమార్పు చెందింది)

శృంగేరి శారదా పీఠం, ప్రముఖమైన హిందూ అద్వైత పీఠాలలో ఒకటి. శంకరమఠాలక పీఠాధిపతులను ఆదిశంకరాచార్యులుగా పరిగణిస్తారు. దేశం నలుమూలలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన నాలుగు పీఠాలలో ఇది ఒకటి.


శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం,

దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం
,

శ్రీ శృంగేరీ శారదా పీఠం, శ్రీముఖం
ఆచార్య:
శ్రీ భారతీ తీర్థ
Styles శ్రీ శ్రీ జగద్గురు
శ్రీ మహా స్వామినః
Residence శృంగేరి
Founder ఆది శంకరాచార్యులు
First Acharya శ్రీ సురేశ్వరాచార్యులు
Formation సా.శ. 820
Website https://www.sringeri.net

చరిత్ర

మార్చు
 
శృంగేరిలో విద్యాశంకర దేవాలయం

శృంగేరీ పీఠాధిపతియైన విద్యారణ్యస్వామి భారతదేశ చరిత్రలో ముఖ్యమైన విజయనగర సామ్రాజ్యం స్థాపింపజేసి హరిహర రాయలు, బుక్కరాయలకు మార్గదర్శనం చేశారు. విద్యారణ్యుని గౌరవార్థం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజధాని నగరానికి విద్యానగరం అని పేరు పెట్టారు. క్రమంగా ఈ నగరానికి విజయనగరమనే పేరు కూడా వచ్చింది. సామ్రాట్టులకు కూడా విజయనగర సామ్రాజ్య చక్రవర్తులనే పేరుతో పాటుగా విద్యానగర చక్రవర్తులనే పేరు కూడా వ్యాప్తిలో ఉంది. సా.శ.1336 రాగి ఫలకం ఆధారంగా "విద్యారణ్యుడి ఆధ్వర్యములో హరిహర రాయలు సింహాసనం అధిష్టించాడు" అని తెలుస్తోంది. విద్యారణ్యుడు హరిహరునికి ఆత్మ విద్య బోధించి "శ్రీమద్రాజాధిరాజ పరమేశ్వర అపరిమిత ప్రతాపవీర నరపతి" అనే బిరుదాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శృంగేరీ శారదా పీఠం పీఠాధిపతి బిరుదులలో "కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య" కూడా చేర్చి చెబుతారు.

1782 నుంచి 1799 వరకూ శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులు హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్లకు శృంగేరీ శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వచ్చి రాజ్యంపై పడినప్పుడు శృంగేరీ మీద కూడా దాడిచేసి ఊరినీ, పీఠాన్ని కూడా దోచుకున్నారు. స్వామివారికి, వారి శిష్యులకు అన్నవస్త్రాలకే లోటువచ్చింది. టిప్పుసుల్తాన్ ఈ సంగతి తెలుసుకుని వారికి ఆహారపదార్థాలు, బట్టలు, ధనం, మరెవరైనా దోచుకోబోతే అడ్డుకుందుకు సైన్యాన్ని ఇచ్చి పంపారు.[1]

శాఖలు

మార్చు

శృంగేరి శారదా పీఠం యొక్క 120 పైగా శాఖలు భారతదేశమంతా విస్తరించాయి. ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదు, సికింద్రాబాదు, గుంటూరు, విజయవాడ, రేపల్లె పట్టణాలలో వీరి శాఖలు ఉన్నాయి.

గురు పరంపర

మార్చు

జగద్గురువులు

మార్చు
  1. ఆది శంకరాచార్యులు (? - 820) (videha-mukti)
  2. సురేశ్వరాచార్యులు (820-834)
  3. నిత్యభోధఘన (834-848)
  4. జ్ఞానఘన (848-910)
  5. జ్ఞానోత్తమ (910-954 )
  6. జ్ఞానగిరి (954-1038)
  7. సింహగిరి (1038-1098 )
  8. ఈశ్వర తీర్థ (1098-1146)
  9. నృసింహ తీర్థ (1146-1229 )
  10. విద్యాశంకర తీర్థ (1229-1333)
  11. భారతీకృష్ణ తీర్థ (1333-1380)
  12. విద్యారణ్య (హంపి పీఠం, విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకులు) (1380-1386 )
  13. చంద్రశేఖర భారతి I (1386-1389 )
  14. నృసింహ భారతి I (1389-1408 )
  15. పురుషోత్తమ భారతి I (1408-1448 )
  16. శంకర భారతి (1448-1455 )
  17. చంద్రశేఖర భారతి II (1455-1464 )
  18. నృసింహ భారతి II (1464-1479 )
  19. పురుషోత్తమ భారతి II (1479-1517 )
  20. రామచంద్ర భారతి (1517-1560 )
  21. నృసింహ భారతి III (1560-1573 )
  22. నృసింహ భారతి IV (1573-1576 )
  23. నృసింహ భారతి V (1576-1600 )
  24. అభినవ నృసింహ భారతి (1600-1623 )
  25. సచ్చిదానంద భారతి I (1623-1663 )
  26. నృసింహ భారతి VI (1663-1706 )
  27. సచ్చిదానంద భారతి II (1706-1741 )
  28. అభినవ సచ్చిదానంద భారతి I (1741-1767)
  29. నృసింహ భారతి VII (1767-1770 )
  30. సచ్చిదానంద భారతి III (1770-1814)
  31. అభినవ సచ్చిదానంద భారతి II (1814-1817 )
  32. నృసింహ భారతి VIII (1817-1879 )
  33. సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి (1879-1912 )
  34. చంద్రశేఖర భారతి III (1912-1954 )
  35. అభినవ విద్యాతీర్థ (1954-1989 )
  36. భారతీ తీర్థ (1989-ప్రస్తుతం)

ప్రచురణలు

మార్చు

పత్రిక

మార్చు

శ్రీ శంకర కృప అనే మాసపత్రికను హైదరాబాదు నల్లకుంటలోని శంకర మఠం ప్రచురిస్తుంది.

తెలుగు పుస్తకాలు

మార్చు
  • శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారితో సంభాషణం - చంద్రశేఖర భారతి (1997)
  • శ్రీ శృంగేరి జగద్గురు చరిత్ర సంగ్రహం - భారతీ తీర్థ (2004)
  • దయాసముద్ర తరంగాలు - భారతీ తీర్థ (2005)
  • జగద్గురు వాణి - భారతీ తీర్థ (2007)
  • జగద్గురు ఉపదేశామృతం - భారతీ తీర్థ (2008)

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.

బయటి లింకులు

మార్చు