శృతి (నటి)
శృతి (జననం 1975 సెప్టెంబరు 18) కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక భారతీయ నటి. రాజకీయవేత్త.
శృతి | |
---|---|
చైర్‌పర్సన్, కర్ణాటక మహిళా అభివృద్ధి సంస్థ | |
In office 2008 – జూన్ 2009 | |
తరువాత వారు | డి. ఎస్. అశ్వత్ |
చైర్‌పర్సన్, కర్ణాటక రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ | |
In office జనవరి 2020 – జూలై 2021 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | గిరిజ 1975 సెప్టెంబరు 18 హసన్, కర్ణాటక, భారతదేశం |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2008–13, 2014–ప్రస్తుతం) |
ఇతర రాజకీయ పదవులు | కర్ణాటక జనతా పక్ష (2013–14) |
జీవిత భాగస్వామి | ఎస్. మహేందర్
(m. 1998; div. 2009)చక్రవర్తి చంద్రచూడ్
(m. 2013; div. 2014) |
బంధువులు | శరణ్ (సోదరుడు) |
వృత్తి |
|
కెరీర్
మార్చుస్క్రీన్ పేరు శృతి అని పిలువబడే గిరిజ 1975 సెప్టెంబరు 18న కర్ణాటకలోని కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది.[1][2] ఆమె నటుడు శరణ్ సోదరి. శృతి తన చిన్న వయసులో పుత్తూరులో ఉండేది. శృతి తన సినీ కెరీర్‌ని మలయాళ చిత్రం స్వంతమ్ ఎన్ను కరుతితో ప్రారంభించింది. ఆమె మొదటి కన్నడ చిత్రం ఆసెగొబ్బ మీసెగొబ్బలో ప్రియదర్శినిగా గుర్తింపు పొందింది. ఆ తరువాత 1990లో శ్రుతి చిత్రంకోసం ఆమెకు నటుడు, దర్శకుడు ద్వారకీష్ శృతి అని పేరు మార్చాడు. ఈ సినిమా 25 వారాల పాటు విజయవంతమైంది. ఆమె 1990లలో కన్నడ సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో ఒకరు. ఆమె ప్రముఖంగా కన్నడ చిత్రాలు చేస్తూనే తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించింది. రెండు దశాబ్దాల తన కెరీర్‌లో మూడు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ సౌత్ అవార్డులను గెలుచుకున్నారు. ఆమె గౌరీ గణేశ (1991), ఆగత (1995), కల్కి (1996), గౌడ్రు (2004), అక్క తంగి (2008), పుట్టక్కన హైవే (2011) వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2016లో టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ మూడవ సీజన్‌ను శృతి గెలుచుకుంది.[3]
ఈ చిత్రాల తర్వాత శృతి ఒళ్ళు గగుర్పొడిచే పాత్రలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారింది. సురేష్ హెబ్లికర్ దర్శకత్వం వహించిన ఆగాథ (1995) చిత్రానికి ఉత్తమ నటిగా ఆమె మొదటి కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. తన కెరీర్‌లో విష్ణువర్ధన్, అంబరీష్, టైగర్ ప్రభాకర్, శివ రాజ్‌కుమార్, శశికుమార్, రమేష్ అరవింద్, జగ్గేష్, దేవరాజ్, సునీల్, అభిజిత్, రామ్ వంటి సినీ పరిశ్రమలోని ప్రముఖ నటీనటులందరితోనూ ఆమె నటించింది. తెలుగులో ఆమె నటించిన చాలా సినిమాలు ప్రముఖ హాస్య హీరో రాజేంద్ర ప్రసాద్‌తో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్‌తో నటించిన పరుగో పరుగు చిత్రంతో ఆమె తెలుగులోకి అడుగుపెట్టింది. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం కల్కి (1996) ఆమెకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర అవార్డును కూడా వచ్చాయి. నవశక్తి వైభవ (2008) 2003లో చిత్రీకరణ ప్రారంభించినప్పుడు శృతికి 100వ చిత్రం. అయితే ఈ చిత్రం ఐదు సంవత్సరాల తర్వాత థియేటర్లలో విడుదలైంది. గౌడ్రు ఆమె 100వ చిత్రంగా నిలిచింది. 2005లో సూర్య టీవీలో ప్రసారమైన మలయాళ సీరియల్ స్త్రీత్వంలో శృతి తన చిన్న తెరపైకి అడుగుపెట్టింది. అలాగే, ఆమె తమిళ్ డైలీ సీరియల్ కార్తిగై పెంగల్ 2012 జూలై నుండి సన్ టీవీలో ప్రసారమైంది. 2016 జనవరిలో రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ కన్నడ 3వ సీజన్‌లో విజేతగా నిలిచిన శృతి. 2017లో కామెడీ టెలివిజన్ సిరీస్ మజా భారతలో జడ్జిగా కనిపించింది.
ప్రస్తుతం ఆమె కర్ణాటక కేడర్‌లో భారతీయ జనతా పార్టీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె 2008లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2009లో ఆమె కర్ణాటక మహిళా, శిశు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా చేశారు. ఆమె 2013లో కర్ణాటక జనతా పక్షలో చేరినా, అది చివరికి 2014లో బిజెపిలో విలీనమైంది.[4]
వ్యక్తిగత జీవితం
మార్చు11 సంవత్సరాలకు చలనచిత్ర దర్శకుడు ఎస్. మహేందర్‌తో శృతి వివాహం జరిగింది. అది 2009లో విడాకులకు దారితీసింది.[5] ఆమె విడాకుల తర్వాత, 2013 జూన్లో జర్నలిస్ట్, దర్శకుడు చక్రవర్తి చంద్రచూడ్‌ని తిరిగి వివాహం చేసుకున్నారు.[6]
మూలాలు
మార్చు- ↑ "Shruthi Biography". www.filmibeat.com. 18 September 2011. Retrieved 10 July 2015.
- ↑ "Bangalore: Shruti Prefers 'Chandra' over 'Indra' - Marries Childhood Friend". daijiworld.com. 8 May 2009. Retrieved 10 July 2015.
- ↑ "Actress Shruthi wins Bigg Boss Kannada season 3". Daily News and Analysis. 31 January 2016. Retrieved 13 March 2017.
- ↑ "Shruthi, Varthur shown door". Deccan Herald. 15 June 2009. Retrieved 13 March 2017.
- ↑ "Actress Shruthi applies for divorce". indiaglitz. 6 May 2009. Archived from the original on 10 మే 2009. Retrieved 18 October 2013.
- ↑ "Kannada star Shruthi marries at Kollur Temple". Archived from the original on 29 March 2020. Retrieved 6 June 2013.