చాగంటి శేషయ్య
చాగంటి శేషయ్య (1881 - 1956) ప్రముఖ రచయిత, చారిత్రకులు.
చాగంటి శేషయ్య | |
---|---|
జననం | 1881 కపిలేశ్వరపురం, తూర్పు గోదావరి జిల్లా |
మరణం | 1956 |
వృత్తి | దివాను |
తల్లిదండ్రులు |
|
వీరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని కపిలేశ్వరపురంలో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య మాత్రమే చదివిన వీరు స్వయంకృషితో, తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో పాండిత్యాన్ని సాధించారు. వీరు ఆంధ్ర ప్రచారిణీ గ్రంథనిలయము అనే ప్రచురణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరైన కొవ్వూరి చంద్రారెడ్డి గారి వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కపిలేశ్వరపురం జమిందారు వద్ద దివానుగా చేరి జీవితాంతం ఆ పదవిని నిర్వహించారు. జమిందారుగారి ప్రోత్సాహంతో తాను రచించిన ఆంధ్ర కవి తరంగిణి అనే మహాగ్రంథాన్ని ప్రచురించారు. 25 సంపుటాల ప్రణాళిక తయారుచేసుకున్నా తన జీవితకాలంలో మొదటి పది సంపుటాలను మాత్రమే ప్రచురించగలిగారు. మొదటి సంపుటం 1946లో వెలువడగా, పదవ సంపుటం 1953లో ప్రచురితమైనది. వీరు ఆంగ్లంలోని కొన్ని చట్టాలను తెలుగులోకి అనువదించి ప్రచురించి, తెలుగు మాత్రమే తెలిసినవారికి చట్టాలను గురించిన సాధారణ జ్ఞానాన్ని కల్పించారు. వీటిలో హిందూ లా, లోకల్ బోర్డ్స్ ఆక్ట్, కో-ఆపరేటివ్ సొసైటీస్ ఆక్టులు ముఖ్యమైనవి. వీరు లోకల్ బోర్డ్స్ పత్రికను 1920 నుండి 1936 వరకు నడిపారు. వీరు 1956లో స్వర్గస్తులయ్యారు.
రచనలు
మార్చు- ఆంధ్రకవి తరంగిణి (1946-1953)[1]
- దుర్గేశనందిని (నవల)
- నవాబు నందిని (1949)(నవల)
- విశ్వ ప్రయత్నము (నవల)
- రాధారాణి (నవల)
- శ్రీ (నవల)
- చంద్రసేనుడు (నవల)
- సమష్టి కుటుంబము[2]
- మద్రాసు లోకలుబోర్డు యాక్టు
- మద్రాసు సహకార సంఘముల యాక్టు
- మద్రాసు నూతన గ్రామపంచాయితీ యాక్టు
మూలాలు
మార్చు- ↑ శేషయ్య, చాగంటి. ఆంధ్రకవి తరంగిణి మొదటి సంపుటము. Retrieved 2020-07-11.
- ↑ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తకప్రతి
- శేషయ్య, చాగంటి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 835-6.